నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, September 2, 2010

ధర్మపురి రాక్షసులకు ఈ శిక్షే సరయినది

2000 సంవత్సరంలో జయలలితని ఒక కేసులో దోషిగా నిర్ధారించి కోర్టు శిక్ష విదించినందుకు నిరసనగా AIADMK చెంచాలు తమిళనాడులో విధ్వంసం సృష్టించారు. అందులో భాగంగా ధర్మపురి అనే ఊరిలో ఒక అగ్రికల్చరల్ కాలేజీకి చెందిన ఒక బస్సుని దహనం చేసి అందులో ఉన్న కోకిలావని,గాయత్రి,హేమలత అనె ముగ్గురు విధ్యార్ధినులు సజీవంగా అగ్నికి ఆహుతి అవడానికి కారణమ్య్యారు. అ కేసులో నిందితులలో ముగ్గురికి చెన్నై హైకోర్టు విధించిన మరణ శిక్షని సుప్రీం కోర్టు నిర్ధారించింది.
తమ నాయకుడో,నాయకురాలో కోర్టులో శిక్షించబడ్డప్పుడో, పదవి కోల్పోయినప్పుడో, అరెస్టయినప్పుడో వాళ్ళ చెంచాగాళ్ళు, అనుచరులమని చెప్పుకొనే గూండాలు, రౌడీలు ఊరిమీద పడి కనిపించిన వాహనాలను, షాపులనూ కాల్చేయడం, లూటీ చేయడం పరిపాటి అయిపోయింది. అలాంటి వారికి ఈ శిక్ష చెంపపెట్టు కావాలి.
ఉరిశిక్ష విధించి కసబ్, ఆఫ్జల్ గురుల్లా జైల్లో పెట్టి ముప్పొదులా తిండి పెట్టి దున్నపోతుల్లా మేపకుండా ఆ శిక్షని త్వరగా అమలు పరిచినప్పుడే ఆ అమ్మాయిల కుటుంబాలకు కొంతైనా మనశ్శాంతి లభిస్తుంది.

8 comments:

Indian Minerva said...

మీరు ఎంత ఎర్రింకులో (ఎర్ర+ఇంకులో) రాసినా అది జరగన్నయ్యా..

Sujata M said...

@ Indian Minerva

Law will take its own time.
But this act (of the court) is setting a good example ! isnt it ?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Indian Minerva, the pun is good.

Anonymous said...

చిలకలూరిపేట లో బస్సు తగలడితే ఏమైంది ? జనం చస్త ఏమైంది ? రాత్రికి రాత్రే నిందితులో విపరీంగా పరివర్తన రావటం ,వాల్లు మతం పుచ్చుకోవటం ,ఆమహిమవల్ల వాల్లకు క్షమాభిక్ష వచ్చెయ్యడం జరిగింది .ఇలానే వీల్లకు పరివర్తన వస్తుంది .

కలకత్తా లో వాడెవడొ చిన్నపిల్లను ంపినవానికి మాత్రం ఉరిషిక్ష అమలుచేశారు .అంతవరకు నయం . ఆవెధవక్కూడా పరవర్తన వచ్చి మతం మారితే ఇప్పటికి వాడుూడా రొమ్మువిరచుకుని తిరుగతుండేవాడు

Anonymous said...

చిలకలూరిపేట లో బస్సు దహనం కేసులో నిందితులు దళితులు. దళితులకి శిక్ష వేయాలని మీరు ఆశించడం మీ అభిజాత్యం.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

రిజర్వేషన్ కోటా కింద దళితులకి శిక్షలు మాఫీ చేయాలా?

Anonymous said...

>>రిజర్వేషన్ కోటా కింద దళితులకి శిక్షలు మాఫీ చేయాలా?
అదేమీ ప్రశ్న అండీ ?
చెయ్యాలి! మమ్ములను వేల సంవత్సరాలుగా వందల తరాలుగా అప్రకటిత ఫలాలను అప్పనం గా దండుకున్న అగ్ర వర్ణాలు నేరాలలో కూడా ముందు ఉంటె మేము ఎప్పుడు అభివృద్ధి చెందేంది ?
మాకు మినహాయింపులు ఉండాలి
మీరు ఎర్ర ఇంకు లో వ్రాసిన నిందితులను వారు నేరం చేసిన ప్రదేశం లోనే బహిరంగ ఉరి శిక్ష వెయ్యాలి

Anonymous said...
This comment has been removed by a blog administrator.