నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, February 16, 2011

అశోకవనంలో రావణుడికీ సీతాదేవికీ మధ్య ఏమి జరిగింది? చాలానే జరిగింది?


ముందుగా:  నేను నాస్తికుడిని. దేవుడ్నీ, దెయ్యాన్నీ నమ్మని వాడిని. అయినా రామాయణం అంటే నాకు గౌరవం. రాజు ఎలా ఉండాలో, కుమారుడు ఎలా ఉండాలో, తమ్ముళ్ళు ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో ఇలాంటి వాటినన్నిటినీ క్రోడీకరించి రాసిన మహా గ్రంధం అని నాకు రామాయణం గురించిన అభిప్రాయం. అందుకే నేను రామాయణాన్ని శ్రద్ధాసక్తులతో చదివుతాను, భక్తి శ్రద్ధలతో కాదు. నేను నా పిల్లలకి రామాయణం చెబుతాను. ఆ ఇతిహాసం అంటే అంత గౌరవం నాకు. 
 


అలాంటి గ్రంధం గురించి నీహారిక రావణుడిని చూసి సీత ముమైత్ ఖాన్‌లా ఎందుకు నవ్వింది?,  రావణుడు సీతని ఎన్నిసార్లు చెరిచాడు?  అని పిచ్చి రాతలు రాస్తే చూసి, చదివి ఓర్చుకోలేక రాసిన పోస్టు ఇది. నీహారిక అండ్ ఫ్యాన్స్ వీటిని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.


1. http://ramyamgakutirana.blogspot.com/2011/02/blog-post_8919.html
2.


సీత అశోక వనంలో రావణుడి బందీగా ఉన్నప్పుడు వాళ్లిద్దరికీ మధ్య చాలానే జరిగిందని నా ఉద్ధేశ్యం. 


 
1. రావణుడికి భయం కలిగి ఉంటుంది.  గడ్ది పోచ చేత పట్టి సీత తనని భయ పెట్టిన తీరు చూసి కైలాసాన్ని కూడా కదిలించగల తన భుజ బలం తన బందీగా బేలగా కనిపిస్తున్న ఈ సుందరాంగి ముందు పూచిక పుల్లతో సమానం అని తెలియగానే నిలువెల్లా భయంతో వళ్ళు కంపించి ఉంటుంది. 


2. రావణుడికి బుద్ధి వచ్చి ఉంటుంది. పరాయి ఆడవారిని కామ దృష్టితోనే చూసే రావణుడికి తొలిసారిగా ఒక స్త్రీలో మృత్యు దేవత కనిపించి భయం వేసి తన తప్పుడు బుద్ధి తొలిగిపోయి సరయిన బుద్ధి వచ్చి ఉంటుంది.
 


3. రావణుడికి తన చావు తప్పదని భవిష్యత్‌దర్శనమయి ఉంటుంది.   తన భర్త వచ్చి తనని కాపాడి తీసుకెళ్తాడని, రాముడికి అవకాశం ఇవ్వడానికి ఈ కోమలాంగి ఎదురు చూస్తూందనీ, లేకపోతే ఈ క్షణంలో తనని బూడిద చేయగల శక్తి సంపన్నురాలు ఈ స్త్రీ అని తెలియగానే ఒక మానవ స్త్రీ తనని ఇంత భయపెట్టిందీ అని తెలియగానే రావణుడికి తన వరంలో తను వదిలి పెట్టిన మానవులు, వానరుల సంగతి గుర్తుకొచ్చి తన చావు ఖాయం అని గుర్తొచ్చి భవిష్యత్తు కళ్లముందు కనిపించి ఉంటుంది.

14 comments:

Anonymous said...

Good Post........:)

Anonymous said...

ఈ నాస్థిక రామాయన కతలెందుకులే గాని, నాస్తీకులకి రామాయనం, ఇతిహాసాలు ఎందుకు నచ్చాయో రాస్తే తెలుసుకుంటం. నాస్థికులు కులాల నమ్మకాలుంటయా? నాస్తికులు సచ్చేముందు ఈ గృప్తిగా ఎవరికైనా థాంక్స్ సెప్పుకోవలంటే ఎవరికి సెప్పుకుంటరు?

Anonymous said...

baagundi

Sree said...

