నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, September 4, 2010

మ్యూనిక్ మారణకాండకి ముప్పై ఎనిమిదేళ్ళు

సెప్టెంబరు 5, 1972. 4:30 AM
బెర్లిన్ ఒలింపిక్ గ్రామం.
ఎనిమిది మంది ఇజ్రాయెల్ యూనిఫాం ధరించిన వ్యక్తులు ఫెన్సింగ్ దూకి లోపలికి ప్రవేశిస్తు ఉంటే చూసిన భద్రతా సిబ్బంది పెద్దగా అనుమానించలేదు. ఒలింపిక్ గ్రామం లోనుంచి లోపలికి బయటకు ఆటగాళ్ళు కంచె దూకి వెళ్ళడం వాళ్ళకు మామూలే. అయితే వాళ్ళు ఇజ్రాయెల్ ఆటగాళ్ళు కాదు. బ్లాక్ సెప్టెంబరు అనే సంస్థకు చెందిన తీవ్రవాదులు. వాళ్ల చేతుల్లోని బ్య్ అగుల్లో ఉన్నవి గ్రెనేడ్లు, తుపాకులూ. వాళ్ళు నేరుగా ఇజ్రాయెల్ జట్టు ఉన్న అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్ళి తమ దగ్గరున్న మారుతాళాలతో తలుపు తెరవడానికి ప్రయత్నించారు. ఆ చప్పుడుకి లోపల నిద్రిస్తున్న కుస్తిపోటీల రెఫరీ యోసెఫ్ గట్ ఫ్రెండ్ మేల్కొని చూస్తే తలుపు తెరుచుకోవడం కనిపించింది. ఒక్క సారిగా పెద్ద కేక పెట్టి తన సహచరులని అలర్ట్ చేసి తన 135 కిలోల భారి కాయాన్ని తలుపుకి అడ్దుగా వేశాడు. ఇలోగా కుస్తీపోటీల కోచ్ మోషే వెయిన్ బెర్గ్ మేల్కొని లోపలికి వచ్చిన ఆ టెర్రరిస్టులతో కలబడ్డాడు. అయితే వాళ్ళతని చెంప మీద కాల్చి, తుపాకి తలకి గురిపెట్టి మిగతా ఆటగాళ్ళు ఎక్కడున్నారో చూపించమని అడిగారు. అక్కడున్నది ఇజ్రాయెలీలు కాదని అబద్ధమాడి, పక్కన ఉన్న అపార్ట్ మెంట్ దగ్గరకి తీసుకు వెళ్ళాడు. అందులో అందరూ రెజ్లర్లూ, వెయిట్ లిఫ్టర్లూ ఉన్నారు. వాళ్ళు బాగా భారీగా ఉండే మనుషులు కాబట్టి అందరూ కలిసి వచ్చిన వాళ్ళతో తలపడవచ్చని అతడి ప్లాన్. అయితే ఆ తీవ్రవాదులు వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూండా అందరినీ బందీలుగా పట్టుకున్నారు. కానీ వెయిన్ బెర్గ్ మరోసారి వాళ్ళతో తలపడి ఒక రెజ్లర్ పారిపోవడానికి అవకాశమిచ్చి తను హతమయ్యాడు. యోసెఫ్ రమానో అనే వెయిట్ లిఫ్టర్ సైన్యంలో పని చేసిన వాడు కావడంతో ధైర్యంగా వాళ్ళనెదుర్కొని ఒకడిని గాయపరచి తనూ హతమయ్యాడు. ఈ గొడవకు ఒక ఆటగాడు అలర్టయ్యి కిందకు దూకి పరారయ్యాడు. ఇంకో అయిదు మంది ఆటగాళ్ళు, ఒక టీం డాక్టరు ఒక మూల నక్కి తరువాత తప్పించుకొన్నారు.
మొత్తానికి తొమ్మిది మందిని బందీలుగా పట్టుకొని వాళ్ళు తమని తాము పాలస్తీనా వారిగా తెలుపుకొని తమ డిమాండ్లని తెలియజేశారు. ఇజ్రాయెల్ జైళ్ళలో మగ్గుతున్న 234 మందిని విడుదల చేసి క్షేమంగా ఈజిప్టుకు తరలించాలి అన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. కానీ దానికి తలొగ్గడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. బందీల విడుదలని తమకి వదిలేయమని, అందుకు తమ కమాండోలని బెర్లిన్ లోకి అనుమతించాలని అడిగారు ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మెయిర్. దానికి జర్మనీ అంగీకరించలేదు. ఈ తలనొప్పిని వదిలించుకోవాలని జర్మనీ అధికారులు తీవ్రవాదులకి ఎంత కావాలంటే అంత ధనం ఇస్తాము, బందీలని వదిలేయండని ఒక ఆఫర్ పెట్టారు. దానికి వాళ్ళు ససేమిరా అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ దేశ అంతర్భాగంలో సైన్యాన్ని అనుమతించకూడదని వాళ్ళ ప్రభుత్వం ఒక నియమం పెట్టుకోవడం వల్ల ఈ పరిస్థితి మొత్తాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత జర్మనీ పోలీసులపైనే పడీంది.

