నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, February 7, 2011

తాగుబోతు తమ్ముళ్ళ హక్కుల పరిరక్షణకు నడుం బిగించిన చంద్రబాబు


చంద్రబాబు నాయుడుకి ఈ మధ్య ఉద్యమ స్ఫూర్తి ఎక్కువై పోయింది. ఏదో ఒక ఉద్యమం చేయకపోతే ఆయనకి మనస్సు నిలవడం లేదేమో? అందరూ కులాల, మతాల, ప్రాంతాల వారీగా ఓటుబ్యాంకులు ఏర్పాటు చేసుకోవడానికి పాకులాడుతుంటారు గానీ వాళ్ళు మర్చిపోయిన ఒక ముఖ్యమైన ఓటుబ్యాంకుని బాబు గారు గుర్తించారు. అది తాగుబోతుల ఓటుబ్యాంకు. 
  


తాగే వాడు ఎదుటి వాడి కులం మతం ప్రాంతం లాంటి వాటిని చూసుకోడు. తనతో కలిసి తాగే వాళ్ళందరూ తన వాళ్ళేనని భావిస్తాడు. అందులోనూ వరసగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో వీళ్ళ సంఖ్య అసంఖ్యాకంగా పెరిగి పొయింది కూడానూ!


అందుకే బాబుగారు తన తెలుగు  తాగుబోతు తమ్ముళ్ళకి పిలుపునిచ్చాడు ఎక్కడైనా మధ్యం ఎమ్మార్పీకన్నా అధికంగా అమ్మితే సదరు మద్యం దుకాణాన్ని ధ్వంసం చేసి తమ హక్కులని పరిరక్షించుకొమ్మని.
 
తమ తాగుడు గురించి ఇంత శ్రద్ధ చూపిస్తున్న బాబు గారికి తాగుబోతు తమ్ముళ్ళందరూ వచ్చే ఎన్నికల్లో ఓట్లేస్తారా అన్నది చూడాలి.

1 comment:

Siri said...

Krishnaji, Dheekshalu, Andhollanlu chesthe eela lekapothe Babuki Problems pattavu ani eela.
Babugari maatlavalana eekuva profit meeke(i mean Gentske) kadandi.
Babuki proceed avvamani all the best cheppandi.