ఈ మధ్య ఇక్కడే శ్రీ శర్మ గారు రాసిన రెండు బ్లాగ్ పోస్ట్ లు చూశాను.అవి నీల్ అర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ అల్డ్రిన్ ల గురించి.వారి జన్మ సమయాన్ని, జాతక చక్రాలని బట్టి వారు చండ్రుడి మీడ కాలు పెట్టారా లేదా అని చెప్పేప్రయత్నం చేశారాయన.నాకెందుకో అంతటి మహత్తర కార్యాన్ని జ్యోతిష్యంతో ముడి పెట్టడం బుల్ షిట్ లా అనిపించింది.వాటి చివర నేను పోస్ట్ చేసిన కామెంట్లలో అదే రాశాను.పెద్దాయనకి కోపం వచ్చింది.సహజమె మరి.కష్టపడి రసిన దన్ని నలంతి జ్యొతిష్య విద్యా పామరుడు అల తీసి పరేస్తె కోపం రాదా మరి! మీకు బుల్ షిట్ అంటే అంత ఇష్టమా అని చురక అంటించారు.
అప్పుడు నేను ఆలోచించాను నాకు బుల్ షిట్ అంటే ఇష్టమా జ్యోతిష్యం అంటే ఇష్టమా అని.న అలోచనలకు జవాబే ఇది.
నగరాలలో చిన్నప్పటినుంచీ పెరిగిన వాళ్ళ సంగతేమో కానీ పల్లెలలో ఉన్న వాళ్ళకి బుల్ షిట్ అనేది అంత తీసి పారేయాల్సిన విషయం కాదని తెలుస్తుంది.అక్కడ చాలా మంది దాన్ని వీధులలో నుండి సేకరించి ఒక చోట వేసి పెడుతారు.దాన్ని పొలంలో చల్లితే పంట యేపుగా పెరగడానికి దోహదపడుతుందని.ఇళ్ళలో రాతి ఫ్లోరింగ్ లేని వాళ్ళు ఈ షిట్ ని ఇల్లు అలకడానికి వాడుతారు.ఇలా బుల్ షిట్ వలన నాకు తెలిసి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ఈ విధంగా స్పష్టంగా నిరూపితమైన ఉపయోగలున్న బుల్ షిట్ కన్నా శస్త్రంగా నిరూపితం కాని జ్యోతిష్యం గొప్పదని నేను అంగీకరించలేక పోయాను.బహుశా నాది అగ్నానం కావచ్చు.అయినా కళ్:ళ ముందు బుల్ షిట్ కి అన్ని ఉపయోగాలు కనిపిస్తున్నందున అది గొప్పదే అని నా ఉద్దేశ్యం.
శర్మ గారికి క్షమాపణలతో.
నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.
Search This Blog
Sunday, February 28, 2010
Friday, February 26, 2010
విమర్శకులందరూ(నాతొ సహా)ఇక నోళ్ళు మూసుకోవాలి
కొంత కాలం క్రితమే వోడూ సచిన్ టెండుల్కర్ ని విమర్శించేవాడే.వయసైపోయిందని, పస తగ్గి పోయిందని,పనై పోయిందనీ. నేను కూడా ఒక వెబ్ సైట్లో సచిన్ చేతి కర్ర పట్టుకొనె వయసు వచ్చిందాకా ఆడతాడా? అని ఒక వెబ్ సైట్లో రాశాను. ఒక రాజకీయ నాయకుడు బహుశా బాల్ థాకరే అనుకొంటా పేరులో టెన్ వుంది కాబట్టి సచిన్ టెన్ రన్స్ కి రెండు,మూడు అటొ ఇటో చేసి అవుతున్నాడని ఒక జోక్ కూడా వేశాడు.
మా అందరి నోళ్ళూ ఒక కళాత్మక, చరిత్రాత్మక ఇన్నింగ్స్ తో మూయించాడు లిటిల్ మాస్టర్.ఇక ఆ క్రికెట్ మేధావిని ఎవరు కూడా పన్నెత్తు మాట అనకుండా చేశాడు.కాబట్టీ విమర్శకులారా మనందరం నోళ్ళు మూసుకొని సచిన్ బ్యాటింగ్ ని అనందించుదాం.

డాక్టర్ల బారినుడి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి కొన్ని చిట్కాలు
వైద్యో నారాయణొ హరీ అని రెందు రోజుల క్రితం ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీరు రాసిన ఒక టపా చదివాక ఇది రాయాలనిపించింది.పాపం ఆయన గ్యాస్ ట్రబుల్ కోసం మూడో నాలుగో వేలు తగలేసిన బాదలో రాసిన కడుపు మంట టపా అది.
