నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, February 21, 2010

మానవ జాతికి అన్నీ అరిగిపోయి ఊడిపోనున్నాయా?

ఈ మధ్య పేపర్లలో రెండు సాంకేతిక ఆవిష్కరణల గురించి చదివె రాస్తున్న బ్లాగ్ ఇది.మొదటిది చేతి కదలికలననుసరించి మారే టీవీ.అంటే దాన్ని మార్చటనికి రిమోట్ వాడాల్సిన పని కూడా లేదన్నమాట.టీవీ దగ్గరికి పోయి మార్చే ఓపిక లేని వాళ్ళ కోసం రిమోట్ కనిపెడితే దాన్ని నొక్కడం కూడా పని అనుకొనే బద్దకం రాయుళ్ళ కోసం ఈ కొత్త టీవీని తయారు చేస్తున్నారన్న మాట. ఇంకొకటి డొకోమో సంస్థ తయారు చేయబోయే సెల్ ఫోన్.ఇది కేవలం మన కళ్ళ కదలికల ననుసరించి కాల్ చేయటం, కాల్ ఆన్సర్ చేయడం చేస్తుంది.సెల్ ఫోన్ బటన్లు నొక్కడనికి కూడా ఓపిక లేని పరమ బద్దకిష్టులకోసం ఈ ఫోన్ అన్న మాట.కొంత కాలానికి కళ్ళు కదల్చటం కూడా శ్రమ అని భావిస్తే ఏమి చేస్తారు?దానికి కూడా పరిష్కారం వుంది.మన మెదడులొ ఒక చిప్ ని శాశ్వతంగా బిగించి దాని ద్వారా కెవలం మన మెదడులో ఆలోచనల ద్వారా కాల్ చేయడం లేదా అన్సర్ చేయడం చేయవచ్చు. ఆ టెక్నాలజీ కూడా ఎంతో దూరంలో లేదు.అయితే ఏ అంగమూ పని చేయకుండా ఈ మనిషి అనే వాడు ఏమి చేయాలన్నట్టు?పని లేనివాడి బుర్ర దెయ్యాల కార్ఖానా అన్నట్టు తనని తాను నశనం చేసొకోవటానికో లేదా పక్క వాడిని నాశనం చేయడానికో కావలసిన ఆలోచనలు చేయవచ్చు.చాలకాలం క్రితం తెలుగులో ఒక సైన్స్ ఫిక్షన్ నవల చదివాను బుద్ధిజీవి అని.ఎన్నార్ నంది అనుకొంటాను దాన్ని రాసింది.భవిష్యత్తులో మనిషి ఏ అవయవాన్నీ వాడకపోవడంతో డార్విన్ సిద్ధంతాన్ని అనుసరించి అవన్నీ నశించి పోయి కేవలం మెదడు ఒక్కటే మిగులుతుంది అనేది దానిలో ప్రదానాంశం.ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఆ గడియ రావడనికి ఎంతో కాలం పట్టదేమో అనిపిస్తోంది.

3 comments:

Anonymous said...

మీరు Wall-E అనే యానిమేషన్ సినిమా చూశారా.. ఇలాంటి విషయాన్ని ఆధారంగా తీసిన సినిమా అది. మీకు వీలుంటే తప్పక చూడండి.

Saahitya Abhimaani said...

Good forecast. Technology should not be used just because it is available. Technology should be used only where it is necessary.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Ravi,I have seen wall-E.should have mentioned it in the blog.Sorry for not writing in Telugu.The Lekhini page had not opened when I write this answer.