కడప పట్టణానికి 16 కిలో మీటర్ల దూరంలో పెన్నా నదీ తీరాన ఉన్నది పుష్పగిరి, అతి పురాతనమైన ఈ క్షేత్రం శైవులకీ వైష్ణవులకీ సమానంగా ఆరాధ్యనీయమైన పుణ్యక్షేత్రం. శైవులు దీనిని మధ్య కైలాసం అని, వైష్ణవులు నధ్య అహోబిళం అని పిలుచుకొంటారు. ఇక్కడ ఉన్న శిల్ప సంపదని తెలియచేసే విధంగా రెండవ హంపి అని కూడా ఈ క్షేత్రాన్ని వ్యవహరిస్తారు. శంకరాచార్యుల గారిచే ఏర్పాటుచేయబడ్డ అద్వైత క్షేత్రాల్లో ఇది ఒకటి. మన రాష్ట్రంలోని ఏకైక శంకరాచార్య పీఠం ఇది.
శిధిలమైపోగా మిగిలి ఉన్న ఆలయాలలో చెన్నకేశవ స్వామి ఆలయం అతి పెద్దది. ఇందులో 13 వ శతాబ్ధం నాటి శాసనాలు ఉన్నాయి. గుడి చుట్టూ, గుడి లోపలా అనేక అద్భుత శిల్ప సంపద ఉంది. రామాయణ, మహభారతాల లోంచి అనేక ఘట్టాలను ఇక్కడ శిల్పరూపంలో చూడవచ్చు.
స్థల పురాణం: పూర్వమ్ గరుత్మంతుడు తన తల్లి కోసం అమృతాన్ని తీసులెళ్తూండగా అందులోంచి ఒక చుక్క జారి ఇక్కడ ఉన్న కొలనులో పడిందట. ఒకరోజు ఒక వృద్ధ రైతు తన జీవితమ్మీద విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవాలని ఈ కొలనులో దూకగా అతడు పరిపూర్ణ యవ్వనస్థుడై పోయాడు. ఆశ్చర్యపోయిన అతడు తన భార్యనూ, ఎద్దులనూ తీసుకొచ్చి అందులో ముంచి వాళ్ళనూ యవ్వనస్థులను చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కోనేటిలో మునిగి నిత్య యవ్వనస్థులైపోయారు. కొన్నాళ్ళకి ఈ ప్రాంతం నుంచి చాలా కాలంగా ఎవరూ తన లోకానికి రాకపోవడం గమనించిన యముడు విషయం తెలుసుకొని బ్రహ్మతో మొరపెట్టుకోగా ఆయన హరి, హరులని ఆశ్రయించాడు. వారి ఆజ్నతో హనుమంతుడు ఒక పర్వతాన్ని తెచ్చి ఆ కొఅల్ను పైన వేశాడు. కానీ అది అందులో మునగక పుష్పంలాగా పైకి తేలింది. అలా పుష్పగిరి అన్న పేరు వచ్చింది. ఆ పర్వతాన్ని ముంచడానికి ఒక వైపి శివుడు, మరో వైపు విష్ణువు తమ పాదాలతో చెరో వైపు తొక్కి పట్టారు. శివుడి పాదముద్ర శివపాదం అని విష్ణు పాదముద్ర విష్ణుపాదం అనీ ఇక్కడ కనిపిస్తాయంటారు.
ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో ఇక్కడ పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. కడప నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి ఆటోలు, బస్సులూ ఉన్నాయి. కారులో పోవడానికి మంచి రోడ్డుంది.
అయితే ఇక్కడి గుడి గోపురాలు వాటి పైన శిల్పాలు నల్లగా మకిలి పట్టి వాటి సౌందర్యాన్ని కప్పివేస్తూంది. దేవాదాయ, పురావస్తు శాఖలు కడప జిల్లాలోని మరొక దేవాలయం ఒంటిమిట్టలో చేసినట్టు కెమికల్ ట్రీట్ మెంటు చేసి ఈ శిల్ప సౌందర్యాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది.
15 comments:
chala bagunnayandi pushpagiri viseshalu.parichayam chesinanduku danyavadamulu.
abba, innallaku panikochhe post okati vesarandee. romba thanksu!!
Ilanti marinni viseshalu chebuduroo!
