నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, February 25, 2010

సచిన్ పాంటింగ్ కన్న గొప్ప వాడేమీ కాదు!!!!!!!!

ఆశ్చర్య పోకండి.ఇది నిజం.సచిన్ పాంటింగ్ కన్నా మాత్రమే కాదు, గత నలభై చిల్లర యేళ్ళలో వండే క్రికెట్ ఆడిన అందరికన్నా కూడా గొప్పవాడు.సచిన్ వచ్చిన నాటి నుండీ అతన్ని మిగతా క్రికెటర్లతో పోల్చి అతడి ప్రతిభని అంచనా వేయడం విశ్లేషకులకి ఒక పరిపాటి అయింది.మొదట్లో లారాతో అటుపిమ్మట సరిగ్గా రెండేళ్ళు కూడా ఉఛ్ఛ స్తితిలో నిలువలెని కోన్ కిస్కా గాళ్ళతోనూ పోల్చి స్పోర్ట్స్ కాలం లు స్పోర్ట్స్ రిపోర్టులూ నింపిన వారు ఇంక అవన్నీ చాలించవచ్చు.సచిన్ తన తాజా ఇన్నింగ్స్ తో వీటన్నిటికీ తెర దించాడు.ఇప్పుడిక సచిన్ వండే క్రికెట్లో ఎవరూ ఇప్పుడిప్పట్లో అందుకోలేని మహోన్నత స్తాయికి ఎదిగిపోయాడు.ఇప్పుడున్న వాళ్ళ ఇకపై వచ్చే వాళ్ళూ సచిన్ తో పోల్చుకొని తమ స్తానం ఎక్కడో చూసుకోవాలి తప్ప అతనితో పోల్చుకో కూడదు.ఇంత కలం సచిన్ పేరిట లేని ఆ ఒక్క రికార్డూ ఇప్పుడు అతని వశమయ్యింది.ఇప్పుడు పాంటిగ్ తో పోలిస్తే సచిన్ కొంచెం తక్కువగా ఉన్నది కేవలం ఒక్క విషయం లోనే.అదేమిటంటే తన దేశానికి ప్రపంచ కప్ సాధించలేక పోవటం.ఎంత గొప్ప వాడైనా కప్ గెలవాలంటే ఒంటి చేత్తో సాధించడం అయ్యే పని కాదు. మిగిలిన టీం సభ్యులందరూ రాణించినప్పుడే అది సధ్య పడుతుంది.కేవలం ఆ ఒక్కటీ సాధించాలనే సచిన్ వచ్చే ప్రపంచ కప్ వరకూ క్రైకెట్ అడాలని నిర్ణయించుకొన్నాడని నా అభిప్రాయం.2011 ప్రపంచ కప్ లో భారత జట్టు లోని సభ్యులందరూ సమిష్టిగా రాణించి ప్రపంచ కప్ గెలుస్తారని, సచిన్ ఖాతాలో ఆ ఒక్క మిగిలిన ఘనతని కూడా చేరుస్తారనీ ఆశిద్ధాం.కాబట్టి సచిన్ ఫాంటింగ్ కన్నా గొప్పవాడు కాదు.నలభై yeళ్ళ వండే క్రికెట్లోని ఆట గాఆళ్ళందరికన్నా గొప్ప వాడు.

3 comments:

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

Title is tempting... :-)

నాగప్రసాద్ said...

2003లో ఆ ఛాన్స్ మిస్సయ్యింది. ఏమో మరి ఇప్పుడు అదొక్కటే మిగిలి ఉంది. చూద్దాం.

Mady said...

If selection committee is transparent in team selection, we are the winners, if not we can never win ODI world cup.