నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, June 29, 2011

కలెక్టర్ కూతురు ప్రభుత్వ పాఠశాలలో!!!


ఎంత పేదవాడైనా తమ పిల్లల్ని ఎంత చెత్తదయినా ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించి, చదివించే ఈ రోజుల్లో ప్రభుత్వ అదికారులు, అందునా సాక్షాత్తూ ఒక జిల్లాకి కలెక్టరుగా ఉన్న వ్యక్తి తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిఉంచడం అన్నది ఊహకి కూడా అందని విషయం. 


  
అయితే తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకి కలెక్టరుగా ఉన్న ఆనంద్ కుమార్ అనే IAS ఆఫీసర్ ఈ పని చేసి చూపించాడు. 


 
ఒక రోజు ఉదయాన్నే ఆనంద్ కుమార్ తన సతీమణితో కలిసి, తన కూతురు గోపికని తీసుకొని కుముయిలన్‌కుట్టయ్ లోని  ఒక పంచాయతీ పాఠశాలకి వెళ్ళాడు. సాక్షాత్తూ కలెక్టరు, ఎటువంటి మందీ మార్బలం లేకుండా స్కూలుకి రావడం చూసిన హెడ్ మాస్టరు కంగారు పడుతూ ఉంటే ఆయన్ని మరింత షాక్‌కి గురి చేస్తూ "నా కూతురుకి ఈ స్కూలులో సీటు కావాలి" అన్నారు కలెక్టర్.


తన కూతురుకి కూడా మిగతా పిల్లల లాగా మధ్యాహ్న భోజనం కూడా పెట్టమని, మిగిలిన పిల్లలతో కలిపి మామూలుగానే చూడమని చెప్పి తన కూతురుని ఆ స్కూలులో జాయిన్ చేశారు ఆనంద్ కుమార్.


ఆ మధ్య ఒక మైనర్ ఆపరేషన్  కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌కి వెళ్ళకుండా గాంధీ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకున్నారు మన గవర్నర్ నరసింహన్,  వీ ఐ పీ కి ఆపరేషన్ అంటే సీనియర్ డాక్టర్స్ వచ్చి చేస్తారు. వాళ్ళు ఉన్నంత సేపు సిబ్బంది అంతా మనికాళ్ళమీద ఉండి పని చేస్తారు కాబట్టి  ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవడం పెద్ద సాహసం కాదు కానీ భవిష్యత్‌కి పునాది వేయాల్సిన వయసులో ప్రభుత్వ పాఠశాలలో  చేర్పించిన ఆనంద్ కుమార్ నిర్ణయం మాత్రం హర్షించదగ్గది. 


కలెక్టర్ కూతురు తమ స్కూలులో చేరాక సిబ్బంది మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఆ స్కూలులో టీచర్లందరూ ఇప్పుడు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చదువు చెబుతున్నారు.

10 comments:

Rao S Lakkaraju said...

కలెక్టర్ కూతురు తమ స్కూలులో చేరాక సిబ్బంది మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఆ స్కూలులో టీచర్లందరూ ఇప్పుడు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చదువు చెబుతున్నారు.
----------
పబ్లిక్ స్కూళ్ళ లో అణాకానీ చదువులు బాగుపడాలంటే మార్గం తెలిసిపోయింది. ఎందరు ఆచరిస్తారో చూడాలి.

Praveen Mandangi said...

నేను చదివింది ప్రైవేట్ స్కూల్‌లోనే. నాకు చదువు చెప్పిన పంతుళ్ళకి కర్రతో కొట్టడం తప్ప మంచిగా చెప్పడం చేత కాదు. సికందరాబాద్‌లో ఒక స్కూల్ కరెస్పాండెంట్ పిల్లలని లైన్‌లో నిలబెట్టి కర్రతో కొడుతోంటే ఒక విలేఖరి అడిగాడు. అప్పుడా కరెస్పాండెంట్ చెప్పిన సమాధానం ఏమిటంటే "Who are you to intervene in my school affairs?" అని. ఇంతలా కొడితే బట్టీ పట్టైనా మార్కులు తెచ్చుకుని పాసవుతారు. అందుకే ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులకి మార్కులు ఎక్కువ వస్తాయి కానీ వాళ్ళకి లోక జ్ఞానం పెరగదు.

Praveen Mandangi said...

