సెప్టెంబరు నెలలో తెలుగు సినిమా ప్రేక్షకులకి పండగే పండగ(theoritically,at least). రజనీ కాంత్, శంకర్ ల అతి పెద్ద బడ్జెట్ సినిమా రోబో, మూడు సంవత్సరాలుగాషూటింగ్ జరుపుకొంటూ ఉన్న మహేష్ సినిమా ఖలేజా, ఇదుగో వస్తుంది, అదుగో వస్తుంది అంటూ ఎప్పటికప్పుడు వుడుదల వాయిదా పడుతూ వస్తున్న పవణ్ కల్యాణ్ కొమరం పులి ఈ నెలలో రాబోతున్న మూడు ముఖ్యమైన సినిమాలు.
మొదటి రెండు సినిమాల మాటేమో కానీ కొమరం పులి మాత్రం ఎత్తి పోనున్నదని నా అంచనా. ముఖ్యంగా మొదట్లో రిలీజ్ డేట్ ప్రకటించి రవి తేజ డాన్ శీను తో పోటీ పడలేక వాయిదా వేసుకోవడం ఆ సినిమాపైన వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్లనే అని నా అంచనా. తరువాత ఈ సినిమా పంపిణీ హక్కులు తీసుకున్న అల్లు అరవింద్ మొదటి వారం టికెట్ ఖరీదు 75 రూపాయలు చేయించుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్డర్ పాస్ చేయించడానికి ప్రయత్నిస్తుండడం కూడా సినిమా ఎక్కువ రోజులు ఆడే అవకాశం లేకపోవడం చేతనే అని నా అభిప్రాయం. సినిమా చెత్త అని పది మందికీ తెలిసే లోపలే వీలయినంత దోచేసుకుందాం అన్న ఆలోచన అరవింద్ ది.చిరంజీవి క్యాంప్ అడిగితే పెద్దాయన రోశయ్య కాదనగలడా?
అన్నిటికన్నా ఎక్కువగా ఈ సినిమా లేచిపోతుంది అన్న అభిప్రాయం నాకు కలిగించింది సినిమా ట్రైలర్. All style, no substance అన్నట్లు ఉంది ఆ ట్రయిలర్. పవన్ కల్యాణ్ హెలికాప్టర్లనుండి ఊగులాడుతూ తుపాకితో కాలుస్తూ ఉంటాడు, రెండు చేతుల్తో రెండు తుపాకులు పట్టుకొని పేలుస్తూ ఉంటాడు. ఇలా ట్రయిలర్ ఆద్యంతం స్టయిలిష్ గా ఉంది. సినిమా అంతా స్టయిలే ఉంటుంది, విషయం ఉండదు అని నా అంచనా.
బ్లాగు మిత్రులు ఈ పోస్టు చదివి మనసులో ఉంచుకోండి. కొమరం పులి విడుదల తరువాత మళ్ళీ ఈ పోస్టు పెడతాను. అప్పుడు చూద్దాం. నా ప్రెడిక్షన్ నిజమో కాదో.
13 comments:
Same feeling.
i am with you.
నీ ప్రెడిక్షన్ చాలా వరకు కరక్టే కావచ్చు ...కొమరం పులి ఎత్తిపోవడానికి సిద్ధంగా ఉంది .ఎందుకంటే ఎ.ఆర్.రెహమాన్ డైరెక్టుగా తెలుగులో సంగీతం ఇచ్చిన ఏ సినిమా కూడా ఆడలేదు. ఈ సినిమా కూడా అందుకు రెడీ. ఉదాహరణకు రెహమాన్ తెలుగులో పనిచేసిన కొన్ని సినిమాలు చూడ్డాం
నిప్పురవ్వ( బేక్ గ్రౌండ్ )
సూపర్ పోలీస్ (వెంకటేష్)
గ్యాంగ్ మాస్టర్ (రాజశేఖర్ నటించాడు)
నాని (మహేష్ బాబు)
పల్నాటి పౌరుషం (కృష్ణం రాజు)
ఏం మాయా చేసావే ( నాగ చైతన్య)
పై సినిమాలలో హిట్లు ఎన్నో ప్రేక్షకులకు తెలుసు
రవితేజ సినిమాతో పోటీ పడలేక రిలీజ్ వాయిదా??? నిజంగా రవితేజకు గానీ ఆ సినిమాకు గానీ అంత రేంజ్ ఉందంటారా? trailer మీకు నచ్చలేదేమో ? అయినా trailer బాగున్న సినిమాలు ఎన్ని ఫ్లాప్ అవ్వలేదు?
@ శీను
రెహమాన్ ఇచ్చేది మ్యూజిక్ మాత్రమే సినిమా ఫలితం డైరెక్టర్, కథ ,,,, ఇలాంటి వల్ల ఉంటుంది.......
Mr. Idoit, you are decider to decide the result of Puli movie.
i am agree with Premika.
Premika, the fate of a film may not depend entirely on its music.But it plays a part. More than that,what Seenu points out is more to do with sentiment than any thing.Mr.Anonymous on 6th comment. If you can't compose a decent sentence in English, you can do it in Telugu.Use Lekhini or Baraha. BTW, I am not a decider. This is my prediction. Let us wait and see.
intaki tamaru baalayya baabu gaari maanasa abhimaani gaaraa
No Ano.Entirely opposite to your opinion.It has been years since I last saw a Balakrishna starrer in theatres. The last one was almost 12 years back.
A day is very near to prove that you are wrong.
Don seenu is still running good with out any content in the movie, I saw the movie. Nothing much spcl in the movie apart from regular raviteja comedy.
Postponing the movie because of Don Seenu... Its really funny.
Songs in this movies are relatively good where compared to recent movies.
Good or hyper Trailer does not mean the film with no content.
Srinivas,I wish you are right.It is a big budget movie. Telugu cinema industry can"t afford such a big flop.
Your guess is hundred percent right, brother. Its the worst movie I've ever seen in the last five years
Ramu
apmediakaburlu.blogspot.com
Post a Comment