ఈ టపా రాయడానికి నాకున్న అర్హతల గురించి ఒక చిన్న మాట.ఇంటర్లో నేను బైపీసి తిసుకొని డాక్టరవుదామని తీవ్రంగా క్రుషి చేశాను.కానీ ఓపెన్ కేటగరీలో సీటు తెచ్చుకోగల సామర్ధ్యం కానీ ప్రైవేటుగా కొనుక్కొగల తాహతు గానీ లేక ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక చిన్న వ్యాపారం నడుపుకొంటున్నాను గానీ ఆనాడు నాతో కలిసి చదివ డాక్టర్లైన నా కజిన్స్,ఫ్రెండ్స్ చాలామంది నాతో టచ్ లో వున్నారు.వాళ్ళలో కొందరు స్పెషలిస్టులు, మరి కొందరు సూపర్ స్పెషలిస్టులూ వున్నారు.తరచూ వాళ్ళతో కలిసి మాట్లాడుతూ వుండడం వలన చాలా మటుకూ ఇన్ సైడర్ ఇంఫర్మేషన్ నాకు తెలుసు.దాన్ని ఉపయోగించి ఈ బ్లాగ్ రాస్తున్నాను.
1.ఓవరాక్షన్ వద్దు: మొదటిసారి చాతీలో నొప్పి వస్తే అది నొప్పి కన్నా మంటలాగా అనిపిస్తే,ఆ వ్యక్తి వయసు పతిక, ముప్పై యేళ్ళు అయితే 99% అది గ్యాస్ట్రైటిస్ అయి వుంటుంది.దానికి కార్డియాలజిస్ట్ దగ్గరికి ఆత్రంగా పరుగెట్టుకొని పోతె అతడికి వాటంగా చిక్కిన టార్గెట్ అవుతాం.తెలివైన రిస్క్ తక్కువగ వున్న పనేమిటంటే ఒక ఎంబీబిఎస్ డాక్టర్ని కలవడం.ఆ సారు కూడా రెండు మూడు టెస్టులతో బాదేసే అవకాశం వున్న స్పెషలిస్టు కొట్టే దెబ్బలు కొట్టడు. మనకి బాగా తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ వుంటే అది అన్నిటి కన్నా ఉత్తమం.
అలాగే మామూలు నడుము నొప్పికి కిడ్నీ ప్రాబ్లం అని ఊహించుకొని నెఫ్రాలజిస్టునో, యూరాలజిస్టునో కలవడం కూడా బుద్ధి తక్కువ పనే అవుతుంది.బాగా వున్న కిడ్నీలని అవి బాగా ఉన్నాయని తేల్చాలంటే అయిదు వేలకి తక్కువ ఖర్చవదు.
2.అతి తెలివి ప్రదర్శించవద్దు: ఒక వేళ మన డాక్టర్ మన్ అద్రుష్టం కొద్దీ టెస్టులేమీ రాయకుండా మందులు వాడి చూడాలనుకొంటే, స్కానింగ్ తీయించి చూద్దామా అనో పరీక్షలు చేయించి చూద్దామనో మనం లీడ్ ఇవ్వ కూడదు.ఇచ్చామంటే మన పని మటాషే.
3.తోకలు చూసి మోసపోవద్దు: పొడవాటి తోక వున్న ప్రతి కోతీ హనుమంతుడు కాదు.అలాగే పేరు చివర ఎక్కువ డిగ్రీలు తగిలించుకూన ప్రతి డాక్టరూ గొప్ప వాడు అయి వుండాల్సిన అవసరం లేదు.అసలు చాలా డీగ్రీలు ఎందుకూ పనికి రానివీ, అర్ధం లేనివీ అయి వుంటాయి.చాలా బాగం అవి మెంబర్ షిప్ డిగ్రీలు.ఉదాహరణకి ఈ సైట్ లో సభ్యులందరూ తమ పేరు చివర ===== అని రసుకోవచ్చు.అంటే మెంబర్ ఆఫ్ కూడలి వెబ్ సైట్ అని అర్ధం.కాబట్టి పొడవాటి తోక వున్న డాక్టర్ ఖచ్చితంగా గొప్పవాడు అయి వుండాలసిన్ అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఎక్కువ ఫీజు మాత్రం తీసుకొనే వాడు అయ్యుంటాడు.
4. చివరిగా హాస్పిటల్ బిల్డింగ్ షోకు, ఇంటీరియర్స్ తళుకూ, వాళ్ళిచ్చే ఫోల్డర్స్ క్వాలిటీలు చూసి మోసపోవద్దు.స్టాఋ హాస్పిటల్స్ కన్నా మామూలు కేసుల్లో విడిగా ప్రాక్టిసు చేసే వాళ్ళు కొంచెం సేఫ్. తక్కువ బాదుతారు. పెద్ద హాస్పిటల్స్ లో డాక్టర్లకి కొన్ని టార్గెట్స్ వుంటాయి.ఆవసరం వున్నా లేకపోయినా వాళ్ళు కొన్ని టెస్టులూ,స్కాన్నింగులూ తీయిస్తారు.

Thursday, February 25, 2010
సచిన్ పాంటింగ్ కన్న గొప్ప వాడేమీ కాదు!!!!!!!!
