నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, February 17, 2010

పుచ్చ కాయకు వందనం

మనం తినే పండ్లన్నింటిలోకి పుచ్చ కాయని మించింది లేదని నా అభిప్రాయం. అందుకే దాన్ని పొగుడుతూ ఈ టపా.బాగా ఎండ కాసే రోజు పుచ్చ కాయని తింటే వచ్చే హాయి ఇంక ఏ కాయ లేదా పండుని తిన్నా కూడా రాదు.దీనిలో దాహాన్ని తీర్చే ద్రవ పదార్దాలు చాల వున్నాయి.ఎంత తిన్నా లావెక్కుతామన్న భయం లేదు.అంతే కాక షుగర్ అదుపులో ఉంటే డయబెటీస్ రోగులు కూడా దీన్ని తినవచ్చు.ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరుసటి రోజున విరేచనం సాఫీగా అవుతుంది.పీచు పదార్థం ఎక్కువగ ఉండే ఆహారం తింటే పేగు కాన్సర్ వచ్చే అవకాసం తగ్గుతుందని శశ్త్రవేత్తల ఉవాచ.ఒకటే ఇబ్బంది ఏమంటే ఇప్పుడు వేసవి కాలం చివరిదాకా పుచ్చకాయల దిగిబడి వుండటం లేదు.ఏ ఏప్రిల్ మధ్యలోనే ఆగిపొతూంది.అయినా మన శస్త్రవేత్తలు వంకాయని పట్టుకొని దానిలోకి బీటీ బాక్టీరియాని చొప్పించి దాని దుంప తెంచకపోతే వేసవి కాలమంతా దిగుబడి అయ్యేలా కొత్త రకం పుచ్చ వంగడాలని సృష్టించి మనకి వేసవి తాపం తీర్చవచ్చు కదా?

No comments: