నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, September 5, 2010

మారాణాయుధాలతో కళా ఖండాలు సృష్టిస్తున్న జాహిమ్ జెహాద్

ఇరాక్ లో ఎక్కడ చూసిన తుపాకులు, పేలని గ్రనేడ్లు, మిస్సైల్ షెల్సూ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని ఏం చేయాలో జాహిమ్ జెహాద్ కి ఒక ఆలోచన వచ్చింది. సాధారణంగా అందరూ శిల్పాలు సృష్టించాలంటే మట్టినో, రాతినో,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నో ఎంచుకొంటారు. జెహాద్ మాత్రం తన దేశంలో దండిగా దొరికే మారణాయుధాలని, వాడినవి, వాడనివి ఎంచుకొన్నాడు.
AK-47 తూటాలు, కత్తులూ, పేలిన గ్రెనేడ్లూ, మిస్సైల్ షెల్సూ సేకరించి వాటితో బొమ్మలు చేస్తాడు. తనకి కావలసిన ముడి సరుకుల కోసం చిత్తు సామాను అమ్మే దుకాణాలలో, అమెరికన్లు దాడులు జరిపిన స్థలాలలో వెతికి పట్టుకొంటాడు జెహాద్.

విధ్వంసం సృష్టించే ఆయుధాలతో కళాఖండాలు తయారు చేస్తాడు జాహిమ్ జెహాద్.