నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, June 5, 2011

ఒరేయ్ గుంట నక్కా! ఇంత కక్కుర్తి అవసరమా?


ఫార్ములా 1 రేసుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు తెలుగు న్యూస్ పేపర్లలో పెద్దగా కవర్ చేసే వాళ్ళు కాదు గానీ ఇప్పుడు సాక్షి మాత్రం బాగా కవరేజి ఇస్తూ ఉంది. ఈ రేసుల కమర్షియల్ హక్కులన్నీ బెర్నీ ఎక్లెస్టోన్ అనే ఒక ముసలోడి చేతుల్లో ఉన్నాయి. ఈ ముసలోడిని టీవీలో  చూసినప్పుడల్లా నాకు గుంటనక్క గుర్తుకొచ్చేది. అయితే చూడ్డానికే కాదు బుద్ధిలో కూడా తను గుంట నక్కనే అని నిరూపించుకున్నాడు ఈ ముసలోడు.


 
ఫార్ములా 1 ని కొత్త దేశాలకు వ్యాపింపచేయాలనే వ్యూహంలో భాగంగా గల్ఫ్‌లో బహ్రైన్‌లో, అబుధాబిలో రేసులు పెట్టడం గత అరేడు సంవత్సరాలుగా మొదలు పెట్టారు. చంద్రబాబు చక్రం తిప్పే కాలంలో బిల్ గేట్స్, బిల్ క్లింటన్‌లే కాకుండా ఈ ముసలోడు కూడా వచ్చి హైదరాబాద్‌లో ట్రాక్ కోసం దాదాపు అన్ని పనులూ పూర్తి చేసి చివరిలో ఎందుకో అది వెనక్కి పోయింది. ఈ సంవత్సరం డిల్లీలో రేసుతో మన దేశంలో కూడా F1 కాలూననుంది.


బహ్రైన్‌లో 2004 లో F1 రేసు మొదలు పెట్టారు. గత సంవత్సరం నుండి ఇది ఎన్నేళ్ళ నుండో సీజన్ ఓపెనర్ గా ఉంటున్న ఆస్టేలియలోని మెల్బోర్న్‌ని వెనక్కి నెట్టి సీజన్‌లో మొదటి రేసు అయింది. అయితే ఈ సంవత్సరం మార్చి 13 న జరగాల్సిన రేసు బహ్రైన్‌లో ప్రజాస్వామ్యానికి మద్ధతుగా జరిగిన ఉద్యమాల వలన రద్దయింది.
 
బహ్రైన్‌లో రాజకుటుంబం అనుభవిస్తున్న అంతులేని అధికారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కోరుతూ ప్రజలు ఉద్యమం మొదలు పెట్టారు.  ట్యునీషియా,ఈజిప్టులో మొదలయిన ప్రజా ఉద్యమం స్ఫూర్తిగా గల్ఫ్ దేశాల్లో ప్రజాస్వామ్యవాదులు చేపట్టిన ఉద్యమాల్లో భాగంగా బహ్రైన్ ప్రజలు కూడా రాజకుటుంబానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టారు. ఇది సాకుగా తీసుకున్న ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నాయకులని నిర్భంధించడంతో బాటు, ఉద్యమంలో పాల్గొంటున్న షియా మతస్థులపై ఉక్కు పాదం మోపి వాళ్లని అరెస్టు చేయడం, హింసించడం లాంటి అమానుష కార్యాలకు పాల్పడ్డం మొదలు పెట్టింది.
  


ఇప్పుడు ఆణచివేత ద్వారా ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోలేమని తెలుసుకొన్న రాచ కుటుంబం ఎమర్జెన్సీ ఎత్తివేసి ప్రతి పక్ష నాయకులని చర్చలకు అహ్వానించింది. అయినా సామాన్య కార్యకర్తలపైన హింసా మార్గాన్ని మాత్రం వదిలి పెట్టలేదు. ఎందరో షియా మతస్థులని అరెస్టు చేయడం, హింసించడం ఒక పక్క జరిగిపోతూనే ఉంది. 
 
ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఎత్తివేయడం అనే కంటి తుడుపు చర్య వార్తల్లో వచ్చిందో ఈ ముసలి గుంటనక్కకి ఒక రేసు రద్దయితే తనకి కలిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి ఒక ఐడియా వచ్చింది. అక్టోబర్ 28-30 లలో జరగాల్సిన డిల్లీ రేసు స్థానంలో బహ్రైన్ రేసు జరపాలని నిర్ణయించారు. డిల్లీ రేసుని డిసెంబరు 9-11 తేదీలకి వాయిదా వేశారు.


అయితే ఈ నిర్ణయం పట్ల F1 రేసులో పాల్గొనే టీమ్ ఓనర్లు( మన విజయ్ మాల్యా కూడా ఉన్నారు వీరిలో. ఫోర్స్ ఇండియా అన్న టీమ్ ఈయనదే) డ్రైవర్లూ ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్నారు. బహ్రైన్‌కి వెళ్ళడం సురక్షితం కాదన్న భయం ఒకటి, ఒక పక్క ప్రజలని అణచివేతకి గురి చేస్తూ ఉంటే అక్కడ రేసులో పాల్గొంటే ఆ అణచివేతని సమర్ధించినట్లవుతుందన్న భావన మరొక వైపు. ఇంకొక కారణం డిసెంబరులొ కూడా రేసులుంటే వచ్చే సంవత్సరానికి సరిగా తయారు కాలేమన్నది.


ఈ నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతూంది. ఇది బహ్రైన్ ప్రజలకు చెంపపెట్టు లాంటిదని హక్కుల సంఘాలు అభివర్ణించాయి. ఒకవేళ రేసు జరిపినట్లయితే ఆ రోజు భారీగా నిరసన కార్యక్రమాలు జరపడానికి ఇప్పటినుండే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇది డబ్బుల కోసం ప్రజా ఉద్యమాన్ని ఖాతరు చేయకపోవడమే అని అందరూ విమర్శిస్తున్నా చివరికి డబ్బే గెలుస్తుంది కాబట్టి ఎవరెంత మొత్తుకున్నా చివరికి ఈ ముసలి గుంటనక్క డబ్బు సంచులతో బ్యాంకువైపు పరిగెడుతూ ఉంటే చూడడం తప్ప ఎవరు చేయగలిగింది ఏమీ ఉండక పోవచ్చు.

3 comments:

Tejaswi said...

ఫార్ములా వన్ రేసుల గురించి వివరంగా తెలుసుకోవాలనిఉంది. ఒక టపా రాయగలరా!

Anonymous said...

Emiti sir, jagan meeda manesaru ?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Definitely, Tejaswi.