ఆశ్చర్య పోకండి.ఇది నిజం.సచిన్ పాంటింగ్ కన్నా మాత్రమే కాదు, గత నలభై చిల్లర యేళ్ళలో వండే క్రికెట్ ఆడిన అందరికన్నా కూడా గొప్పవాడు.సచిన్ వచ్చిన నాటి నుండీ అతన్ని మిగతా క్రికెటర్లతో పోల్చి అతడి ప్రతిభని అంచనా వేయడం విశ్లేషకులకి ఒక పరిపాటి అయింది.మొదట్లో లారాతో అటుపిమ్మట సరిగ్గా రెండేళ్ళు కూడా ఉఛ్ఛ స్తితిలో నిలువలెని కోన్ కిస్కా గాళ్ళతోనూ పోల్చి స్పోర్ట్స్ కాలం లు స్పోర్ట్స్ రిపోర్టులూ నింపిన వారు ఇంక అవన్నీ చాలించవచ్చు.సచిన్ తన తాజా ఇన్నింగ్స్ తో వీటన్నిటికీ తెర దించాడు.ఇప్పుడిక సచిన్ వండే క్రికెట్లో ఎవరూ ఇప్పుడిప్పట్లో అందుకోలేని మహోన్నత స్తాయికి ఎదిగిపోయాడు.ఇప్పుడున్న వాళ్ళ ఇకపై వచ్చే వాళ్ళూ సచిన్ తో పోల్చుకొని తమ స్తానం ఎక్కడో చూసుకోవాలి తప్ప అతనితో పోల్చుకో కూడదు.ఇంత కలం సచిన్ పేరిట లేని ఆ ఒక్క రికార్డూ ఇప్పుడు అతని వశమయ్యింది.ఇప్పుడు పాంటిగ్ తో పోలిస్తే సచిన్ కొంచెం తక్కువగా ఉన్నది కేవలం ఒక్క విషయం లోనే.అదేమిటంటే తన దేశానికి ప్రపంచ కప్ సాధించలేక పోవటం.ఎంత గొప్ప వాడైనా కప్ గెలవాలంటే ఒంటి చేత్తో సాధించడం అయ్యే పని కాదు. మిగిలిన టీం సభ్యులందరూ రాణించినప్పుడే అది సధ్య పడుతుంది.కేవలం ఆ ఒక్కటీ సాధించాలనే సచిన్ వచ్చే ప్రపంచ కప్ వరకూ క్రైకెట్ అడాలని నిర్ణయించుకొన్నాడని నా అభిప్రాయం.2011 ప్రపంచ కప్ లో భారత జట్టు లోని సభ్యులందరూ సమిష్టిగా రాణించి ప్రపంచ కప్ గెలుస్తారని, సచిన్ ఖాతాలో ఆ ఒక్క మిగిలిన ఘనతని కూడా చేరుస్తారనీ ఆశిద్ధాం.కాబట్టి సచిన్ ఫాంటింగ్ కన్నా గొప్పవాడు కాదు.నలభై yeళ్ళ వండే క్రికెట్లోని ఆట గాఆళ్ళందరికన్నా గొప్ప వాడు.
Tuesday, February 23, 2010
ఈ చెత్త వెధవలు ప్రజా ప్రతినిధులా?
"నా మీద 80 కేసులున్నాయి.ఎవడూ నన్నేమీ చేయలేడు","నేను పన్నేండు ఏళ్ళప్పుడే మర్డర్ చేశాను తెల్సా?" ఇవి ఎవడో రౌడీ కొట్టిన గప్పాలు కాదు. ఒక ఎమ్మెల్యే తమ్ముడు సగర్వంగా చెప్పిన మాటలు.వాడిని కాపాడుతూ వాడి అన్న, వాళ్ళీదరినీ కాపాడడానికి పోలీసులు, ఈ మొత్తాన్నీ కంటికి రెప్పలా కాపాడే కాటికి కాళ్ళు చాపుక్కూర్చున్న ముఖ్యమంత్రి ముసలి నక్క.వీళ్ళ బారినుండి ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడగలరు?ఇటీవలి కాలంలో ప్రజా ప్రతినిధులమని చెప్పుకొనే రాక్షసులు తమ నిజ స్వరూపం పబ్లిగ్గా బయట పెట్టడం ఇది మొదటి సారి కాదు.ఆ మధ్య రాయలసీమ ఫాక్షన్ తమ్ముడు టీవీ కెమెరాల సాక్షిగా ట్రాన్స్ పోర్ట్ అధికారులపై ఫైళ్ళు విసిరేసి సభ్యత కల మనుషులు ఉచ్చరించలేని భాషలో బోతులు తిట్టడం మమందరం లైవ్ లో చూశాం.ఇంకొంత కాలం క్రితం స్వయానా ఇంజినీరు అయిన మరొక రాయలసీమ ఎంపీ నీటి పారుదల ఇంజినీర్లను తను వాళ్ళ అమ్మ,అక్క,ఆలిని ఏం చేయాలనుకొంటున్నాడో స్వచ్చమైన సంస్కృతంలో టీవీ కెమెరాల ముందు మనందరి చెవులు రింగుమని మారు మోగేలా వినిపించాడు.ఇవన్నీ పట్టించుకొంటే సీమలో ఉద్యోగం చేయలేమని ఆ బాధిత ఇంజినీరు తరువాత అవే టీవీ కెమెరాల ముందు వాపోయాడు పాపం. అంతకు కాస్త ముందు బలిసిన ఎంపీ ఇంకొకడు మళ్ళీ కెమెరాల సాక్షిగా ఒక ప్రభుత్వ ఉద్యొగి చెంపపైన తన బాక్సింగ్ నైపుణ్యం మనందరికి చూపించడం కూడా మనం చూశాం.అయితే మనం కొంచెం వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాల్సిన అవసరం వుంది.తమ పార్టీ అధికారంలో ఉండగా ఇలాంటి చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకో వద్దంటే ఎలా?అసలే తాము కాగ్రెస్ కోతులు, పైపెచ్చు అదికారమనే కల్లు తాగాము.ఇప్పుడు అదుపులో వుండాలంటే అది న్యాయమేనా? ఫ్రజలే కొంచెం ఆలోచించి సర్దుకొపోవాలి.
