నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, February 20, 2011

శరతన్నయ్యా! ఇక్కడ మీ అవసరముంది. జర చూడరాదే!


ప్రపంచంలో స్వలింగ సంపర్కుల హక్కుల గురించి ఎన్ని మార్పులొచ్చినా మన దేశంలో మాత్రం వాళ్ళ పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు అనడానికి డిల్లీలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. 
 
డిల్లీలో మంచి పోష్ లొకాలిటీ అయిన వసంత్ కుంజ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు యువతులు నివాసముండే ఫ్లాట్ మీద ముంబాయి, డిల్లీ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. అ హడావిడి చూసి ఇతర ఫ్లాట్‌లలో ఉండే వాళ్ళు బెదిరిపోయారు వాళ్ళు ఏ ఐఎస్‌ఐకో, లష్కర్‌కో చెందిన తీవ్రవాదులేమోనని. కానీ వాళ్ళు పాపం అంత ప్రమాదకరమైన వాళ్ళేమీ కాదు. వాళ్ళు చేసిన నేరమల్లా లెస్బియన్లు కావడమే.

వాళ్ళిద్దరూ ముంబయిలో ఒక కోచింగ్ సెంటర్లో కలిశారు. ఒకరినొకరు ఇష్టపడి కొద్ది కాలంలోనే ఒకరినొకరు ఇష్టపడి లెస్బియన్ బంధం ఏర్పరచుకొన్నారు. ఈ వ్యవహరం ఒకమ్మాయి ఇంట్లో వారికి నచ్చలేదు. ఇద్దరి బంధాన్ని విడదీయాలని పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఈ ప్రేమజంట అక్కడినుంచి లేచిపోయి మొదట పూనేలో ఆ తరువాత బెల్గాంలో కాపురం పెట్టి చివరికి డిల్లీ చేరారు. 


వసంత్ కుంజ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకి తీసుకొని అన్యోన్యంగా సంసారం చేసుకుంటూండగా వీరి ఆచూకీ పెద్దలకి తెలిసింది. వాళ్ళు అన్యోన్యంగా బతుకుతున్న మన ప్రేమికురాళ్ళని విడదీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దానితో బెంబేలెత్తిన ఈ జంట ఇలాంటి విషయాలలో సహాయం అందించే సంగిని అనే ఒక స్వచ్చంద సేవా సంస్థ సాయం అర్ధించారు. ఈలోగా ఈ కుటుంబ పెద్దలు ఈ విషయాన్ని National Council for Women  చైర్‌పర్సన్ గిరిజా వ్యాస్ దృష్టికి తీసుకెళ్ళారు. తనకి వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదని, తమిద్దరం ఒకరినొకరు పూర్తిగా ఇష్టపడే కలిసి జీవిస్తున్నామని ఆమె ముంది స్టేట్‌మెంట్ ఇచ్చారు ఈ అమ్మాయిలు.
 
ఇది  జరిగిన కొన్నాళ్లకి ఇంట్లోంచి లేచిపొయే సమయంలో ఇంట్లోని నగలు, డబ్బూ తీసుకెళ్ళిందని ఒక అమ్మాయి కుటూంబ సభ్యులు ముంబయిలో పోలీసులకి ఫిర్యాదు చేశారు. ముంబయి పోలీసులు ఒక టీం డిల్లీకి వచ్చి కొందరు లోకల్ పోలీసులతో కలిసి వీళ్ళు ఉంటున్న ఫ్లాట్ మీద శనివారం రాత్రి దాడి చేశారు. భయంతో ఠారెత్తిన ప్రేమ జంట ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని సంగిని స్వచ్చమ్ద సంస్థ వారికి ఫోన్ చేయడంతో సమయానికి వాళ్ళు వచ్చి అరెస్టుని అడ్డుకున్నారు. ఈలోగా మరింత మంది కార్యకర్తలు అక్కడకి చేరుకోవడంతో అరెస్టు కార్యక్రమాన్ని వాయిదా వేసి పోలీసులు వెనుతిరిగారు.
 
ప్రపంచంలో ఎన్ని మార్పులొచ్చినా గే, లెస్బియన్ బంధాలకు సంబంధించి మన దేశంలో ప్రజల ఆటిట్యూడ్‌లో ఏమాత్రం మార్పు రాలేదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మరి మన శరత్ అన్నయ్య ఏమంటారో?!

1 comment:

శరత్ కాలమ్ said...

నేను మీ టపా ఇప్పుడే చూసాను. కొన్ని పేరాలు నా బ్రవుజరులో డిస్ప్లే కాలేదు కాబట్టి పూర్తిగా చదవలేకపోయాను.

ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు మొదట్లో వ్యతిరేకత సహజం. ఈ కష్టలు అన్నీ పురిటినొప్పుల లాంటివి. అయినా సరే వెలుగులోకి వస్తూవుంటే, ప్రజలు ధైర్యం చేస్తూవుంటేనే నెమ్మదిగా ప్రజలు అలవాటవుతూ వుంటారు. భారత దేశంలో వున్నవారి సంగతి అంటే అర్ధం చేసుకోవచ్చు కానీ యు ఎస్ లాంటి దేశాలకు వచ్చి ఎన్నో ఏళ్ళుగా ఇలాంటి వార్తలకు ఎక్స్పోజ్ అయిన వారిలో కొందరు ఇంకా హోమో ఫోబియాను చూపిస్తుండంటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవు అలాంటివారికి. మధ్యలో మనసుల్లో మార్పు రమ్మంటే ఎలా వస్తుందీ? అలాంటి వారు ముదిరితేనే తాలిబాన్లు అవుతారు.