నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, February 8, 2010

కడప బాంబులక్కూడా ఇవ్వలి.

వెంకటగిరి చీరలకు GI గుర్తింపు ఇవ్వలనుకోవడం చాలా సంతొషదాయకం.ఈ వల్ల అయినా చేనేత రంగంలో వున్న వారి కష్టాలు తీరితే మంచిది.తిరుమల లడ్డు, ఇప్పుడు చేనేత. మంచిది. అయితే ఈ కేటగిరీలో ఇంకా కొన్ని రావలసి వుంది.కాకినాడ కాజా,గుంటూరు మిరప, పూతరేకులు ఎట్సెట్రా . ఈవి కాకుండా అందరూ మరిచిపోయిన వస్తువు ఇంకొకటి వుంది ఈ లిస్టులో.అది కడప నాటు బాంబు.అవునండీ.కడప బాంబులు ఎంతైనా ఈ లిస్టులో చేర్చదగ్గ ప్రాముఖ్యం వున్న విషయమే.
బాంబులందు కడప బాంబులు వేరయా అని వాటి గురించి తెలిసిన వాళ్ళు చెబుతుంటారు.వాటిని చేయడం చాలా సింపుల్.అందుకే ఎన్నికల సమయంలో ఎన్నో కుటుంబాలు ఈ పనిలో వుంటాయి.వాడటం కూడా సింపులేనంటారు నిపుణులు.ఒక బక్కెట్లో నీళ్ళూ పోసి అందులో బాంబులు వేసి అవసరమైనప్పుడు తీసి విసరడమే.
అసలు వీటికి పేటెంట్ తీసుకొని కొంచెం అభివ్రుద్ధి చేసి దీర్ఘకాలం స్థిరంగా వుంచగలిగితే మన దేసం యొక్క అంబుల పొదిలో మంచి ఆయుధలౌతాయి.అంతె కాక వీటిని ఇతర దేశాలకు అమ్మి చాలా విదేశీ మారక ద్రవ్యం కూడా ఆర్జించవచ్చు.
తాలిబన్లతో పోరాటంలో తమ ఆధునిక ఆయుధాలతో అవస్థలు పడుతున్న అమెరికన్లకు ఈ బాంబులు బాగా వుపయోగపడ్తాయి.సరిహద్దుల్లో జిహాదిస్టుల చొరబాట్లను ఎదుర్కొంటున్న మన సైనికులకు కూడా ఇవి మంచి అయుధాలవుతాయి.చొరబాటూదారు వున్నాడని అనుమానం వొచ్చి వాడిని చూడలెనప్పుడు, తుపాకితో గురిచూసి కాల్చలేనప్పుడు, ఆ వైపు చక చక ఓ పది బాంబులేస్తే వాడు లేదా వాళ్ళు చచ్చూరుకొంటారు.లేదా బతికితే ఈ జీవితం కన్నా చావే నయమనిపించేలా అవిటి వాడౌతాడు.
చిదంబరం గారూ చదువుతున్నారా?

2 comments:

karthik said...

kadapa ante andariki comedy mari..
why dont we apply patent for "riots in hyd old city", "gundaism in vijayawada"?
try to read this:
http://nenu-naa-svagatam.blogspot.com/2007/10/blog-post.html

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Karthik, take it easy man.I belong to Rayalaseema.This is posted not to hurt anybody.