నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, April 24, 2010

పెన్ను తీసుకొంటే లంచం-కోట్లు దండుకొంటే సమర్ధనీయం

ఎప్పుడు ఊరెళ్ళినా మా కజిన్ ని కలుస్తాను.వాడు కొద్దో గొప్పో పేరు గడించిన బొక్కల డాక్టరు కాబట్టి వాడింట్లో ఉన్న చాలా వస్తువులపైన ఏదో ఒక మందుల కంపెనీ పేరు ఉంటుంది,చివరికి వాడి కాళ్ళకున్న రీబోక్ షూస్ తో సహా.నాకోసమని వాడు రకరకాల పెన్నులు తీసిపెడతాడు.పెన్నుల మీద నాకున్న మోజు వాడికి తెలుసు.

ఈ మధ్యన మందుల కంపెనీలనుండి డబ్బులు గిఫ్టులూ స్వీకరించకూడదని ఎం సీ ఐ ఒక చట్టం చేసింది.ఇది ఆ సంస్థ అధ్యక్షుడు కేతన్ దేశాయ్ గారి ఆలోచన.నాకూ సబబే అనిపించింది.కొందరు డాక్టరు ఈ కంపెనీలనుండి చాలా విలువైన గిఫ్టులు తీసుకొంటారు ప్లాస్మా టీవీలు,విదేశీ యానాలు,ఫ్రిజ్జులూ గట్రా.

నేను మావాడిని అడిగిన ప్రశ్న ఏమిటంటే ఒక కంపెనీ నుండి అంతంత విలువైన కానుకలు అందుకొంటే మీరు ఆ కంపెనీ మందులే మీ దగ్గరకొచ్చే రోగులకు రాస్తారు కదా అని.ఒక విధంగా ఇది నిజమని ఒపుకొన్నాడు మావాడు.కానీ ఎదో ఒక కంపెనీ మందు వాడాలి కదా ఆ వాడేదేదో మా కంపెనీవే వాడమని ఈ గిఫ్టులిస్తారు అట.

మొత్తానికి కేతన్ దేశాయ్ గారి ఆర్డరు నాకు నచ్చింది.ఒక కంపెని నుండి డబ్బో కానుకో తీసుకొంటే అవసరమున్నా లేకపోయినా ఆ కంపెనీ మందులు పేషంట్ల నెత్తిన రుద్దుతారని నా అభిప్రాయం.
కాని ఈ రోజు పేపర్లో అదే కేతన్ దేశాయ్ మహానుభావుడు మౌళిక వసతులు ఏమాత్రం లెని ఒక ప్రైవేటు వైద్య కళాశాలకి విధార్ధులను చేర్చుకోమని అనుమతి ఇవ్వడానికి రెండు కోట్లు స్వీకరించారని చదివి షాకయ్యాను.
ఔరా గురివిందా నీతులు పక్క వాళ్ళకేనా?మనకు వర్తించవా?ఏ సదుపాయాలూ లేని కాలేజీలో మెడిసిన్ చదివి రేపు వాళ్ళు బయటికొచ్చి వైద్యం చేస్తే ఏమి జరుగుతుందో ఒక డాక్టరుగా నీకు తెలియదా? ఎవరెలా పోతే నాకేమిటి నా డబ్బు నాకొస్తె చాలు అనుకొన్నావా?

4 comments:

Anonymous said...

ఇదిమొదటి సారి గాదండి. ఇంతకు ముందు సానా సార్లు ఈ సారు ఇలాంటాటిల్లో ఇరుక్కున్నారు.

amma odi said...

Good one and 100% true.

Anonymous said...

పెన్నులు తీసుకోవద్దు అంటే కోట్లు మింగమని ఎలా ఐతే కాదో , కోట్లు మింగాడంటే ఐతే పెన్నులు మిగితే తప్పేమిటి అని అడగడకూడా కాదు. స్పూనుడు తినా , గరిటేడు తిన్నా అశుద్ధం తిన్నవాడిని అశుద్ధభక్సహకుడనే ( మహా అంటే ఓ ' మహా ' ముందు వాడుతారేమో) అంటారు. :)
మీరు సంబర పడిపోయి , మావాడు చేసింది మాఫీ ఐపోయిందని , ఇదై పోమాకండి. :P

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎనోనిమస్సు బాబూ ఇది దెయ్యాలు వెదాలు వల్లించినట్టు ఉంది అని చెప్పడం ఈ పోస్టు వెనక ఉద్ధేశ్యం.అంతే కానీ మావాడు పెన్నులు తీసుకొంటాడా లేదా అని కాదు.వాడు పెన్నులు తీసుకొన్నా తీసుకోక్స పోయినా నాకొచ్చిన నష్టమేమీ లేదు.బై ది వే, నీలో అపరిచితుడు ఆలోచనలు తీవ్రంగా ఉన్నట్టున్నాయే.