నా బ్లాగ్లో ఈ "పుష్పగిరి " చరిత్రతో బాటుగా ఫోటోస్ కూడ ఉంచాను చదవండి మీకు వీలుంటే....!!
http://mahavarnam.blogspot.com/2010/03/blog-post_05.html
రెండవ హంపిగా పిలవబడ్డది పుష్పగిరి కాదు మిత్రమా..!! వాస్తవంగా రెండవ హంపిగా పిలవబడ్డది..కడపజిల్లా..జమ్మలమడుగు తాలుకాలోని "గండికోట" ను. వాటి గురించి కూడ నా బ్లాగ్లో ఉన్నది చదవండి..!
http://mahavarnam.blogspot.com/2010/04/2.html
Sorry Kamal.Pushpagiri indeed is known as second Hampi. Kindly check again.
Thank you Sree. Edo mi abhimanam.
మిత్రమా ! నేను ఆ ప్రాంతంవాడినే..ఇప్పుడే నా పరిశోధకులమిత్రులకు, అక్కడి రచయతలు ఫోన్ చేసి మరీ అడిగాను...వారందరు " హంపి " అన్న విషయాన్ని ఖండించారు..ఇంకా చెప్పాలంటే " పుష్పగిరి " ని ధక్షిణ కాశీ పిలవబడిందట..! హంపీ ఒక రాజ్యానికి రాజధాని..అలా చెప్పడానికి ఎటువంటి ఆనవాలు పుష్పగిరీలో లేవు..అని చెప్పారు..వారు " రాయలసీమ వైభవం " అన్న ఒక పుస్తకం కూడా ప్రచురించారు. అందులో కూడ ఎక్కడా మీరు చెప్పిన " హంపి " ప్రస్తావన లేదు. "గండికోటను " రెండవ హంపిగా ఫ్రెంచ్ ట్రావెలర్ పేర్కొన్నారు ఆ విషయాన్ని గండి కోట వద్ద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్వారు ఒక బోర్డ్ కూడ పెట్టారు .
మంచి విషయాలు చెప్పారు ఫొటోలతో సహా
రెండవ హంపి అంటే రాజధాని అని కాదు. అంతటి శిల్ప సంపద ఉంది అని.http://www.kadapa.info/pushpagiri.html
Also: http://www.tirumalabalaji.co.in/AboutPushpagiri.aspx, www.baatasaari.com/english/city-guides/pushpagiri.aspx , therajampet.blogspot.com/2010/07/vontimitta.html, www.indianetzone.com › ... › Cuddapah District, www.voiceofbharat.org/tourism/cuddapah.aspx, www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file...htm, www.trueknowledge.com/q/cuddapah,www.telugupedia.com/wiki/index.php,
కమల్ నేను పరిశోధకుడిని కాదు. పుష్పగిరి శిల్ప వైభవాన్ని నేను చూశాను. ఈ ఫోటోలన్నీ నేను తీసినవే. రెండవ హంపి అన్న దానికి పైన పేర్కొన్న రెఫరెన్సులున్నాయి. అయినా ఇది తప్పయితే, అలాగే కానివ్వండి. గండికోట కూడా చాన్నాళ్ళ క్రితం చూశాను. నా దృష్టిలో శిల్ప వైభవం పుష్పగిరిలోనే ఉన్నతం. నేను రాసిందే సరయినది గుడ్డిగా నమ్మే మూర్ఖుడిని కాదు. Anyway, thanks for letting me know. కడప అనగానే బాంబులూ, ఫాక్షన్లూ అనుకొనే వాళ్ళ కోసం రాసిన పోస్టు ఇది.
కమల్ గారూ మీ పోస్టులో ఫోటోలు చాలా బాగా ఉన్నాయండీ. మరోసారి పుష్పగిరిని చూపించారు. Hats off.
అయ్యో..! మూర్ఖుడు అని అంతెంత పెద్ద మాటలు ఎందుకులే మిత్రమా..! మీరిచ్చిన కడప సైట్ వారికే నేను ఫోన్ చేసి విషయం కనుక్కొన్నది..ఆ సైట్ నడుపుతున్నావారు కడప రచయత తవ్వ ఓబుళరెడ్డి గారు నాకు మంచి మిత్రులు ఆయన చెప్పిన విషయమే నేనుమీకు చెప్పాను. మీరిచ్చిన సైట్స్లలో అన్ని చోట్ల ఒకే విదంగా ఉన్నది వ్యాసం.బహుశ ఒకే వ్యాసాన్ని అందరూ రాసారేమో అనిపిస్తుంది. వాకే ఇందులో ఏది నిజమో తెలుసుకోవడం అనవసరం. ఇంతటితో నేను ఈ విషయం మీద ఇక సాగదీయను.
ఫోటోస్ నచ్చినందుకు,తెలిపినందుకు చాలా థ్యాంక్స్
Post a Comment