Sunday, February 21, 2010
మానవ జాతికి అన్నీ అరిగిపోయి ఊడిపోనున్నాయా?
ఈ మధ్య పేపర్లలో రెండు సాంకేతిక ఆవిష్కరణల గురించి చదివె రాస్తున్న బ్లాగ్ ఇది.మొదటిది చేతి కదలికలననుసరించి మారే టీవీ.అంటే దాన్ని మార్చటనికి రిమోట్ వాడాల్సిన పని కూడా లేదన్నమాట.టీవీ దగ్గరికి పోయి మార్చే ఓపిక లేని వాళ్ళ కోసం రిమోట్ కనిపెడితే దాన్ని నొక్కడం కూడా పని అనుకొనే బద్దకం రాయుళ్ళ కోసం ఈ కొత్త టీవీని తయారు చేస్తున్నారన్న మాట. ఇంకొకటి డొకోమో సంస్థ తయారు చేయబోయే సెల్ ఫోన్.ఇది కేవలం మన కళ్ళ కదలికల ననుసరించి కాల్ చేయటం, కాల్ ఆన్సర్ చేయడం చేస్తుంది.సెల్ ఫోన్ బటన్లు నొక్కడనికి కూడా ఓపిక లేని పరమ బద్దకిష్టులకోసం ఈ ఫోన్ అన్న మాట.కొంత కాలానికి కళ్ళు కదల్చటం కూడా శ్రమ అని భావిస్తే ఏమి చేస్తారు?దానికి కూడా పరిష్కారం వుంది.మన మెదడులొ ఒక చిప్ ని శాశ్వతంగా బిగించి దాని ద్వారా కెవలం మన మెదడులో ఆలోచనల ద్వారా కాల్ చేయడం లేదా అన్సర్ చేయడం చేయవచ్చు. ఆ టెక్నాలజీ కూడా ఎంతో దూరంలో లేదు.అయితే ఏ అంగమూ పని చేయకుండా ఈ మనిషి అనే వాడు ఏమి చేయాలన్నట్టు?పని లేనివాడి బుర్ర దెయ్యాల కార్ఖానా అన్నట్టు తనని తాను నశనం చేసొకోవటానికో లేదా పక్క వాడిని నాశనం చేయడానికో కావలసిన ఆలోచనలు చేయవచ్చు.చాలకాలం క్రితం తెలుగులో ఒక సైన్స్ ఫిక్షన్ నవల చదివాను బుద్ధిజీవి అని.ఎన్నార్ నంది అనుకొంటాను దాన్ని రాసింది.భవిష్యత్తులో మనిషి ఏ అవయవాన్నీ వాడకపోవడంతో డార్విన్ సిద్ధంతాన్ని అనుసరించి అవన్నీ నశించి పోయి కేవలం మెదడు ఒక్కటే మిగులుతుంది అనేది దానిలో ప్రదానాంశం.ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఆ గడియ రావడనికి ఎంతో కాలం పట్టదేమో అనిపిస్తోంది.
