నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Loading...

Sunday, January 17, 2010

ఉపొద్ఘాతం

ఈ బ్లాగ్ రాయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం వార్తా పత్రికలు చదివినప్పుడు నాలో కలిగే భావాలు అందరితో పంచుకోవడం. కొన్ని వార్తలు చదివినప్పుడు పరుగెత్తుకెళ్ళి కొందరిని చొక్కా పట్టుకొని ఎడా పెడా దులిపేయాలని అనిపిస్తుంది. ఇంకొందరిని చెప్పు తీసి వాయింఛాలని అనిపిస్తుంది. ఇంకోసారి కొంతమందిని మల్ల్లె పూల మాలతో సత్కరింఛాలని కూడా అనిపిస్తుంది. కానీ ఏదయినా రిస్కుతో, ఖర్ఛుతో కూడుకొన్న విషయం. ఏ వార్త పత్రిక వాడు కూడా మొదటి రకం లేఖలు తన పత్రికలో ప్రఛురింఛే సాహసం ఛేయడు. ఎవరైనా నాక్కొంఛెం మెంటల్ టైపులో ప్రఛురింఛినా పక్క రోజు ఆ పత్రిక ఆఫేసు అద్దాలు కొండొకఛో స్టాఫు తలలు పగలడం ఖాయం.అందుకే నేను ఏ మార్గం ఎంఛుకొన్నాను. ప్రతి టపా ఛివర నా మెయిలు అడ్రసు ఉంటుంది. మీ అభిప్రాయాలు నాకు పంపవఛ్ఛు.

No comments: