మనిషి చనిపోయిన సంవత్సరం తరువాత జగన్ వెళ్ళి ఓదార్చడం ఏమిటో, వాళ్ళు ఇతని చేత ఓదార్పించుకోవడం ఏమిటో ఇంత ఆలోచించినా నాకర్ధం కాలేదు. కాస్త ఆలోచిస్తే అసలు ఆ యాత్రకి ఓదార్పు యాత్ర అన్న పేరే తప్పు అనిపించింది.
జగన్ చేస్తున్న యాత్రకి సరిపోయే పేరు కోసం ఆలోచిస్తే నాకు కొన్ని పేర్లు తోచాయి.
1. అధికార సాధన యాత్ర :అధికారం సాధించడమే లక్ష్యంగా సగుతున్న ఈ యాత్రకి ఇది మంచి పేరు అని నా ఉద్ధేశ్యం.
2. ముఖ్య మంత్రి పీఠాధిరోహణా యాత్ర :ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమే ధ్యేయంగా సాగుతున్న ఈ యాత్రకి ఇదే సరిపోయే పేరేమో!
౩. సంపద పరి రక్షణా యాత్ర : తండ్రి అధికారంలో ఉండగా కూడబెట్టిన సంపద కాపాడుకోవడానికి సగుతున్న యాత్రకి ఇంతకన్నా మంచి పేరుంటుందా!
4. అనుచర గణ సంరక్షణా యాత్ర : తండ్రి కూడబెట్టిన అనుచర గణాన్ని కాపాడుకొని తన వర్గాన్ని సుస్థిరం చేసుకోవడమే ఈ యాత్ర లక్ష్యం కదా!
ఇంతోటి దానికి ఓదార్పు అని పేరు పెట్టడం, ఆత్మ వంచన చేసుకోవడం ఎందుకు చెప్పు జగన్ భయ్యా?
అయినా మన్లో మన మాట, నిన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చి కోటాను కోట్లు కట్టబెట్టిన నాన్న చనిపోతే వెనువెంటనే ఆ విషయం మరిచిపొయ్యి రాజకీయలలో నువ్వే మునిగిపోలేదా? మరి నువ్వు ఓదార్చడానికి పొయ్యే వాళ్ళందరూ దిగువ మధ్య తరగతి, పేద వాళ్ళు కదా. సంవత్సరం దాకా ఇంట్లో చనిపోయిన వాడిగురించి ఆలోచిస్తూ ఎప్పుడొ నువ్వొచ్చి ఓదార్చేవరకూ అదే బాధలో ఉంటే వాళ్ళకి కుటుంబం నడవదు. ఏదో నువ్వొచ్చి అంతో ఇంతో డబ్బిస్తావని నీకోసం వాళ్ళు ఎదురు చూస్తారు కానీ, నువ్వొచ్చి తుడవడానికి వాళ్ళ కళ్ళళ్ళో ఇప్పుడు కణ్ణీళ్ళేమీ మిగి ఉండవు. అలాంటిది నీ యాత్రకి ఓదార్పు యాత్ర అన్న పేరు అవసరమా?
11 comments:
adhikaara saadana vodaarpu yaatra
ఓదార్పు యాత్ర కాదండీ ఇది
ఆరాటపు యాత్ర
రాజీవ్ ఓదార్పు శ్రీ అయితే సమంజసంగా ఉంటుంది
jagan chastunadi nijamaina odarpu yatra raa.meru evirina mee vurlo chanipotay(relatives)meeru velli odarchara chappandi.antay kani eppudu okarini vimarshinchadam kadu raa
Odarpu oka butakam. Intlo manishi chanipote illekki arvadam.. daaniki manamantaa gorrella ventapadadam viddooramga undi. Deshaaniki Swatantram kosam..,Ikyata kosam.., mana kshemam kosam.. jeevitaanni tyagam chesina vallendaro.. YSR kante munde chanipoyaru. Padavulakosam vemparlade vallakosam manam inta scene create cheyyadam ANAVASARAM.
@seenu .. raajeev oodaarpu sree .. nice thought :-)
రమేష్ బాబూ, ఎవరైనా చనిపొతే పోయి ఓదార్చేవాడు ఒక వారానికో, నెలకో పోతాడు. అంతే కానీ చనిపోయిన సంవత్సరానికీ వందలమందిని వెంటేసుకొని, టీవీ కెమెరాలతో, విలేఖరుల గుంపులతో వెళ్ళి ఓదార్చడు.
శీనూ, సోనియా ఓదార్పుశ్రీ అని అంటే సోనియమ్మ కొంచెం కూల్ అవుతుందేమో కదా?
Friend, in my blog kichakicha.blogspot.com
I have, by mistake, deleted an item for which you placed a comment. I re-posted the item but could not replace your comment along with it, though it is shown in the list of comments on my home page. Felt like telling you that I am sorry for it. u can delete this comment, here, after reading.
seva yatras
యాత్ర గీత్ర అని పేరు పెట్టుకోకుండా YS చనిపోయిన మూడు లేదా ఆరు నెలల్లో అందరినీ చకచకా కలిస్తే హుందాగా ఉండేది. పదేసి రోజులు ఒక్కో జిల్లాకీ కేటాయించుకుంటూ ఎన్నాల్లు తిరుగుతాడు అచ్చు వేసిన ఆబోతులా? నీ జిమ్మడ, ఏమయ్యా జగన్? దేశానికి నీవల్ల ఏమి ఉపయోగం?
Post a Comment