Wednesday, February 17, 2010
పుచ్చ కాయకు వందనం
మనం తినే పండ్లన్నింటిలోకి పుచ్చ కాయని మించింది లేదని నా అభిప్రాయం. అందుకే దాన్ని పొగుడుతూ ఈ టపా.బాగా ఎండ కాసే రోజు పుచ్చ కాయని తింటే వచ్చే హాయి ఇంక ఏ కాయ లేదా పండుని తిన్నా కూడా రాదు.దీనిలో దాహాన్ని తీర్చే ద్రవ పదార్దాలు చాల వున్నాయి.ఎంత తిన్నా లావెక్కుతామన్న భయం లేదు.అంతే కాక షుగర్ అదుపులో ఉంటే డయబెటీస్ రోగులు కూడా దీన్ని తినవచ్చు.ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరుసటి రోజున విరేచనం సాఫీగా అవుతుంది.పీచు పదార్థం ఎక్కువగ ఉండే ఆహారం తింటే పేగు కాన్సర్ వచ్చే అవకాసం తగ్గుతుందని శశ్త్రవేత్తల ఉవాచ.ఒకటే ఇబ్బంది ఏమంటే ఇప్పుడు వేసవి కాలం చివరిదాకా పుచ్చకాయల దిగిబడి వుండటం లేదు.ఏ ఏప్రిల్ మధ్యలోనే ఆగిపొతూంది.అయినా మన శస్త్రవేత్తలు వంకాయని పట్టుకొని దానిలోకి బీటీ బాక్టీరియాని చొప్పించి దాని దుంప తెంచకపోతే వేసవి కాలమంతా దిగుబడి అయ్యేలా కొత్త రకం పుచ్చ వంగడాలని సృష్టించి మనకి వేసవి తాపం తీర్చవచ్చు కదా?
Monday, February 8, 2010
కడప బాంబులక్కూడా ఇవ్వలి.
వెంకటగిరి చీరలకు GI గుర్తింపు ఇవ్వలనుకోవడం చాలా సంతొషదాయకం.ఈ వల్ల అయినా చేనేత రంగంలో వున్న వారి కష్టాలు తీరితే మంచిది.తిరుమల లడ్డు, ఇప్పుడు చేనేత. మంచిది. అయితే ఈ కేటగిరీలో ఇంకా కొన్ని రావలసి వుంది.కాకినాడ కాజా,గుంటూరు మిరప, పూతరేకులు ఎట్సెట్రా . ఈవి కాకుండా అందరూ మరిచిపోయిన వస్తువు ఇంకొకటి వుంది ఈ లిస్టులో.అది కడప నాటు బాంబు.అవునండీ.కడప బాంబులు ఎంతైనా ఈ లిస్టులో చేర్చదగ్గ ప్రాముఖ్యం వున్న విషయమే.
బాంబులందు కడప బాంబులు వేరయా అని వాటి గురించి తెలిసిన వాళ్ళు చెబుతుంటారు.వాటిని చేయడం చాలా సింపుల్.అందుకే ఎన్నికల సమయంలో ఎన్నో కుటుంబాలు ఈ పనిలో వుంటాయి.వాడటం కూడా సింపులేనంటారు నిపుణులు.ఒక బక్కెట్లో నీళ్ళూ పోసి అందులో బాంబులు వేసి అవసరమైనప్పుడు తీసి విసరడమే.
అసలు వీటికి పేటెంట్ తీసుకొని కొంచెం అభివ్రుద్ధి చేసి దీర్ఘకాలం స్థిరంగా వుంచగలిగితే మన దేసం యొక్క అంబుల పొదిలో మంచి ఆయుధలౌతాయి.అంతె కాక వీటిని ఇతర దేశాలకు అమ్మి చాలా విదేశీ మారక ద్రవ్యం కూడా ఆర్జించవచ్చు.
తాలిబన్లతో పోరాటంలో తమ ఆధునిక ఆయుధాలతో అవస్థలు పడుతున్న అమెరికన్లకు ఈ బాంబులు బాగా వుపయోగపడ్తాయి.సరిహద్దుల్లో జిహాదిస్టుల చొరబాట్లను ఎదుర్కొంటున్న మన సైనికులకు కూడా ఇవి మంచి అయుధాలవుతాయి.చొరబాటూదారు వున్నాడని అనుమానం వొచ్చి వాడిని చూడలెనప్పుడు, తుపాకితో గురిచూసి కాల్చలేనప్పుడు, ఆ వైపు చక చక ఓ పది బాంబులేస్తే వాడు లేదా వాళ్ళు చచ్చూరుకొంటారు.లేదా బతికితే ఈ జీవితం కన్నా చావే నయమనిపించేలా అవిటి వాడౌతాడు.
చిదంబరం గారూ చదువుతున్నారా?

Sunday, February 7, 2010
అనవసర ఆపరేషన్ల ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీలో అవసరం లేకపోయినా యువతులల్కు గర్భ సంచి తొలగించే హిస్టెరెక్టమీ ఆపరేషన్లు కొన్ని హాస్పిటళ్ళు,డాక్టర్లూ చేస్టున్నట్లు టీవీలలో వచ్చిన కధనం మీరందరూ చూసే వుంటారు.ఆ న్యూస్ లో సమగ్రత లేదనిపించి నాకు బాగ తెలిసిన, బంధువులు అయిన కొందరు డాక్టర్లతో మాట్లాడితే అనేకమైన అశ్చర్యం కలిగించే విషయాలు తెలిశాయి.
