నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, February 18, 2011

సోనియా గాంధీ అంత బిజీగా ఏం చేస్తూ ఉంటుందో?


ఎప్పుడు చూసినా సోనియా గాంధీ అప్పాయింట్‌మెంట్ కోసం అందరూ పడిగాపులు కాస్తున్నారన్న వార్తలు కనిపిస్తుంటాయి. అదే సమయంలో కొంతమందికి వెనువెంటనే అపాయింట్‌మెంట్ లభిస్తూ ఉందన్న వార్తలు కూడా ఉన్నాయనుకోండి.
  


ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణా ప్రాంతం నుండి ఢిల్లీ వెళ్ళి అక్కడ మేడమ్ అపాయింట్‌మెంట్ దొరక్క ఆ చలిలో చోటా మోటా నాయకులని కలుస్తూ టీలూ, టిఫిన్‌లూ తింటూ ఏ మొహం పెట్టుకొని తిరిగి రావాలో తెలియక లాక్కోలేక, పీక్కోలేక త్రిశంకు స్వర్గంలో చిక్కుకుపోయిన ఎమ్మెల్యేలూ,ఎంపీలను చూస్తుంటే నవ్వుతో పాటు జాలి కూడా కలుగుతోంది.
 


అయినా సోనియా మేడమ్ వాళ్ళని ఇంట్లోకి పిలిచి ఏదో ఒక గదిలో కూర్చుండబెట్టి ఎవరో ఒక నౌఖరుచేత కొంచెం టీనీళ్ళు, ఓ రెండు బిస్కట్లూ ఇప్పించి పంపేసి ఉంటే వాళ్ళు కొంచెం కాలర్లు ఎత్తుకొని విమానమెక్కి బతుకు జీవుడా అనుకుంటూ ఇళ్ళకొచ్చి పడేవాళ్ళు కదా?!


అయినా మేడమ్ అం బిజీ బిజీగా ఏం చేస్తుంటరబ్బా అని నాకు ఎప్పటినుండో ఒక సందేహం. ఇంటిపనీ వంటపనీ స్వయంగా చేసుకొనే అడవాళ్ళు రోజంతా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండటం నిత్యం చూస్తూ ఉంటాను కానీ, మేడమ్‌కి ఇల్లు తుడుచుకోవడం, అంట్లు తోమడం, బట్టలు ఉతికి, వంట చేయడం లాంటి పనులేమీ ఉండవు కదా. కూతురుకి పెళ్ళి కూడా అయిపోయింది. పోనీ కొడుక్కి పెళ్ళి ప్రయత్నాలు చేస్తూందా అంటే అదీ ఉన్నట్లు లేదు. 
  
ఎంత యూపీఏ చైర్మన్ అయినా మరీ ఇంత బిజీనా? లేక అడిగినవారికి అడిగినప్పుడు అప్పాయింట్‌మెంట్ ఇస్తూ పోతూ ఉంటే చులకన అవుతానన్న భయమా?

3 comments:

kiran said...

:)

AMMA ODI said...

>>> అడిగినవారికి అడిగినప్పుడు అప్పాయింట్‌మెంట్ ఇస్తూ పోతూ ఉంటే చులకన అవుతానన్న భయమా?

ఇదే నిజమేమో!

Anonymous said...

మీకు భలే డౌట్లు వస్తాయే.