నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, October 18, 2010

వైఎస్సార్ ని ఫూల్ ని చేయకండి

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఇంకో సంవత్సరానికి అంటే ఓదార్పు యాత్ర ఒక ముగింపుకి వస్తే, ఒకవేళ వస్తే, వస్తుందని కాదు, వైఎస్ విగ్రహం లేని వీధి ఈ రాష్ట్రంలో ఉండక పోవచ్చు.
ఈ సందర్భంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటుదారులకు ఇంగ్లీషులోని ఒక సామెత గుర్తు చేద్దామనుకొంటున్నాను. A fool is seen everywhere. ఈ సామెతని దివంగత నేత, సాక్షి ప్రకారమైతే, దివంగత మహానేత విషయంలో నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మీరు ప్రవర్తించకండి. ఆయన అత్మకు కొంచెమైనా శాంతి మిగిల్చండి.

4 comments:

Apparao said...

వై ఎస్ విగ్రహాని శులభ్ కాంప్లెక్స్ ల ప్రక్కన పెడితే లోపలి వెళ్ళే వాళ్లకి "శుభయాత్ర" చెప్పినట్లు ఉంటుంది. :-))
ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వాళ్ళ మనకి చాలా లాభాలు ఉన్నాయ్ - ల్యాండ్ మార్క్ గా ఉపయోగ పడతాడు,
కాకపొతే సిమెంటు రేట్లు పెరుగుతున్నాయ్ :-(
రాష్ట్రం లో ఇందిరా , రాజీవ్ లు పోయి ఈయన వచ్చాడు. ఇదంతా మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం , వై ఎస్ ఆత్మకు, జగన్ ఓదార్పు యాత్రలకు శాంతి చేకూరాలని మన:స్పూర్తిగా కోరుకుందాం
జోహార్ వైఎస్ఆర్
జై జై జగన్అన్నా

Anonymous said...

ఫాక్షనిస్ట్ ఇగ్రం పెట్టడానికి సులభ్ సౌచాలయనే కరెక్ట్ లొకేషన్.

Sree said...

విగ్రహారాధన ని వ్యతిరేకించే ఓ క్రైస్తవుడే ఇలా చేయటం ఆశ్చర్యంగా ఉంది కదూ!. ఇక్కడ నేను ఒక మతాన్ని విమర్శించటం లేదు. కాని ఇది నిజమైన విచిత్రం. భేషజాలకి పోకుండా పొరుగువారికి సేవ చేసే వాల్లే (ఏ మతానికి చెందినవారైనా) నిజమైన క్రీస్తు అనుచరులు.

బీమా.. ఇస్తుంది ధీమా said...

చాలా బాగా చెప్పారండీ .........
తండ్రి పేరు చెప్పుకోని తాను సీఎం కావాడానికే ఇదంతా చేస్తున్నాడు.....
జనం చాలా తెలివైన వారు జగన్ నాటకాలను ఆర్థం చేసుకోలేని స్థితిలో లేరని నేను నమ్ముతున్నాను