ఆరోగ్యశ్రి రాకముందే ఈ ఆపరేషన్ కొంచెం ఎక్కువ గానె చేసేవారు.అనేక జిల్లా కేంద్రాలలో ఈ ఆపరేషన్ ని 8-15 వేలలోపు ఖర్చుతో చేసే వారట.అది లాపరాటమీతో అంటే పొట్ట కోసి చేస్తే. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఈ ఆపరేషన్ కి 35 వేలు ప్యాకేజి వుంది.అయితే ఇది లాపరోస్పి అసిస్టెడ్ వగైనల్ హిస్టెరెక్టమీ అయితేనే.అంటే పొట్ట కోయకుండా కేవలం కొన్ని రంధ్రాలు వేసి గర్భశయాన్ని యోని మర్గం ద్వారా తొలగించడం.ఇది ఆదునాతనమూ,క్లిష్టతరమూ అయిన ఆపరేషన్.ఇది పాత ఆపరేషన్ అంటే పొట్ట కోసి చేసే దానికన్నా ఖచ్చితంగా మెరుగైందా అంటే తెలియదు అనేది వారి సమాధానం.ఇప్పటికీ ఏది మెరుగు అనే విషయం పూర్తిగా తేలలేదు అంటారు వాళ్ళు.ప్రతి కాంఫరెన్సులోనూ ఏది మంచిది అనే విషయమ్మీద నిపుణులు చర్చిస్టూనే వున్నారట.
అయితే పది వేలతో పొయేదానికి 35 వేలు ఇస్తూ వుంటే అందులోనూ ఎలంటి బేరసారాలూ లేకుండా వస్తూ వుంటే చేతులు ముడుచుకుని డాక్టర్లు మాత్రం ఎందుకు వుంటారు.అందులో అత్యధిక భాగం లక్షలు పొసి డిగ్రీలు కొన్న బాపతాయే.
ప్రభుత్వాసుపత్రిలో చేయగలిగే సింపుల్ ఆపరేషన్ ని ప్రభుత్వమే డబ్బులిచ్చి దాని తాలూకూ క్లిష్టతరమైన వెర్షన్ ని చేయించడం ఎంతవరకూ సబబు అనేది కొందరు ఎథిక్స్ మిగిలి వున్న డాక్టర్ల ప్రశ్న.ఈ విధంగా ప్రబుత్వమే అనవసరంగా ఈ ఆపరేషన్ జరిగేలా ప్రొత్సహుస్తోంది అంటారు వాళ్ళు.
ఈ కేటగిరీలో ఇంకొకటి అపెండిక్స్ మరియూ గాల్ బ్లాడర్ ఆపరేషన్. అపెండిసైటిస్ అనేది ఏ చిన్న ప్రభుత్వాసుపత్రిలో నైనా అతి సాధారనణంగా అయిదారు సెంటీ మీటర్ల కోతతో అరగంటలో చేసే ఆపరేషన్.దీనిని ఆరోగ్యశ్రీలో 30 వేల ప్యకేజీతో ల్యాపరోస్కోపీ ద్వారా చేయిస్తున్నారు.కాబట్టి ఇప్పుడెవరూ కడుపు నొప్పి అని ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని వచ్చే పేషంటుకి మందులు వాడి చూడటం లేదు.
అల్ట్రా సౌండ్ స్కనింగ్ లో అపెండిసైటిస్ అని అనుమానం వ్యక్తమైతే ఆపరేషన్ చేస్తున్నారు.ఇంతవరకూ బానే వుంది.స్కానింగ్ లో ఏమీ లేకపోతే ఎలా?స్కానింగ్ కూడా వాళ్ళ హాస్పిటల్ లోనే వుంటే స్కానింగ్ రిపోర్ట్ మార్చటం చిన్న పని.లేదంటే అలవాటుగా ఈ డాక్టర్ పేషంట్లుని పంపి స్కానింగ్ తీయించే స్కానింగ్ సెంటర్ కి ఫోన్ చేసి చెబితే ఈయనకి కావలసిన రిపోర్ట్ వస్తుంది.తరువాత పెషంటుని ఆపరేషన్ కి వొప్పించడం చిన్న పని.
నీకు ఆపరేషన్ అవసరం, కార్డు మీద ఫ్రీగా చేస్తాము, వెంటనే చేయకపోతే కష్టం అంతే వాడు ఒప్పుకొని తీరతాడు.
ఇక్కడితో ఇది పూర్తవలేదు.ఇంకొక మెలిక ఉంది.గాల్ బ్లాడర్ ని తొలగించే ఇంకొక ఆపరేషన్ కూడా 35వేల ప్యాకేజీతో ఆరోగ్యశ్రీలో వుంది.అదే స్కానింగ్ రిపోర్ట్ లో గాల్ బ్లాడర్ లో రాళ్ళు వున్నట్టు వుంటే దానికి ఇంకొక 35 వేలు వస్తుంది.అపెండిక్స్ బాటు దాన్నీ తీసి వేస్తే దానికీ డబ్బు వస్తుంది.
