నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, February 26, 2010

విమర్శకులందరూ(నాతొ సహా)ఇక నోళ్ళు మూసుకోవాలి

కొంత కాలం క్రితమే వోడూ సచిన్ టెండుల్కర్ ని విమర్శించేవాడే.వయసైపోయిందని, పస తగ్గి పోయిందని,పనై పోయిందనీ. నేను కూడా ఒక వెబ్ సైట్లో సచిన్ చేతి కర్ర పట్టుకొనె వయసు వచ్చిందాకా ఆడతాడా? అని ఒక వెబ్ సైట్లో రాశాను. ఒక రాజకీయ నాయకుడు బహుశా బాల్ థాకరే అనుకొంటా పేరులో టెన్ వుంది కాబట్టి సచిన్ టెన్ రన్స్ కి రెండు,మూడు అటొ ఇటో చేసి అవుతున్నాడని ఒక జోక్ కూడా వేశాడు.
మా అందరి నోళ్ళూ ఒక కళాత్మక, చరిత్రాత్మక ఇన్నింగ్స్ తో మూయించాడు లిటిల్ మాస్టర్.ఇక ఆ క్రికెట్ మేధావిని ఎవరు కూడా పన్నెత్తు మాట అనకుండా చేశాడు.కాబట్టీ విమర్శకులారా మనందరం నోళ్ళు మూసుకొని సచిన్ బ్యాటింగ్ ని అనందించుదాం.

2 comments:

uma blog said...

chusaaraa ...........inka meedata vimarsa chese mundu okatiki padi saarlu alochinchi cheyyandi

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Yes,Uma.