నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, August 26, 2010

ఈ కామెడీ చావులు ఇక ఆగవా?

రాజ శేఖర్ రెడ్డి చనిపోయాక ఆ వార్త విని తట్టుకోలేక ఎవడో ఎక్కడో చనిపోయాడని వార్తల్లో చెబితే అయ్యో పాపం అనిపించింది. అయితే ఆ చావులు అక్కడితో ఆగక చిన్న పిల్ల కాలువ ప్రవాహంలా మారినట్టు రోజుకి అయిదారు మంది, పది మంది చస్తున్నారని సాక్షి పత్రికలో ఊదర గొట్టేస్తుంటే అనుమానం వచ్చింది. ఆ అనుమానం నిజం చేస్తూ ఆ తరువాత ఒక ఆన్ లైన్ పత్రిక ఆ చావుల బండారం బయట పెట్టింది.
సరే ఈ కామెడీ చావులు ఇంతటితో సరి అనుకొంటే ఈలోగా ఓదార్పు యాత్ర వచ్చింది. మహా నేత కోసం వందల్లో చస్తే యువ నేత కోసం కనీసం పదుల్లో అయినా చావక పోతే ఏం బావుంటుంది. అందుకే ఓదార్పు యాత్ర ఉంటుందో లేదో అన్న సందేహంతో అక్కడక్కడా చావులు సంభవించాయి. సరే ఓదార్పు యాత్ర మొదలైంది కదా అనుకోంటే ఆ యాత్ర మీద కాంగ్రెసోళ్ళు, అధిష్టానం మల్ల గుల్లాలు పడుతుంటే ఈ యాత్ర పైన వచ్చిన వివాదాలు చూసి తట్టుకోలేక ఎవడొ చచ్చాడని ఈ రోజు, ఆగష్టు 26, సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది.
ఇక రేపటినుంచి ఓదార్పు యాత్ర జరగ బోయే జిల్లాలలో గానీ ఇంతవరకు ఓదార్పుజరగని జిల్లాలలో గానీ ఎవరూ వాళ్ళంతట వాళ్ళు చావకూడదు. ఓదార్పు యాత్ర జరగదేమో అన్న మన స్థాపంతోనే చావాలి. సరే, ఒదార్పు యాత్ర పూర్తయ్యాకైనా ఎవరి చావులు వాళ్ళు చావొచ్చా అంటే ఇప్పుడే చెప్పలేం. ప్రజలు చావడానికి అప్పుడు ఇంకా కొత్త కారణాలు రావొచ్చు. ఉదాహరణకి జగన్ ఇంకా ముఖ్య మంత్రిని చేయలేదు ఆన్న కారణంతో మనస్థాపం చెంది చావొచ్చు, జగన్ ని వాళ్ళూ, వీళ్ళూ విమర్శించారని చావొచ్చు. ఇలా చావడానికి జనానికి రక రకాల కారణాలు ఉండొచ్చు.
ఇక్కడ ఎవరికైనా ఒక అనుమానం రావొచ్చు. ఓదార్పు యాత్ర కోసం చచ్చిన చావులక్కూడా ఓదార్పు ఉంటుందా? అసలు ఓదార్పుకే ఇంత గొడవైంది కదా ఈ కొసరు ఓదార్పులకి అంత తేలిగ్గా అధిష్టానం అనుమతి లభిస్తుందా? అప్పుడు మళ్ళీ ఏదైనా గడబిడ జరిగితే దాన్ని తట్టుకోలేక మరికొంత మంది చావరా, ఆ చచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ ఒదార్పులూ ఇలా జగన్ బతుకంతా ఓదార్పుల తోనే సరా?

గమనిక: చావులో ఎలాంటి కామెడీ లేదు. చచ్చిన తరువాత ఆ చావుని వాడుకోవడంలోనే ఉంది కామెడీ అంతా! చచ్చిన వాళ్ళకి సానుభూతితో ఈ పోస్టు అంకితం.

8 comments:

Anonymous said...

ఏమో అదంతా నాకు తెలవదు బాబు, నేను చచ్చినాను అంతే.

Anonymous said...

ఎందుకురా పిచ్చనాయల. నువ్వు చస్తే నీ పాయ్‌ ఖాన లోని బొద్దికకూడా చావదుగా. చెప్పునాకొడకా

Anonymous said...

నువ్ బొద్దింకను కూడా మీ అయ్య సచ్చిన అకౌంట్లో వేసుకుని ఓదార్చే తట్టుండావే, నీ జిమ్మడ

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

రెండవ ఎనోనిమస్ గారూ మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఈ కామెడీ షో ఏక్తా కపూర్ టెలీ సీరియల్స్ లా కొనసాగుతూ ఉంటుంది. కీపిటప్. మీరు చస్తే మీ పాయిఖానాలో ఎన్ని బొద్దింకలు చస్తాయో చచ్చే ముందే లెక్క వేసుకోండి. ఎందుకైనా మంచిది.

Sri said...

Recently, TDP guys extended this comedy further by claiming deaths for Babhli project arrests also. Where are these leaders taking this country to?

gajula said...

paapam jaganku chachhe chaavochhindi e chaavulatho,vodaarpulatho.

Anonymous said...

మనుషులు చచ్చాక వారి ఆత్మలను కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఈ నాయకులు, వీల్ల నోట్లో మన్నుబడ, వెల్లింట్లో పీనుగెల్ల!

Anonymous said...

మనుషులు చచ్చాక వారి ఆత్మలను కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఈ నాయకులు, వీల్ల నోట్లో మన్నుబడ, వెల్లింట్లో పీనుగెల్ల!