నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, February 23, 2010

ఈ చెత్త వెధవలు ప్రజా ప్రతినిధులా?

"నా మీద 80 కేసులున్నాయి.ఎవడూ నన్నేమీ చేయలేడు","నేను పన్నేండు ఏళ్ళప్పుడే మర్డర్ చేశాను తెల్సా?" ఇవి ఎవడో రౌడీ కొట్టిన గప్పాలు కాదు. ఒక ఎమ్మెల్యే తమ్ముడు సగర్వంగా చెప్పిన మాటలు.వాడిని కాపాడుతూ వాడి అన్న, వాళ్ళీదరినీ కాపాడడానికి పోలీసులు, ఈ మొత్తాన్నీ కంటికి రెప్పలా కాపాడే కాటికి కాళ్ళు చాపుక్కూర్చున్న ముఖ్యమంత్రి ముసలి నక్క.వీళ్ళ బారినుండి ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడగలరు?ఇటీవలి కాలంలో ప్రజా ప్రతినిధులమని చెప్పుకొనే రాక్షసులు తమ నిజ స్వరూపం పబ్లిగ్గా బయట పెట్టడం ఇది మొదటి సారి కాదు.ఆ మధ్య రాయలసీమ ఫాక్షన్ తమ్ముడు టీవీ కెమెరాల సాక్షిగా ట్రాన్స్ పోర్ట్ అధికారులపై ఫైళ్ళు విసిరేసి సభ్యత కల మనుషులు ఉచ్చరించలేని భాషలో బోతులు తిట్టడం మమందరం లైవ్ లో చూశాం.ఇంకొంత కాలం క్రితం స్వయానా ఇంజినీరు అయిన మరొక రాయలసీమ ఎంపీ నీటి పారుదల ఇంజినీర్లను తను వాళ్ళ అమ్మ,అక్క,ఆలిని ఏం చేయాలనుకొంటున్నాడో స్వచ్చమైన సంస్కృతంలో టీవీ కెమెరాల ముందు మనందరి చెవులు రింగుమని మారు మోగేలా వినిపించాడు.ఇవన్నీ పట్టించుకొంటే సీమలో ఉద్యోగం చేయలేమని ఆ బాధిత ఇంజినీరు తరువాత అవే టీవీ కెమెరాల ముందు వాపోయాడు పాపం. అంతకు కాస్త ముందు బలిసిన ఎంపీ ఇంకొకడు మళ్ళీ కెమెరాల సాక్షిగా ఒక ప్రభుత్వ ఉద్యొగి చెంపపైన తన బాక్సింగ్ నైపుణ్యం మనందరికి చూపించడం కూడా మనం చూశాం.అయితే మనం కొంచెం వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాల్సిన అవసరం వుంది.తమ పార్టీ అధికారంలో ఉండగా ఇలాంటి చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకో వద్దంటే ఎలా?అసలే తాము కాగ్రెస్ కోతులు, పైపెచ్చు అదికారమనే కల్లు తాగాము.ఇప్పుడు అదుపులో వుండాలంటే అది న్యాయమేనా? ఫ్రజలే కొంచెం ఆలోచించి సర్దుకొపోవాలి.

1 comment:

Krishna K said...

కాని ఒక్క విషయం ఈ రోశయ్య తరుపు గుండాలను మీరు అభినందించాలండి. ఇప్పటివరకూ సీమలోనేనా, కోస్తా లో లేదేమిటా అనే ఈ సంస్కృతిని చక్కగా కాస్తో, కూస్తో ప్రశాంతతకు పేరయిన చీరాల ప్రాంతానికి తీస్కొచ్చారు.
ఆ కుటుంబం గురించి తెలిసినవాడిగా, తను కావాలనుకొనేది అతి త్వరలో మంత్రి, వీలయితే ముఖ్యమంత్రి, తనకి ideal వంగవీటి రంగా, ఇక అర్ధం చేసుకోండి పరిస్థితి.

అసలు బహిరంగంగా గుండా గిరి చేసే వీళ్లకంటే, పైన పంచె వేసుకొని నీతులు చెప్పే కాశయ్యను అనాలి, తన వాటాలకోసం ఇలాంటి వారిని పెంచి పోషిస్తున్నందుకు, ఆ రకంగా ys కనీసం కనిపించేవాడు, కాశయ్య మరీ డేంజర్. అచ్చం ప్రతిఘటన, శివ సినేమాలలో కోట క్యారెక్టర్, చీరాల వాళ్లకు అది ఇంతకముందే తెలుసు, ప్రస్తుతం మిగతా వాళ్లు నిజమా రోసయ్యలో ఇంతటి అపరచితుడు కాశయ్య ఉన్నాడా అనుకొంటున్నారు? మా మిత్రులతో రోశయ్య గురించి నేను చెప్పినప్పుటు ఈయన సామాన్యుడు కాదు, కోటా కేరెక్టర్ అచ్చం , అంటే ఎవ్వరూ నమ్మే వారు కాదు. ఇప్పుడు అర్ధం అవుతున్నది వాళ్లకు.
ఏమాటకామాట MLA అన్నగారు చెప్పింది అక్షరాల నిజం, తను 12 ఏళ్లకే తన తండ్రితో కలసి వెళ్లి బరిశె ల తో, ఓ ముగ్గురను అందునా ఓ పెద్ద వయసు ఉన్న మహిళను చేనేత వాళ్లను చంపి పట్టపగలు, ఆ కేసులో ముద్దాయి అన్నది నిజమే. దానినే చక్కగా పోలీసు స్టేషన్లో కూర్చొని CI ముందే వల్లె వేస్తూ ఉంటే చప్పట్లు కొట్టాల్సింది పోయి ఏమిటీ ఈ గోల అని ఆ MLA గోల.
ఏమి చేద్దాం కాంగీ అందునా రోసయ్య మార్కు గుండాయిజం.