నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, February 7, 2010

అనవసర ఆపరేషన్ల ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీలో అవసరం లేకపోయినా యువతులల్కు గర్భ సంచి తొలగించే హిస్టెరెక్టమీ ఆపరేషన్లు కొన్ని హాస్పిటళ్ళు,డాక్టర్లూ చేస్టున్నట్లు టీవీలలో వచ్చిన కధనం మీరందరూ చూసే వుంటారు.ఆ న్యూస్ లో సమగ్రత లేదనిపించి నాకు బాగ తెలిసిన, బంధువులు అయిన కొందరు డాక్టర్లతో మాట్లాడితే అనేకమైన అశ్చర్యం కలిగించే విషయాలు తెలిశాయి.
ఆరోగ్యశ్రి రాకముందే ఈ ఆపరేషన్ కొంచెం ఎక్కువ గానె చేసేవారు.అనేక జిల్లా కేంద్రాలలో ఈ ఆపరేషన్ ని 8-15 వేలలోపు ఖర్చుతో చేసే వారట.అది లాపరాటమీతో అంటే పొట్ట కోసి చేస్తే. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఈ ఆపరేషన్ కి 35 వేలు ప్యాకేజి వుంది.అయితే ఇది లాపరోస్పి అసిస్టెడ్ వగైనల్ హిస్టెరెక్టమీ అయితేనే.అంటే పొట్ట కోయకుండా కేవలం కొన్ని రంధ్రాలు వేసి గర్భశయాన్ని యోని మర్గం ద్వారా తొలగించడం.ఇది ఆదునాతనమూ,క్లిష్టతరమూ అయిన ఆపరేషన్.ఇది పాత ఆపరేషన్ అంటే పొట్ట కోసి చేసే దానికన్నా ఖచ్చితంగా మెరుగైందా అంటే తెలియదు అనేది వారి సమాధానం.ఇప్పటికీ ఏది మెరుగు అనే విషయం పూర్తిగా తేలలేదు అంటారు వాళ్ళు.ప్రతి కాంఫరెన్సులోనూ ఏది మంచిది అనే విషయమ్మీద నిపుణులు చర్చిస్టూనే వున్నారట.
అయితే పది వేలతో పొయేదానికి 35 వేలు ఇస్తూ వుంటే అందులోనూ ఎలంటి బేరసారాలూ లేకుండా వస్తూ వుంటే చేతులు ముడుచుకుని డాక్టర్లు మాత్రం ఎందుకు వుంటారు.అందులో అత్యధిక భాగం లక్షలు పొసి డిగ్రీలు కొన్న బాపతాయే.
ప్రభుత్వాసుపత్రిలో చేయగలిగే సింపుల్ ఆపరేషన్ ని ప్రభుత్వమే డబ్బులిచ్చి దాని తాలూకూ క్లిష్టతరమైన వెర్షన్ ని చేయించడం ఎంతవరకూ సబబు అనేది కొందరు ఎథిక్స్ మిగిలి వున్న డాక్టర్ల ప్రశ్న.ఈ విధంగా ప్రబుత్వమే అనవసరంగా ఈ ఆపరేషన్ జరిగేలా ప్రొత్సహుస్తోంది అంటారు వాళ్ళు.
ఈ కేటగిరీలో ఇంకొకటి అపెండిక్స్ మరియూ గాల్ బ్లాడర్ ఆపరేషన్. అపెండిసైటిస్ అనేది ఏ చిన్న ప్రభుత్వాసుపత్రిలో నైనా అతి సాధారనణంగా అయిదారు సెంటీ మీటర్ల కోతతో అరగంటలో చేసే ఆపరేషన్.దీనిని ఆరోగ్యశ్రీలో 30 వేల ప్యకేజీతో ల్యాపరోస్కోపీ ద్వారా చేయిస్తున్నారు.కాబట్టి ఇప్పుడెవరూ కడుపు నొప్పి అని ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని వచ్చే పేషంటుకి మందులు వాడి చూడటం లేదు.
అల్ట్రా సౌండ్ స్కనింగ్ లో అపెండిసైటిస్ అని అనుమానం వ్యక్తమైతే ఆపరేషన్ చేస్తున్నారు.ఇంతవరకూ బానే వుంది.స్కానింగ్ లో ఏమీ లేకపోతే ఎలా?స్కానింగ్ కూడా వాళ్ళ హాస్పిటల్ లోనే వుంటే స్కానింగ్ రిపోర్ట్ మార్చటం చిన్న పని.లేదంటే అలవాటుగా ఈ డాక్టర్ పేషంట్లుని పంపి స్కానింగ్ తీయించే స్కానింగ్ సెంటర్ కి ఫోన్ చేసి చెబితే ఈయనకి కావలసిన రిపోర్ట్ వస్తుంది.తరువాత పెషంటుని ఆపరేషన్ కి వొప్పించడం చిన్న పని.
నీకు ఆపరేషన్ అవసరం, కార్డు మీద ఫ్రీగా చేస్తాము, వెంటనే చేయకపోతే కష్టం అంతే వాడు ఒప్పుకొని తీరతాడు.
ఇక్కడితో ఇది పూర్తవలేదు.ఇంకొక మెలిక ఉంది.గాల్ బ్లాడర్ ని తొలగించే ఇంకొక ఆపరేషన్ కూడా 35వేల ప్యాకేజీతో ఆరోగ్యశ్రీలో వుంది.అదే స్కానింగ్ రిపోర్ట్ లో గాల్ బ్లాడర్ లో రాళ్ళు వున్నట్టు వుంటే దానికి ఇంకొక 35 వేలు వస్తుంది.అపెండిక్స్ బాటు దాన్నీ తీసి వేస్తే దానికీ డబ్బు వస్తుంది.
మాటకారి డాక్టరైతే ఈ రెండో ఆపరేషన్ గురించి ముందుగా చెప్పి పేషంటుని ఒప్పించడం పెద్ద విషయం కాదు.నీకు కడుపులో ఇంకొక ప్రాబ్లం కూడా వుంది.ఇప్పుడే ఆపరేషన్ చేసుకొంటే మంచిది. పనిలో పనిగా అయిపొతుంది అంటే వాడు ఒప్పుకొని తీరతాడు.ఏమో అనుకొంటే వాడికి చెప్పకుండ చేసినా ఏమీ కాదు. ఇది కూడా ల్యాపరోస్కోపిక్ ఆపరేషనె. పైకి కుట్లు వుండవు. కేవలం మూడూ నాలుగు రంధ్రాలు వుంటాయి అంతే.
ఒకవేళ పేషంట్ కొంచెం లిటిగెంట్ అయి నాకు చెప్పకుండా ఆపరేషన్ చేసే హక్కు నీకు లేదు అని మాట్లాడితే ఆపరేషన్ మధ్యలో గాల్ బ్లాడర్ లో చీము కనిపించింది అందుకే తిసేశాం అంటే అయిపోతుంది.
ఆపరేషన్ చేశామా లేదా అన్నదానికి ఋజువులు ఏమీ వుండవా అని అడిగితే, ఆపరేషన్ చేసేటప్పుడు కడుపులో దృశ్యాలు సీడీలో తీసి సబ్ మిట్ చేయాలి.ఇది చాలా సింపుల్ గా మ్యానేజ్ చేయ వచ్చు.అస్సలు నూటికి తొంభై మందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు వుంటయి.వాటిని ఏమీ చేయాల్సిన అవసరం వుండదు.ఆరోగ్యశ్రీ పుణ్యమా అని అలాంటి వాటికి కూడా గాల్ బ్లాడార్ తీయించుకొనే సౌలభ్యం కల్పిస్తోంది మన ప్రభుత్వం.
1.ఆరోగ్యశ్రీ పధకాన్ని విమర్శించడం నా ఉద్ధెశ్యం కాదు.కొన్ని లోటు పాత్లు ఎత్తి చూపడమే నా పని.
2.ఇందులోని టెక్నికల్ విషయాలు ఇంకొకరు చెప్తే నేను తెలుసుకొన్నవి.మెడికల్ గ కానీ ఆరోగ్యశ్రీ పధకం గురించి కానీ ఏవైనా తప్పులు దొర్లితె సవరించుకొగల వాడను.