రావు గారు చెప్పినది ఇంకో రకంగా కూడా నిజమే. ప్రైవేట్ స్కూల్‌పై చర్య తీసుకునే అధికారం కలెక్టర్‌కి ఉండదు. అక్కడ తన కూతురికి చదువు సరిగా చెప్పకపోతే కలెక్టర్ చేసేదేమీ ఉండదు. కనుక ప్రభుత్వ పాఠశాలలో చదివించడం కలెక్టర్‌కి ఒక రకంగా మంచిది. ప్రైవేట్ పాఠశాలలో జీరో రిజల్ట్స్ వస్తేనే అది ముయ్యించే అధికారం DEOకి ఉంటుంది, కార్పొరల్ పనిష్మెంట్ ఇస్తే ముయ్యించే అధికారం ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌కి ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళని ముయ్యించే అధికారం కలెక్టర్‌కి ఉండదు. ఎలాగైనా కలెక్టర్ కూతురికి ప్రభుత్వ పాఠశాలలోనే భవిత ఉంటుంది.

శరత్ said...

భవిష్యత్‌కి పునాది వేయాల్సిన వయసులో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఆనంద్ కుమార్ గారి ఆదర్సానికి ఆ చిన్నారి భవిష్యత్ నాశనమవకుండా ఉంటే అదే పదివేలు. తన అలోచనలని కూతురు మీద రుద్దకుండా తన నిత్యజీవితంలో వాటిని ఆచరిస్తే అది సరైన నిబద్దత అవుతుంది.

Mauli said...

మ౦చి టపా,

@శరత్
ప్రభుత్వ పాఠశాలలో భవిష్యత్తు లేదని ఎ౦దుకు అనుకొ౦టున్నారు ?

Anonymous said...

ఇవాళ ఏ వనంలో భోజనం మౌళిగారు- ప్రమాదవనంలోనా? ప్రమోదవనంలోనా?
టీ టైము కి ఎవరు? రెడ్డి గారా? లింగంగారా?
మీ ఒరిజినాలిటీ ముసుగు తీసిన కామెంట్ల ప్రవాహం రావడం లేదే.. ఓహో .. ఈ మధ్య కులాక కుమ్ములాటల్లో కొత్త బ్లాగులు పెట్టి బిజీ గా ఉన్నారు గనుకనా?

Anonymous said...

మనిషి అనేమాటకి అర్ధం ఉంటే.. మనిషికో చుక్క చీమూ నెత్తురూ మిగిలున్నా .. అన్ని డ్రామాల్లోనూ అడ్డంగా దొరికిపోయి .. ఇంకా సిగ్గులేకుండా బ్లాగుల్లో పడి దున్నపోతులా తిరుగుతూ లేని ఫీలింగ్స్‌ తెచ్చిపెట్టుకున్నట్లు నటిస్తూ .. ఇలా చీ అనిపించుకోర మౌళి గారూ మీరు

Anonymous said...

నీతీ నిజాయితీ.. మాట మీద నిలకడ .. కారెక్టరు బొత్తిగా లేని ఈ మనిషిని కనిపించిన చోటల్లా తరిమికొట్టండి ..
దయచేసి ఏ వర్గమూ ఇందులో కలగజేసుకోవద్దు, ఇలాంటి దుర్మార్గులని వెనకేసుకొచ్చి మా నెత్తిన రుద్దద్దు.

Sree said...

ప్రభువ్త పాటశాలలంటే అంత చులకనా మీకు? నేను చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే. అదీ తెలుగులో. నిజానికి పిల్లల భవిష్యత్తులో టీచర్స్ కంటే తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల కారణంగా ఆ చిన్నారి ఏమీ నష్టపోదని నా నమ్మకం. ప్రభుత్వ పాఠశాలలంటే మనవే. మన ఆస్తి గురించి మనమే చులకనగా మాట్లాడటం ఏ సాంప్రదాయం?

sree said...

ప్రభుత్వ పాఠశాలలంటే అంత చులకనా మీకు? నేను చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే. అదీ తెలుగులో. నిజానికి పిల్లల భవిష్యత్తులో టీచర్స్ కంటే తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల కారణంగా ఆ చిన్నారి ఏమీ నష్టపోదని నా నమ్మకం. ప్రభుత్వ పాఠశాలలంటే మనవే. మన ఆస్తి గురించి మనమే చులకనగా మాట్లాడటం ఏ సాంప్రదాయం?