నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, February 9, 2011

సోనియా కండకావరం, చిరంజీవి తిక్క యవ్వారం కలిసి నా స్క్రిప్టు తప్పయేలా చేశాయి


చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాడని చాలామంది ముందుగానే ఊహించినా నేను దానికి పక్కాగా స్రీన్‌ప్లే కూడా రాసి ఒక పోస్టు పెట్టాను.http://hittingontheface.blogspot.com/2011/02/in.html అయితే చాలా మటుకూ నేను రాసినట్టే జరిగినా కొంచెం తేడా జరిగిపోయింది.ఒక పార్టీ నాయకుడిని అప్పాయింట్‌మెంట్ కోసం ఎదురు చూసేలా చేయడం అన్నది ఊహించలేని అవమానం. కానీ సోనియా చిరంజీవికి ఈ అవమానం ఎదురయేలా చేసింది. పొద్దున పదిగంటలకు ఫిక్సయిన అపాయింట్‌మెంట్ రెండు సార్లు వాయిదా పడి సాయంత్రం కుదిరింది. చిరంజీవి కానీ ఆయనతో డిల్లీ వెళ్ళిన ధేభ్యంగాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళతో ఇంకా కొంతమంది పార్టీ వారితో చర్చించాల్సి ఉన్నందున తమ నాయకుడే అప్పాయింట్‌మెంట్‌ని వాయిదా వేస్తున్నాడని చెప్పడం మానేసి సోనియా వాయిదా వేస్తుంటే తాము నోళ్ళు వెళ్ళబెట్టుకొని చేతులు పిసుక్కుంటూ కూర్చుని ఉన్నామని చెప్పి తిక్క సన్నాసుల లుక్కు ఇచ్చి చిరుని వెర్రి వెంగళప్పని చేశారు.

రెండవది పీఆర్‌పీ ఎమ్మెల్యేలందరితో కలిసి సోనియా ఫోటో దిగే కార్యక్రమం ఒకటుందని రాశాను. అదీ జరగలేదు. ఒక మండల లెవెల్ లీడర్ పార్టీ ఫిరాయిస్తేనే వాడికి తగ్గ స్థాయి నాయకుడు ఒకడు వచ్చి తమ పార్టీ కండువా కప్పి ప్రెస్‌వాళ్ళ ముందు నలుగు మాటలు చెప్పి పోటోలు దిగడం సహజం. బాగా బతికిన రోజుల్లో, అంటే పార్టీ పెట్టిన కొత్తలో, చిరంజీవి ఇవన్నీ చేసి ఉన్నాడు కదా?

కానీ ఒక పార్టీని హోల్‌సేల్‌గా కలిపేస్తుంటే సోనియా కనీసం పబ్లిక్‌గా దాన్ని అప్రేషియేట్ చేయకపోవడం, వీరప్ప మొయిలీతో కలిసి విలేఖరుల ముందుకొచ్చి చిరంజీవి వెర్రి పప్పలాగా పార్టీనీ, ఎమ్మెల్యేలని కలిపి పారేశాం అని స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆ క్షణం కోసం సారు ఎంత ఆత్రంగా ఉన్నాడో అందరికీ తెలిసేలా చేసింది.సినిమాల్లో ఏమి చేసినా స్టైల్ మయిన్‌టెయిన్ చేసే చిరు ఇలాంటి చారిత్రాత్మక క్షణంలో ఇలా తిక్క శంకరయ్యలా ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదు.

పొగరుబోతు సోనియా, తింగరోడు చిరు కలిసి నా స్క్రిప్టు కొద్దిగా తారుమారు చేశారు.

1 comment:

Sree said...

sinimallo poyina boledu scripts to poliste mee bongulo script tappu avadam enta. light teeskondi :) (just kidding!)