నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, June 3, 2011

మందుల్లేవు, వాక్సీన్లు లేవు. ఆరోగ్యశ్రీ ఉందిగా ఏదో ఒక ఆపరేషన్ చేయించుకో


ఆరోగ్యశ్రీ పేరిట కార్పొరేట్ హాస్పిటల్సుకు, ప్రైవేటు హాస్పిటల్సుకూ డబ్బంతా దోచి పెడితే ప్రైమరీ హెల్త్ సెంటర్లు దెబ్బ తింటాయని మొదట్నుండీ నిపుణులు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా ఆరోగ్యశ్రీ అందించే ఓట్ల ఫలాల ముందు నాయకులకు ఆ మాటలు చెవికెక్క లేదు. ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేశారు. ఆరోగ్యశ్రీ పథకంతో ప్రజల ప్రాణాలు కాపాడిన అపర బ్రహ్మ అని యువ నేత, ఆయన పార్టీ వాళ్ళూ తమ మీడియాలో గంట గంటకూ బాజా బజాయిస్తున్నారు. ఇప్పుడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు మందూ లేదు, జ్వరం బిళ్ళలూ లేవు అని నిన్న ఆ యువ నేత పత్రికే మొదటి పేజీలో బ్యానర్ హెడ్ లైన్ వేసింది.
 

దగ్గు మందూ, జ్వరం బిళ్ళలు లేకపోతేనేం, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరినీ ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కి రెఫర్ చేయండి. అక్కడ అన్ని రకాల స్కానింగులు తీసి లాభదాయకమైన ఆపరేషన్ చేయదగ్గ జబ్బు ఏదో ఒకటి బయటకు లాగి ఆపరేషన్ చేస్తారు. పేషంటు హ్యాపీ, హాస్పిటల్ హ్యాపీ. మందుల్లేవు, ఇంజెక్షన్లు లేవు అని సణిగే వాళ్ళూ ఉండరు.

9 comments:

Praveen Mandangi said...

ఆరోగ్యశ్రీ స్కీమ్ ఆ యువనేత వాళ్ళ నాన్నగారు పెట్టినదని ఆ యువ నేత మర్చిపోయినట్టు ఉన్నాడు.

ప్రవీణ్ శర్మ - నిర్వాహకుడు - తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia

Yagna said...

@ Praveen Sarma
ఆరోగ్యశ్రీని 'యువనేత తండ్రిగారు' పెట్టినంత మాత్రాన ఇప్పుడున్న మందుల కొదవకి వారిని బాధ్యులు చేయడం ఏమీ బాగాలేదు. వారు వున్నప్పుడు ఆరోగ్యశ్రీ బాగానే వుంది, మిగిలిన సదుపాయాలు బాగానే వున్నాయి. తరవాతే అన్నీ ఇలా ఏడుస్తున్నాయి. ఇప్పుడున్న చేతగాని చవటల్ని వొదిలిపెట్టి సదుద్దేశంతో చేపట్టిన ఒక కార్యక్రమాన్ని విమర్శించడం ఎంతవరకు విజ్ఞతో ఆలొచించండి. ఇప్పుడున్న చవట చేతగాని ఆర్భాటంతో పదవిలోకి వచ్చి ఆరునెలలు దాటింది. వాడిది బాధ్యత కాదా, ఎంతకాలమని లేనివాళ్ళ మీద పడి ఏడుస్తారు?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అసలు ఆరోగ్యశ్రీ కాన్సెప్టే తప్పు అని నా అభిప్రాయం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయగలిగే ఆపరేషన్లకి వేలకు వేలు ప్రైవేటు వాళ్ళకిచ్చి చేయించడం సబబేనా?

Kathi Mahesh Kumar said...

http://parnashaala.blogspot.com/2009/05/blog-post_21.html
ఆరోగ్యశ్రీ : పాజిటివ్ ప్రైవెటైజేషన్ ?!?

Praveen Mandangi said...

మహేశ్, టీ కాచుకోవడానికి గంధపు చెక్కలు అవసరమా? ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు పెంచినా అక్కడ గుండె జబ్బులు లాంటి వాటికి ఆపరేషన్లు చెయ్యడం తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది. అందు కోసం కార్పొరేట్ ఆసుపత్రులని మేపడం అవసరమా?

Anonymous said...

ప్రవీణ్ శర్మ గారు మహేష్ వర్మ గారిని సూటిగా అడిగారు. గంధపుచెక్కలతో గొప్పోళ్ళ శవాలను కాలుస్తారు, టీ కాచుకోవడానికి కిరోసిన్ స్టౌ చాలు.

Praveen Mandangi said...

మన కత్తి గారు కోడి గుడ్డు ఆమ్లెట్‌ని ఖరీదైన నీలగిరి తైలంలో వేపుకుంటారేమో. అందుకే వృథా ఖర్చు అతనికి తప్పనిపించలేదు.

Anonymous said...

ఆమ్లెట్టంటే గుర్తుకొచ్చింది, ఓ సారి AP expressలో నా పక్కనవున్న ఆమ్లెట్ తింటున్న చీకోలం అమ్మాయిని అడిగా ఆమ్లెట్ ఏ నూనెతో బాగుంటుంది? అని. తేరగావస్తే ఏనూనైనా పరవాలేదు, తనకు మాత్రం ఆముదంతో ఇష్టమని చెప్పింది. నే ఢిల్లీ వచ్చేదాకా ఆ శాల్తీతో మాట్లాడలేదు. మరీ ఆముదంతో ఆమ్లెట్టేసుకోవడం ఏమిటో ఈ చీకోలం జనాలు!

Praveen Mandangi said...

ప్రాంతం పేరుతో తిట్టడం కెలుకుడు బేచ్ స్టైల్ కదా. కుల గజ్జి, మత గజ్జి, ప్రాంతీయ గజ్జి ఈ మూడూ ఒంటబట్టించుకున్నారు.