నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.
Search This Blog
Friday, January 29, 2010
ఇదేమి తెలుగురా బాబూ?
నిన్న మార్కెట్లో ఒక పెద్ద్ ఫ్లెక్స్ బోర్డ్ ఛూశాను. అది కోల్గేట్ వారి ప్రకటన.దానిలో కాపీ ఏమిటంటే "పిల్లలలో ప్రతి 2లొ 1కి దంత క్షయం వస్తుంది"కాస్సేపు జుట్టు పీక్కొన్నాక నాకు అర్దమయ్యింది ఏమంటే పిల్లలో ప్రతి ఇద్దరిలో ఒకరికి దంత క్షయం వస్తుంది అని.నా కజిన్ ఒకడు చెన్నయిలో అడ్వర్తైజింగ్ కంపెనీలో వుంటే వాడినడిగాను ఎందుకు వాళ్ళ బాష ఇలావుంటుందని.వాడు చెప్పింది ఏమంటే యాడ్ కంపెనీలు కాపీ రైటర్స్ ని నియమించే సమయంలో అన్నీ చూస్తారు ఒక్క బాష తప్ప.అందుకే ఈ విదంగా బాష ఇలా ఖూనీ అయిపోతూందట.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
హిందీ నుంచో ఇంగ్లీష్ నుంచో తెలుగులోకి అనువదించేటపుడు పదాలు కొన్ని మారకూడదని సదరు కంపెనీల వాళ్ళు కూడా కొన్ని సార్లు పట్టు బట్టి కూచుంటారు.
ఒక కొబ్బరి నూనె కంపెనీ వాళ్ళు ఆ నూనె డబ్బా సైజు ఇప్పుడు పెరిగిందని చెప్పడానికి, ఆ నూనె శుద్ధంగా ఉంటుందని చెప్పడానికి ఎలా రాశారో తెలుసా.."ఇప్పుడు శుద్ధత ఎత్తు మరింత పొడవు" ! ఎత్తేమిటి, పొడవేమిటి?
ఇలాంటివి రాచమల్లు రామ చంద్రా రెడ్డిగారు రాసిన "అనువాద సమస్యలు" పుస్తకంలో బోలెడు దొరుకుతాయి. అంతకంటే ఎక్కువగా రోజూ కాసేపు టీవీ చూస్తే దొరుకుతాయి.
మనం ఎలాగూ వీళ్ళ భాషను సంస్కరించలేం కాబట్టి కాసేపు నవ్వుకోడానికి ఉపయోగించుకోవాలి వీటిని!
"ఇప్పుడు శుద్ధత ఎత్తు మరింత పొడవు" ! ఎత్తేమిటి, పొడవేమిటి?
సుజాత గారు: నాకు బాగానే అర్థం అయ్యింది... కేవలం వాక్యాన్ని మాత్రమే చూస్తే తప్పు పట్టొచ్చు.. కానీ అక్కడ బొమ్మ కూడా పడుతుంది కదా. శుద్దత ఎవరు.... అక్కడ వాడు శుద్దత కి మరో పేరు మా కొబ్బరి నూనే అని చెప్పాలనుకున్నాడు..కదా..
అవునూ .....ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తదా మరి.. ?
ధర్మం గోరూపిణి కాబట్టి నాలుగుపాదాలమీద నడిచేది. ఒకప్పుడు.
-Indian Minerva
అవును నవ్వుకోవడానికే ఉపయోగించాలి. కానీ ఎటొచ్చీ మన భావి బారత పౌరులు ఈ భాషకు అలవాటు పడితే ప్రమాదం.
Bhale chepparu colgate ad gurinchi
navvaleka chachha..
adi pillalo prati 2 pallalo oka pantiki danta kshayam vastundi .... anna meaning vastondi.
migilina mee blogs kuda superrrr
mukyamga samakaleena sangatula meeda mee chaloktulu.. sootiga vediga nijam la ..bavunai daniki todu mee haasyam...super...i mean atyadbhutam!! kepp it up
Post a Comment