చాలాసేపు మంతనాలయ్యాక అధికారులు చాసిన ఒక ప్రపోజల్ కి టెర్రరిస్టులు ఒప్పుకొన్నారు. బందీలని,టెర్రరిస్టులనీ దగ్గర్లోని ఒక నాటో ఎయిర్ బేస్ కి తరలించి అక్కడినుంచి ఈజిప్టుకి పంపాలనేది ఆ ప్రపోజల్. అయితే టెర్రరిస్టులకి ఏమాత్రం అనుమానం రాకుండా హెలికాప్టర్ లోనుండి విమానంలోకి తరలించే సమయంలో టెర్రరిస్టులని కాల్చి చంపాలనేది ఆ ప్లాన్. అయితే అందుకు వాళ్ళు ఎంచుకున్న స్నైపర్లకి అందుకు కావలసిన అనుభవం లేదు. అంతే కాక వాళ్ళకి అందుకోసం అందించిన తుపాకులు కూడా లాంగ్ రేంజ్ నుంచి కాల్చడానికి అనువైనవి కావు. పైగా అధికారులు టెర్రరిస్టుల సంఖ్య కూడా తప్పుగా అంచనా వేసి అందుకు తగ్గట్లుగా తమ ప్లాన్ లన్ని సిద్ధం చేసుకొన్నారు.

మొత్తానికి అనుభవం లేకపోవడం వల్లనేమీ, సరయిన ఆయుధాలు లేకపోవడం వల్లనేమీ ఆ ప్లాన్ ఘోరంగా విఫలమయ్యింది. తమని జర్మన్ అధికారులు మోసం చేశారని తెలుసుకోగానే టెర్రరిస్టులు రెచ్చిపోయారు. పొలీసులు, టెర్రరిస్టులు, వాళ్ళని చంపాల్సిన షూటర్లు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అయిదు మంది తీవ్రవాదులు, ఏడుగురు బందీలు, ఒక జర్మన్ పోలీసాఫీసరు చనిపోయారు. ఒక హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు బందీలను గ్రెనేడ్ విసిరి ఒక తీవ్రవాది పేల్చేశాడు. జర్మన్ పోలీసులు ముగ్గురు తీవ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. అయితే ఒక నెల తరువాత పాలస్తీనుయులు ఒక జర్మన్ విమానాన్ని హైజాక్ చేసి విడిపించుకొన్నారు.
ఇజ్రాయెల్ ఆటగాళ్ళ పట్ల సంతాపంగా ఒక రోజు విరామం తరువాత ఒలింపిక్స్ యధావిధిగా కొనసాగాయి. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మెయిర్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదల్లేదు. తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా, మిత్ర దేశాల గూఢచారి సంస్థల ద్వారా ఈ మారణ కాండకి ప్లాన్ చేసిన వాళ్ళ జాబితా సంపదించి తమ గూఢచారి సంస్థ మొస్సాద్ ని వాళ్ళని అంతం చేయమని పురమాయించింది. ఆ తరువాత రెండేళ్ళలో వాళ్ళు ఆ జాబితాలో ఉన్న వాళ్ళని ఆఫ్రికా, ఆసియా, యూరోప్ దేశాలలో వెతికి పట్టుకొని మరీ అంతం చేశారు.
ఇదంతా చదివితే మన వాళ్ళు కూడా ఖాందహార్ ఎపిసోడ్ ని అంత తెలిగ్గా వదిలి పెట్టి ఉండకూడదు అనిపిస్తోంది. సరే, మన దేశ ప్రయాణీకులని విడిపించుకోవడానికి హైజాకర్లు అడిగిన టెర్రరిస్టులని అప్పటి విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ స్వయంగా విమానంలో ఖాందహార్ తీసుకుపోయినా ఆ తరువాత వాళ్ళని ఆ హైజాక్ చేసిన వాళ్ళని వేటాడి ఉంటే కొద్దో గొప్పో బవుండేదేమోననిపిస్తోంది.

5 comments:

శ్రీనివాస్ said...

మ్యూనిక్ ఘటన కి సంభందించి ఒక సినిమా ఉందనుకుంటా

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Munich by Spielberg and Sword of Gideon are two such movies.

gajula said...

mari paalastina prajala poratamu,kastala gurinchi kudaa raaste bhaaguntundi.evadu vutthi punyaanike praanaalu theskodu,mari paalasthinavaallu antha saahasam enduku chesaaru?koncham balaheenulameeda maanavathadrukpadamtho aalochinchandi.

Anonymous said...

There are no Religion base votes there.
The Israelies and Palesteniens are ready to die for their countries any time.
Their politiciens are not Lallus, Khodas or Jagans.

Praveen Mandangi said...

ఇజ్రాయెల్ అమెరికాకి పక్షాన ఉన్న దేశం. పాలెస్తీనా అమెరికాని వ్యతిరేకించే దేశం. అదే ప్రధాన తేడా.