అసలు రావణుడు సీతని అశోకవనం లో ఎందుకుంచాడు? రావణుడు సీతని ఏమైనా చేయగలడా? లేదు. ఎందుకంటే..
1) ఆడుకునేప్పుడు బంతి శివధనస్సు ఉన్న బండి కిందకి వెలితే సీత అలవోకగా బండిని తోసేసింది. కాని రావణుడు శివధనస్సుని కనీసం ఎత్తనైనా ఎత్తలేకపోయాడు. అందుచేత ఏమైనా వేధవ్వేషాలు వేస్తే సీత చేతిలోనే పోతానని వాడికీ తెలుసు.
2) రావణుడి భార్యలందరూ అతని బలాన్ని మెచ్చి స్వయంగా వరించినవారే.అందుచేత సీతని ఒప్పించలేనా అనే భావన కూడా ఉంది రావణుడికి. అందుకే తన అందచందాలు, తన భోగ భాగ్యాలు వర్ణించి వనవాసపు కష్టాలని తొలగించగలనని భ్రమపెట్టి ఆమె మనసు మార్చాలని ప్రయత్నించాడు.
కాని అతను చూపిన ఆశకు లొంగలేదు సీతమ్మ. అది రాముని పై భక్తే కాదు, ప్రేమ కూడా.
అలాగే ఎంతో అందంగా శూర్పణఖ వచ్చినా, తన భార్య సీత కేవలం నార దుస్తుల్లోనే ఉన్నా అసలు చలించలేదు రాముడు. వారి ప్రేమకు ఇంతకంతే ఇంకేం నిదర్శనం చూపాలి మరి!

Siri said...

Well said mr. Sree.

Anonymous said...

@Sree,

ఇవ్వన్ని ఊహ అయితే ఇంకో కధన౦ కూడా ఉ౦ది ..
రావణుడికి శాపం , ఇష్ట౦ లేని స్త్రీ ని తాకరాదు :)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Very well said, Sree.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నాస్తికులకి రామాయణ మహాభారతాలు నచ్చకూడదా? నాస్తికులందరూ హిందూ మతాన్ని, దేవుళ్ళనీ, దేవతలనీ తిట్టి పోస్తూ కావరం పట్టిన కబోది కరుణానిధి లాగానే ఉండాలా?

Anonymous said...

Nenu Niharika gaari blog lo oka comment pettanu. Danni avida publish chestaaru anna nammakam leka ade comment ikkada pedutunna...kadupu manta aapukoleka bayatiki kakkadaniki.
------------------------------
Niharika garu,
Mana pravarthana ni batte manaki yedati vyakthi maryada ivvadam jarugutundi. ilanti title to post petti, vandala mandi feelings ni hurt chesi, nannu maatalu antunnaru nenu aada daani kaada ani baadha padatam yenduku? Sita Devi to polika meeku meeru pettukunte saripodu. Mana gurinchi padi mandi mechukovali kaani manaki manam jabbalu charuchukoni, dabba kottukunte vinadanike asahyam gaa untundi. meeku Advani meeda kopam unte atani meeda post raasukondi, kaani Ramayanam ni vakreekarinchi Sita Devi meeda nindalu veyyavalasina avasaram ledu. Ramudu Sita Devi kosam Ayodhya lo mandiram kattinchukoleda ani adugutunnaru. Shajahan to Ramudi ni yela polustaaru? Prajala sommu to pellaniki Samadhi leda mandiram kattinche gunam unna raju kadu Rama Chandrudu. Adi Ramayanam chadivi ardham chesukunna vallaki yevariki ayina telisina vishayam. Meeru raasina post chooste ne telustundi meeru Ramayanam chadavaledani. oka vela chadivina daaniki vakra bhaashyam cheptunnaro! Muslims ni hurt chesaadani Advani ni tittadaniki Hinduvula mano bhaavalni debba teestunnaru. Meeku ataniki teda yemiti? Meeru atani kante better person ani meeru anukunte mundu meeru Hindus ki kshamapana cheppandi.

Anonymous said...

ayya pai agnaata,

mee gurinchi meeku anta baaga telisinappudu..ee vyakhya mee peru to ne pettaleka poyara?

mimmalni mechchukonevaare gaani, inko maaata ane dhairya yevvariki ikkada ledu kadaa..

meeru vraasinadi ma0chi cheppadame ayite mee profile to vrayandi ...

ika nenu koodaa meelaa ne anukondi ..

Anonymous said...

Padi mandi nollalo naa peru naanali anukunte nenu oka blog pedataanu kada :-) Naa gurinchi naaku chaala baaga telusu. So, naaku yevari mechukollu meka tollu avasaram ledu. paina cheppinattu naa kadupu manta aapukoleka maatrame nenu aa comment raasanu. naa pai mee manta meeru teerchukunnaru. naaku daaniki objection ledu :-)

Anonymous said...

amdari asalu problem acidity anna maata :)

Anonymous said...

yea. naadi ayite ade. naa comment ki mee response choosi mee problem kuda ade anukunnanu. meeru oppukuni confirm chesaaru. Just kidding :-)

durgeswara said...

చాలా చక్కని విశ్లేషణ