4 comments:

Sujata said...

ఆరోగ్య శ్రీ పుణ్యమా అని - కార్పరేట్ హాస్పిటళ్ళలో బెడ్లు ఖాళీ ఉండట్లేదు. ఎమర్జెన్సీ అంటూ పరిగెడితే, ప్రభుత్వ ఆస్పత్రి కి వెళ్ళండి - మా దగ్గర నో వేకెన్సీ అంటున్నారు. అంత ఎమర్జెన్సీ కాకుండా ఉన్నట్టయితే, ఆపరేషన్లూ, పరీక్షలూ చేయించుకోవడానికి వారాల తరబడి (ముఖ్యంగా స్పెషాలిటీ హాస్పటళ్ళలో) వేచి ఉండాల్సి వస్తుంది. ఇన్ని డబ్బులు ఇన్ష్యూరెన్సు కంపెనీలకూ, కార్పరేట్ హాస్పెటళ్ళకూ పంచే ప్రభుత్వం, అదే నిబద్ధత ప్రభుత్వ హాస్పెటళ్ళలో చూపిస్తే బావుండేది. కానీ మౌలికంగా చూస్తే, ప్రభుత్వ పధకాలన్నీ ప్రజా సంక్షేమం కోసమే. వీటిల్లోని లూప్ హోల్స్ - సరయిన విజిలెన్సు లేకపోవడం వల్ల, ప్రజారోగ్యం తో ఆటలాడుతున్నాయి.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ ఆరోగ్య శ్రీలో పెద్ద రాకెట్ నడుస్తూందని నాకు తెలిసిన ఒక డాక్టర్ఫ్ చెప్పాడు.దాని గురించి వివరాలు సేకరించి బ్లాగ్ రాస్తాను.

AMMA ODI said...

చాలా కష్టపడి మంచి సమాచారం సేకరించి, వ్రాసారండి. ఇలాంటి టపాలు మీనుండి రావాలని కోరుకుంటూ... ధన్యవాదాలు.

kvsv said...

ధనం మూలం మిధమ్ జగత్ ....దబ్బన్దీ బాబూ డబ్బు మహిమా అనవసరమయిన ఆపరేషన్ ల గురించి మీరు చెప్తున్నారు ...ఆపరేషన్ అయ్యాక ఆ పేషెంట్లు యెంత నరకయాతన అనుభవిస్తున్నారో నా దగ్గర రికార్డు వున్నది ఆ కేసుల వివరాలు మీకు త్వరలో వివరిస్తా ...పేషెంట్ మాటల్లోనే...ఆ తర్వాత మీరు డాక్టర్ల మొహంమీద *****వెయ్య కుండా వుందరు.....