నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, June 28, 2011

సత్య సాయిబాబా దైవాంశ గురించి ఇంకా అనుమానాలున్నాయా?


సత్య సాయి బాబా గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన ఉత్త ఫ్రాడ్, ఆయన చేసేవన్నీ చీప్ మ్యాజిక్ ట్రిక్స్ అనే వాళ్ళు ఒక వైపు ఉంటే, కలియుగంలో వెలసిన సాక్షాత్ దైవాంశ సంభూతుడు ఆయన అనే వాళ్ళు ఇంకొకవైపు ఉంటారు. దేవుడో, ఫ్రాడో ఆయన తన డబ్బు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయనని దేవుడని ఒప్పుకోవడానికి ఇంకేమి కావాలి అని మధ్యేమార్గంలో వాదించే వాళ్ళు కూడా ఉన్నారు.
  


అసలు ఆయన దేవుడా కాదా అన్న వాదనతో పని ఏమిటి అని ప్రశ్నిస్తే, ఈ వాదన చాలా అవసరం అని నా ఉద్ధేశ్యం. కోట్లమంది భక్తులను, కోటాను కోట్ల సంపదను సంపాదించిన వ్యక్తి నిజంగా తన దైవాంశతోనే ఇదంతా సాధించాడా లేదా అన్నది తేల్చుకోవడం భవిష్యత్ తరాలవారికి ఎంతో అవసరం.


అయితే నా ఉద్ధేశ్యంలో ఆయన దైవాంశ ఉన్నవాడా లేక మామూలు మనిషా అన్న ప్రశ్నకి సమాధానం ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన అనుచరులూ, ట్రస్టు సభ్యులే ఇచ్చారు. లోగుట్టు పెరుమాళ్ళుకెరుక అంటారు. బాబాతో అత్యంత సన్నిహితంగా మెలిగినవారికి ఆయన దేవుడు అన్న నమ్మకం కానీ భయం కానీ ఉన్నట్లయితే ఇంత నిర్భయంగా, నిస్సిగ్గుగా ఆయన సామాజిక సేవా కార్యకాలాపాలకి కూడబెట్టిన సంపదని తమ స్వంతానికి తరలించే సాహసం చేసి ఉండేవారా? బాబా పైనుండి ముడ్డి మీద తన్ని శిక్షిస్తాడన్న భయం ఉండేది కదా?


  
బాబాని దగ్గరనుండి చూసి ఆయన కూడా ఒక మామూలు మనిషే అని తెలిసి ఉన్నవారు కాబట్టే ఎవరికి దొరికింది వారు దోచిపారేసే సాహసం చేశారని నా అభిప్రాయం. దేవుడో, కాదో కానీ ఎన్నో మంచి పనులు చేసి, ఎందరికో సాయం చేసిన ఆ మనిషి చివరికి తన మరణం తరువాత తనవారు అని నమ్మిన వారి కారణం గానే నిత్యం వార్తల్లో నానుతూ అప్రదిష్ట పాలయ్యాడు. బాబాని తన స్వంత మనుషులు కంపు పట్టించినంతగా  ఆయన బద్ధవ్యతిరేకులయిన నాస్తికవాదులు కూడా పట్టించలేకపోయారు.

8 comments:

A K Sastry said...

మిడీవల్ యుగాల ప్రజల నమ్మకం ప్రకారం "రాజు" దైవాంశ సంభూతుడు. సుక్షత్రియుడైన సాయి కూడా దైవాంశ సంభూతుడే--ఆయన చేత పాలింపబడ్డ భక్తులనే ప్రజలకి. కానీ, కాలానుగుణంగా, ఆ క్షత్రియ ధర్మం మంటకలిసినందువల్లే, ఈనాటి ఆయన "రాజ్య" స్థితి. ఆయనకి నిజమైన వారసుడు రత్నాకరా? మరి ఆయన చివరివరకూ నమ్మిన సత్యజిత్ మాటేమిటి? యేదేమైనా, ఆయన తన చివరి రోజుల్లో కొన్ని మంచి పనులు చేశాడు. అందుకనే ఆయన ఓ "మనీషి" అంటే చాలు. ఆయన దేవుడా? దెయ్యమా? అన్న చర్చ అనవసరం.

Anonymous said...

కృష్ణ శ్రీ గారు, నేను ఆయన భట్రాజు కులం నందు పుట్టాడని విన్నాను మీరు సుక్షత్రీయుడు అని అంటారేమిటి?

Srikar

ANALYSIS//అనాలిసిస్ said...

భట్రాజు కులం అంటే అప్పట్లో రాజుల దగ్గర చేరి వాళ్ళకి చెక్క భజన చేసేవాళ్ళేకదా !? ... ఊరికే నివృత్తి కోసం అడిగాను. మరి సాయి సుక్షత్రియుడైతే అతనికి చెక్క భజన చేసే వాళ్ళెవరు? ... అతని దగ్గరకొచ్చి నువ్వు దేవుడివి దైవాంశ సంభూతుతుడివి ... ప్రేమ సాయివి ... బొంగు సాయివి అంటూ మహాత్మున్ని చేసిన ఈ VVVIP లు, రాజకీయనాయకులు లేక మీడియానా ?

Sree said...

అతన్ని దేవుడు దేవుడు అంటూనే వెనక ఎంత బ్లాక్ మనీ దాచుకున్నారో ఈ నాయకులూ అధినేతలూ. అదంతా మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బే కాదంటారా?

ANALYSIS//అనాలిసిస్ said...

ఇప్పుడు ఆ బ్లాక్‌మనీనే కదా తరలిస్తున్నది. ఆ తరలింపు ప్రక్రియ సాయిబాబా ఆసుపత్రిలో చేరినప్పటినుండే గుట్టుచప్పుడు కాకుండా మొదలయ్యింది .... ఇంకా పూర్తికాలేదు ... అందుకే ప్రభుత్వం పూర్తిగా తరలించేందుకు ట్రస్టుకి పదిరోజులు గడువిచ్చింది . ఆ డబ్బుని ఇక్కడనుండి తీసుకెళ్ళి ఇంకో బాబా దగ్గర పెడతారన్నమాట ... అదీ సంగతి

Anonymous said...

పుట్టపర్తి బాబా గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి ఆయన గురించి నేను వ్యాఖ్యానించలేను , అక్కడి సంపద దోచేయటం గురించి కూడా నాకు తెలియదు కాబట్టి , దాని గురించి కూడా నేను వ్యాఖ్యానించలేను.
సమాజంలో నేరం చేస్తే చట్టం ఉంది., శిక్ష విధిస్తుంది అని తెలిసి కూడా నేరాలు చేస్తూనే ఉన్నారు కొందరు.. దేవుణ్ణి నమ్మి పూజలు చేస్తూ కూడా తప్పులు చేస్తూనే ఉన్నారు కొందరు .

ANALYSIS//అనాలిసిస్ said...

ఒక్కసారి ఇటొచ్చి చూడండి
http://analysis-seenu.blogspot.com/2011/06/blog-post_28.html

Anonymous said...

మిడీవల్ యుగాల ప్రజల నమ్మకం ప్రకారం "రాజు" దైవాంశ సంభూతుడు. సుక్షత్రియుడైన సాయి కూడా దైవాంశ సంభూతుడే- ఆయనకి నిజమైన వారసుడు రత్నాకరా?
Sai kshtryudaite, ratnakar kooda kshetiriyudega....yemolendi maakenduku...mee sai ki meeko dandam