నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, February 26, 2010

డాక్టర్ల బారినుడి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి కొన్ని చిట్కాలు

వైద్యో నారాయణొ హరీ అని రెందు రోజుల క్రితం ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీరు రాసిన ఒక టపా చదివాక ఇది రాయాలనిపించింది.పాపం ఆయన గ్యాస్ ట్రబుల్ కోసం మూడో నాలుగో వేలు తగలేసిన బాదలో రాసిన కడుపు మంట టపా అది.
ఈ టపా రాయడానికి నాకున్న అర్హతల గురించి ఒక చిన్న మాట.ఇంటర్లో నేను బైపీసి తిసుకొని డాక్టరవుదామని తీవ్రంగా క్రుషి చేశాను.కానీ ఓపెన్ కేటగరీలో సీటు తెచ్చుకోగల సామర్ధ్యం కానీ ప్రైవేటుగా కొనుక్కొగల తాహతు గానీ లేక ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక చిన్న వ్యాపారం నడుపుకొంటున్నాను గానీ ఆనాడు నాతో కలిసి చదివ డాక్టర్లైన నా కజిన్స్,ఫ్రెండ్స్ చాలామంది నాతో టచ్ లో వున్నారు.వాళ్ళలో కొందరు స్పెషలిస్టులు, మరి కొందరు సూపర్ స్పెషలిస్టులూ వున్నారు.తరచూ వాళ్ళతో కలిసి మాట్లాడుతూ వుండడం వలన చాలా మటుకూ ఇన్ సైడర్ ఇంఫర్మేషన్ నాకు తెలుసు.దాన్ని ఉపయోగించి ఈ బ్లాగ్ రాస్తున్నాను.
1.ఓవరాక్షన్ వద్దు: మొదటిసారి చాతీలో నొప్పి వస్తే అది నొప్పి కన్నా మంటలాగా అనిపిస్తే,ఆ వ్యక్తి వయసు పతిక, ముప్పై యేళ్ళు అయితే 99% అది గ్యాస్ట్రైటిస్ అయి వుంటుంది.దానికి కార్డియాలజిస్ట్ దగ్గరికి ఆత్రంగా పరుగెట్టుకొని పోతె అతడికి వాటంగా చిక్కిన టార్గెట్ అవుతాం.తెలివైన రిస్క్ తక్కువగ వున్న పనేమిటంటే ఒక ఎంబీబిఎస్ డాక్టర్ని కలవడం.ఆ సారు కూడా రెండు మూడు టెస్టులతో బాదేసే అవకాశం వున్న స్పెషలిస్టు కొట్టే దెబ్బలు కొట్టడు. మనకి బాగా తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ వుంటే అది అన్నిటి కన్నా ఉత్తమం.
అలాగే మామూలు నడుము నొప్పికి కిడ్నీ ప్రాబ్లం అని ఊహించుకొని నెఫ్రాలజిస్టునో, యూరాలజిస్టునో కలవడం కూడా బుద్ధి తక్కువ పనే అవుతుంది.బాగా వున్న కిడ్నీలని అవి బాగా ఉన్నాయని తేల్చాలంటే అయిదు వేలకి తక్కువ ఖర్చవదు.
2.అతి తెలివి ప్రదర్శించవద్దు: ఒక వేళ మన డాక్టర్ మన్ అద్రుష్టం కొద్దీ టెస్టులేమీ రాయకుండా మందులు వాడి చూడాలనుకొంటే, స్కానింగ్ తీయించి చూద్దామా అనో పరీక్షలు చేయించి చూద్దామనో మనం లీడ్ ఇవ్వ కూడదు.ఇచ్చామంటే మన పని మటాషే.
3.తోకలు చూసి మోసపోవద్దు: పొడవాటి తోక వున్న ప్రతి కోతీ హనుమంతుడు కాదు.అలాగే పేరు చివర ఎక్కువ డిగ్రీలు తగిలించుకూన ప్రతి డాక్టరూ గొప్ప వాడు అయి వుండాల్సిన అవసరం లేదు.అసలు చాలా డీగ్రీలు ఎందుకూ పనికి రానివీ, అర్ధం లేనివీ అయి వుంటాయి.చాలా బాగం అవి మెంబర్ షిప్ డిగ్రీలు.ఉదాహరణకి ఈ సైట్ లో సభ్యులందరూ తమ పేరు చివర ===== అని రసుకోవచ్చు.అంటే మెంబర్ ఆఫ్ కూడలి వెబ్ సైట్ అని అర్ధం.కాబట్టి పొడవాటి తోక వున్న డాక్టర్ ఖచ్చితంగా గొప్పవాడు అయి వుండాలసిన్ అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఎక్కువ ఫీజు మాత్రం తీసుకొనే వాడు అయ్యుంటాడు.
4. చివరిగా హాస్పిటల్ బిల్డింగ్ షోకు, ఇంటీరియర్స్ తళుకూ, వాళ్ళిచ్చే ఫోల్డర్స్ క్వాలిటీలు చూసి మోసపోవద్దు.స్టాఋ హాస్పిటల్స్ కన్నా మామూలు కేసుల్లో విడిగా ప్రాక్టిసు చేసే వాళ్ళు కొంచెం సేఫ్. తక్కువ బాదుతారు. పెద్ద హాస్పిటల్స్ లో డాక్టర్లకి కొన్ని టార్గెట్స్ వుంటాయి.ఆవసరం వున్నా లేకపోయినా వాళ్ళు కొన్ని టెస్టులూ,స్కాన్నింగులూ తీయిస్తారు.

5 comments:

jeevani said...

చాలా బాగా చెప్పారు. జనాలు కూడా అలాగే తయారయ్యారు. నిస్వార్థంగా పని చేసే డాక్టర్లు కొందరైనా ప్రతి ఊర్లోనూ ఉంటారు. అయితే వాళ్ళు టెస్టులు రాసివ్వరు కదా అందుకు వారు గొప్ప డాక్టర్లు కాదని ప్రజల ఫీలింగ్. మీరు చెప్పిన విషయాలు తప్పక గుర్తు పెట్టుకోవాలి.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Please read MOKW in the place ====.

మందాకిని said...

ఇలాంటి విషయాలు నేనూ కొంతమందికి చెప్పి చూశానండీ! చాలా మటుకు, అబ్బే, డాక్టర్స్ అలా ఉండరు అనేవాళ్ళే. మూఢభక్తిని విమర్శించే వాళ్ళు కూడా మనమూ డాక్టర్ ని మూఢంగా నమ్మకూడదంటే వినరు. మీరు చెప్పినట్టు వీళ్ళే డాక్టర్ కి సలహాలిస్తారు స్కానింగ్ అదీ ఇదీ అని. పాపం డాక్టరు అవసరం లేదండీ అన్నా వినరు.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

దీన్ని ధూల అంటారు.దాన్ని తీర్చే పని సదరు డాక్టరు చూసుకొంటాడు.ఫైళ్ళ కొద్దీ రిపోర్టులూ,ఎక్స్-రేలు,స్కానింగులూ.....ఇద్దరూ హ్యాపీసు.

శరత్ 'కాలమ్' said...

మంచి ఉపయోగపడే సమాచారం ఇచ్చారు సంతోషం. ఇలాంటి రాబందు డాక్టర్లతో నాకూ కొన్ని అనుభవాలు వున్నాయి. వ్రాయాలి.