మాటకారి డాక్టరైతే ఈ రెండో ఆపరేషన్ గురించి ముందుగా చెప్పి పేషంటుని ఒప్పించడం పెద్ద విషయం కాదు.నీకు కడుపులో ఇంకొక ప్రాబ్లం కూడా వుంది.ఇప్పుడే ఆపరేషన్ చేసుకొంటే మంచిది. పనిలో పనిగా అయిపొతుంది అంటే వాడు ఒప్పుకొని తీరతాడు.ఏమో అనుకొంటే వాడికి చెప్పకుండ చేసినా ఏమీ కాదు. ఇది కూడా ల్యాపరోస్కోపిక్ ఆపరేషనె. పైకి కుట్లు వుండవు. కేవలం మూడూ నాలుగు రంధ్రాలు వుంటాయి అంతే.
ఒకవేళ పేషంట్ కొంచెం లిటిగెంట్ అయి నాకు చెప్పకుండా ఆపరేషన్ చేసే హక్కు నీకు లేదు అని మాట్లాడితే ఆపరేషన్ మధ్యలో గాల్ బ్లాడర్ లో చీము కనిపించింది అందుకే తిసేశాం అంటే అయిపోతుంది.
ఆపరేషన్ చేశామా లేదా అన్నదానికి ఋజువులు ఏమీ వుండవా అని అడిగితే, ఆపరేషన్ చేసేటప్పుడు కడుపులో దృశ్యాలు సీడీలో తీసి సబ్ మిట్ చేయాలి.ఇది చాలా సింపుల్ గా మ్యానేజ్ చేయ వచ్చు.అస్సలు నూటికి తొంభై మందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు వుంటయి.వాటిని ఏమీ చేయాల్సిన అవసరం వుండదు.ఆరోగ్యశ్రీ పుణ్యమా అని అలాంటి వాటికి కూడా గాల్ బ్లాడార్ తీయించుకొనే సౌలభ్యం కల్పిస్తోంది మన ప్రభుత్వం.
1.ఆరోగ్యశ్రీ పధకాన్ని విమర్శించడం నా ఉద్ధెశ్యం కాదు.కొన్ని లోటు పాత్లు ఎత్తి చూపడమే నా పని.
2.ఇందులోని టెక్నికల్ విషయాలు ఇంకొకరు చెప్తే నేను తెలుసుకొన్నవి.మెడికల్ గ కానీ ఆరోగ్యశ్రీ పధకం గురించి కానీ ఏవైనా తప్పులు దొర్లితె సవరించుకొగల వాడను.

Saturday, February 6, 2010
ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ అవసరమా?
దళితులని అవమానిస్తే వరికి అండగా వుండాలని ప్రవేశ పెట్టిన చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. కానీ ఇది చాలా సార్లు దుర్వినియోగం అవుతుంది.స్వయంగా ఒక న్యాయమూర్తి చెప్పిన విషయం ఇది.ప్రతి చిన్నదానికీ ఈ యాక్ట్ కింద కేసులు పెట్టి చాలా సార్లు ఎదుటి వారిని మానసిక క్షొభ పెట్టడానికే ఈ చట్టం ఉపయోగ పడుతుంది అని చాల మంది ఒప్పుకొంటారు.
అసలు ఇప్పుడు ఈ చట్టంతో అవసరం ఉందా అని కూడా మనం ప్రస్నించుకోవాలి.దళితులు చాలామంది వారి పేర్ల చివర కులం తోకలు తగిలించుకొంటున్నారు. అలాంటప్పుడు వారు మమ్మల్ని కులం పేరు పెట్టి తిట్టారని ఎలా కేసు పెడతారు.ఇప్పుడు మాల, మాదిగ అన్నవి రెడ్డి, నాయుడు, చౌదరి లాగా చలామణి అవుతున్నాయి కదా. కాబట్టి కేవలం ఎదుటి వాళ్ళని వేదించడానికే ఉపయోగపడే ఈ చట్టాన్ని చెత్త బుట్ట దాఖలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Thursday, February 4, 2010
రోశయ్యా నీకు బుధ్ధుందా?
తాతా రొశయ్యా ఎవరేమన్నా నీ మీద నాకు చాలా నమ్మకం వుండేది రాష్ట్రాన్ని సరిఘా నడపగల సమర్ధుడివని. కానీ మొన్న పత్రికా సమావేశంలో నీ మాటలు చూశాక అది పోయింది. పోలీసులు మనని కాపాడగలరని నాకేమి భ్రమలు లేవు అని నువ్వన్న మాటలు నీమీద వున్న విస్వాసాన్ని తుంచేశాయి.
పోలీసుల మీద నీకే నమ్మకం లేకపోతే ప్రజలకు, ప్రతి పక్షాలకు ఎళా వుంటుంది? అయినా నీకు ఇప్పటికైనా ఎక్కిందో లేదో గానీ నువ్వు ఈ రాష్ట్రానికి అధినేతవి.అనుమానంగా వుంటే ఒక సారి సోనియ్యమ్మకి ఫోన్ చేసి అడిగి కనుక్కో.
