నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, February 4, 2011

సర్వం త్యాగం చేయడమంటే ఇదేనా జగన్ బాబూ? అయితే సర్వం త్యాగం చేయడానికి నేను రెడీ?


పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి కుటుంబంలో చిచ్చు పెట్టారు. ఇదేనా ఆయనకు మీరిచ్చే బహుమానం అని నిప్పులు కక్కాడు జగన్ ఇవాళ. సర్వం త్యాగం చేయడమంటే ఏమిటో నాక్కాసేపు అర్ధం కాలేదు. జగన్‌ని అడిగి కనుక్కోవాలంటే ఆయన ఫోన్ నంబర్ నాదగ్గర లేదు. ఆయనచేత ఓదార్చబడ్డ వాళ్ళెవరైనా తెలిస్తే బావుండేది. ఓదార్పులో వాళ్ళకి తన ఫోన్ నంబర్ ఇచ్చి ఉంటాడు కదా, ఏం అవసరమొచ్చినా ఫోన్ చేయమని చెప్పి. వాళ్ళూ ఎవరూ నాకు తెలియదు. సరే జగన్‌తో ముఖాముఖీ మట్లాడే వాళ్ళెవరైనా చూస్తారేమోనని ఇక్కడ రాస్తున్నాను. యువరాజా వారిని అడిగి కనుక్కొని చెప్తారేమోనని.
 
సర్వం త్యాగం చేయడమంటే ఏమిటో?


1. ఈసారి ఓడిపోతే రాజకీయాల్లోంచి తప్పుకొంటానని ఓడిపోయి పీసీసీ పీఠమెక్కి, తరువాత రెండుసార్లు ముఖ్యమంత్రిత్వాన్ని పొందడమా?

2. ఎలాంటి జోక్యమూ లేకుండా తను ఆడింది ఆట, పాడింది పాటగా రాష్ట్రాన్ని ఏలడమా?
3. కోట్లాది రూపాయ ల అవినీతి జరుగుతున్నా ఉలుకూ పలుకూ లేకుండా సాగించుకోవడమా?
 


4. కొడుక్కి పవర్ ప్లాంట్లూ, సిమెంట్ ఫ్యాక్టరీకి వేల ఎకరాలు, అల్లుడికి బయ్యారం గనులూ, మిత్రులకి ఇనుప ఖనిజం నిల్వలు పంచి పెట్టుకోవడమా?


 
5.సర్వం త్యాగం చేయడమంటే ఎన్నికల ఖర్చులకి ఇల్లు తాకట్టు పెట్టే స్థితి నుండి బెంగుళూరు, హైదరాబాదు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ఒక్కో చోట ఒక్కొక  రాజప్రాసాదం కట్టుకోవడమా? వందల వేల కోట్లు దాటి లక్షల కోట్లు గడించడమా? పవర్ ప్లాంట్లూ, సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి వేల ఎకరాలు దండుకోవడమా?
 


ఇదే అయితే సర్వం త్యాగం చేయడానికి నాక్కూడా ఒక అవకాశం వస్తే ఎంత బావుంటుందో?

8 comments:

SHANKAR said...

అదేంటండీ అలా అంటారు? యువరాజు చెబుతున్నది ఇంకా దోచుకోవలసింది సర్వం పార్టీకి (అంటే అమ్మగారికన్నమాట) త్యాగం చేసారని అర్ధమేమో

పార్టీ కోసం ఈయన సర్వం త్యాగం చేశాడు.
దేశం కోసం ఆవిడ సర్వం (పదవి) త్యాగం చేసిందట

మన మెరుగైన భవిష్యత్ కోసం మనం ఇలాంటి పొలిటీషియన్ లని త్యాగం చేసేస్తే పోతుందేమో.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Yes.You are right.

Anonymous said...

> ఇదే అయితే సర్వం త్యాగం చేయడానికి నాక్కూడా ఒక అవకాశం వస్తే ఎంత బావుంటుందో?
సింపుల్, జగన్ కి వెన్నుపోటు పొడవండి, అప్పుడు త్యాగాలు గుర్తుండి పోతాయి.

Anonymous said...

"అల్లుడికి బయ్యారం గనులూ"

అల్లుడికి మరియు కూతురికి కావలసినన్ని "హిందూ ఆత్మలు". అర్దం అయిందా? మత మార్పిడులకండి బాబు!.

అల్లుడికి మరియు కూతురు హెలికాప్టర్ లొ వెళ్ళి తప్ప మత మార్పిడులు చెయరు. అంత సొమ్ము ఎక్కడిది?

ఇండియా వొటర్లు గొర్రేల లాగా ఆలొసించినంత వరకు ఇటలి కిరస్తానీ బొమ్మ పరిపాలిస్తూనే వుంటుంది. అదేం అంటే నేను మీకొసమే త్యాగం చెస్తున్నాను అంటుంది.

tarakam said...

KRISHNA గారూ,
మీరింత అన్యాయంగా ఏకపక్షంగా వ్రాస్తే ఎలా సార్,ఆయన త్యాగాల లిస్ట్ క్రింద ఇస్తున్నాను.
1)నీతి,న్యాయాలను
2)సత్యం,మరియు అదే పేరు మీద ఉన్న రామలింగరాజును
3)పరిటాల లాంటి ఎందరో రాజకీయ ప్రత్యర్థులను,
4)ధన లేమిని
5)తెలుగు జాతి ఖనిజ సంపద మరియు పేద రైతు భూములను
6)తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని.
ఇన్ని త్యాగాలు చేసిన మహనీయుడిని మరవడం పాపంకదండీ!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

My goodness!

Siri said...

Shankar & tharakam well said.

Siri said...

Shankar & tharakam well said.