సమర్ధులైన పోలీసులని కీలకమైన పోస్టుల్లో నియమించి వారితో పని చేయించాలసిన భాధ్యత నీమీద వుంది.అది చేత కాక పోతే పక్కకి తప్పుకోవడం మంచిది కదా.వుంటే గింటే మీ పార్టీలో ఎవరైనా అదీ లేకుంటే ఆపోజిషన్ లోనుంచే సమర్ధుడెవరైనా వచ్చి పాలన చేస్తాడు.
నీ చేతిలో రాష్ట్రలక్ష్మిని చూస్తుంటే నపుంసకుడి పక్కన రంభని చూస్తున్నట్లుంది.

Tuesday, February 2, 2010
షరియా మెరుగైన విధానమా?
అందరం చూశాం...కన్నీటితో చూశాం...గుండెలు పగులుటుంతే చూశాం...గుండెలు పగిలేలే చూశాం...వైష్ణవిని ఎలా చంపారో చూశాం..రేపు అ హంతకులు తప్పించుకోవడ< కూడా చూస్తామేమో? మహా ఐతే పోలీసులు ఒకడిని ఎంకౌంటర్ చేసి చేతులు దులిపేసుకుంటారు.అంతటితో మనమూ మన చానల్సూ దీన్ని వదిలేసి మరొక దానిని తగులుకుంటాం. ఇదే దారుణం మళ్ళీ జరగదని నమ్మకం మీకుందా?
నాకు లేదు.
సజ్జనార్ సాబ్ యసిడ్ దాడి నిందుతులని ఎన్ కౌంటర్ చేసిన మర్నాడే యాసిడ్ సంఘటన పునరావృతం కవడం మీరు చదవలేదా?
అందుకె నాకు అనిపిస్తుంది ఇలాంటి కేసుల్లో మన ఐ పీ సి కన్నా షరియా చట్టం బగా పని చేస్తుందేమోనని!
వెధవలని నడి రోడ్డు మీద కట్టి వేసి రాళ్ళతో కొట్టి చంపితే ఇంకొకడికి ఆ పని చేయాలంటే వెన్నులో వణుకు పుట్టదా?
ఒక వివరణ: నేను ముస్లిమునో, సూడో సెక్యులరిస్టునో కాదు.నరెంద్ర మోడి ని సమర్దించే కాస్త రైట్ వింగు వాడిని. అయిన వైష్ణవికి జరిగిన దాౠణం చూసాక నాకు అనిపించింది ఇలాంటి రక్షసులని శిక్సించాలంటే షరియా ఒక్కటే సరైన పద్ధతి అని.

Monday, February 1, 2010
ఈ కల్కి GOD కాదు-గాడ్ ఫాదర్
మొన్న మాహా టీవీలో కల్కి మీద లైవ్ షో చోస్తూ వుంటే భయం వేసింది.ఎంత మంది పిచ్చి వాళ్ళు ఎన్ని కోట్లు విరాళాలు,ఎంత పెద్ద నిర్మాణాలు.ఒక మనిషి,అప్పటి వరకు ఎల్ ఐ సీ లో ఏజెంటు గా పని చేస్తూ ఉన్నట్టుండి నేను కల్కిని విష్ణు మూర్తి అవతారాన్ని అని చెప్తే నమ్మి అతన్ని ఆరాదించడం... ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందోనని.
అంతకన్నా భయపెట్టిన అంశమేమిటంటే ఆ షో ఒక వైపు నడుస్తూండగానే ఆ చానాల్ ఆఫీసుపై కల్కి భక్తులమని చెప్పుకొనే కొందరు దాడి చేయడం.ఎంత పెద్ద నెట్వర్క్ లేకపోతే ఇలంటి దాడీ చేయడానికి వీలవుతుంది?అదే షో లో పాల్గొన్న ఓ కల్కి భక్తుడు పొరబాటుగానో, లేక అతని మనసులో నిజం అతని ప్రమేయం లేకుండా భయటికి వచ్చిందో గాని, ఒక విషయం చెప్పాడు. కల్కి ఆశ్రమంలో చేరాలంటే మొదటిగా లక్ష రూపాయలు చెల్లించడం ఎందుకు అనే ప్రశ్నకు అతను చెప్పిన సమధానం "మాది ఒక కంపెనీ" అని. వెరీ గుడ్, నిజం ఒప్పుకొన్నాడు.
అదే షోలో నారాయణ రెడ్డి అనే ఒక కల్కి భక్త శిఖామణి ఛాలా బాధ పడి పోయాడు ప్రపంచం కోసం అంత కష్ట పడి పొతున్న స్వామి గురించి అలా అభద్దాలు ప్రచారం చేస్తున్నందుకు. దైవ స్వ్రూపుడికి భక్తుల డబ్బు ఎందుకండీ, వరికి ఇతను డబ్బులు ప్రసాదించి వాళ్ళ కష్టాలు తీర్చాలి కానీ?
ఈ దేశంలో తిండికి కొరవేమో గాని దైవాలకీ, వాళ్ళ అవతారాలకీ కొదవ లేదు అని మరో సారి ౠజువైంది.

Subscribe to:
Posts (Atom)