నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, October 12, 2010

అంచనాలేమీ లేకుండా చూస్తే ఖలేజా ఓకే!

బ్లాగు మిత్రులు ఎంతమంది హెచ్చరించినా వారి మాటలు లెక్క చేయకుండా ఆదివారం ఖలేజా సినిమా చూశాను. అప్పటికే ఆ సినిమాపైన నెగటివ్ ఒపీనియన్ తోనే సినిమా చూశాను కాబట్టి నాకు ఆ సినిమా అంత చెడ్డగా ఏమీ అనిపించలేదు.
ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నడిపించాడు త్రివిక్రమ్. క్లైమాక్స్ తేలిపోయినా ఇటీవలి తెలుగు సినిమాలలో ఇది మామూలే కాబట్టి వదిలేయవచ్చు. అస్సలు తన సినిమాలలో ఎప్పుడూ ఒక పదమో లేక సగం సగం వాక్యాలు తప్ప అంతకన్నా పొడవాటి డైలాగులు చెప్పని మహేష్ ఇందులో కొంచెం టాకెటివ్ పాత్రలో వెరైటీగా అనిపిస్తాడు. మహేష్ అనుష్క ఇద్దరూ విడివిడిగా గ్లామరస్ గా అనిపించినా ఇద్దరూ కలిసి ఉన్న సీన్లలో వారి మధ్య కెమిస్ట్రీ తెరని తగలబెట్టలేకపోయింది (could not set the silver screen on fire).
ఇక కామెడీకొస్తే అధిక భాగం కామెడీ మహేషే చేశాడు. కాన్సెప్టు కొంచెం కొత్తగా ఉంది. క్లైమాక్సే పేలవంగా ఉంది. లక్ష కోట్ల ప్రాజెక్టు చేజారి పోకుండా ఒక గ్రామం మీద దాడి చేసిన డబ్బూ, అధికారం పుష్కలంగా ఉన్న ఒక విలన్ తీసుకొచ్చిన రౌడీలను హీరో ఒంటి చేత్తో మట్టి కరిపించడం రొటీన్ తెలుగు సినిమాలలో చాలా సార్లు చూశాం కాబట్టి సగటు తెలుగు ప్రేక్షకుడికి అందులో ఆశ్చర్యం కనిపించదు.
రెండు పాటలు మినహా మిగిలినవన్నీ హాలులోపలే మర్చిపోవలసినవే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. అయితే ఫస్ట్ హాఫ్ అధిక భాగం రాజస్థాన్ లో షూట్ చేయడానికి కంపెల్లింగ్ కారణం కనిపించదు. మన పక్కనున్న ఏ మహరాష్ట్రలోనో, కర్ణాటక, తమిళనాడులోనో తీసిఉన్నా పెద్దగా తేడా ఉండేది కాదు. పైపెచ్చు ప్రొడ్యూసర్ జేబుకి పడ్డ బొక్క కూడా కొంచెం తగ్గి ఉండేది.
కాబట్టి, మీరు సినిమా మీద ఎలాంటి ఎక్స్ పెక్టేషన్లు లేకుండా చూడండి. అప్పుడే మీకు నచ్చుతుంది.

11 comments:

Anonymous said...

monna vikatakavi srinuvas blog lo chadivi sinimaa choshaanu. chaalamandi cheppianta bad ga yem ledu with out expectations choosthe sinima bagubdi. comedy super.

Praveen Mandangi said...

ఇందాకే ఖలేజా సినిమా సెకండ్ షోలో చూసాను. రొటీన్ కాదు కానీ స్టోరీ చాలా మందికి అర్థం కాకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యింది. సినిమా చివరి వరకు చూస్తే గానీ స్టోరీ అర్థం కాదు. సినిమా కథ నడిపించడానికి రాజస్థాన్ ని లొకేషన్ గా ఎంచుకోవడం సరైనదే. వెనుకబడిన ప్రాంతంలోని పల్లె ప్రజలని ఒక కార్పరేట్ కంపెనీవాడు ఎలా బలి చెయ్యాలనుకున్నాడు అనే దాని మీద కథ నడిచింది. కొంత మంది టైటిల్ చూసి ఇది సాధారణ మాస్ మసాలా సినిమా అనుకోగలరు. నిజానికి ఇది అలాంటి సినిమా కాదు.

మంచు said...

కాన్సెప్టు కొంచెం కొత్తగా ఉంది అని మీరు అనుకున్నారు...
కాన్సెప్టు కొంచెం చెత్తగా ఉంది అని జనాలు అనుకుంటున్నారు ...
Just kidding :-))

Apparao said...

@ మంచు గారు
నేను చెప్పాలనుకున్నడి మీరు చెప్పారు
కాకపొతే చెత్తగా ఉంది అనుకునే జనాలలో నేను ఒకడిని :)

Praveen Mandangi said...

కథ బాగానే ఉంది కానీ చాలా మందికి అర్థం కాదు. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది. టైటిల్ చూసి కొంత మంది ఇది రొటీన్ మాస్ మసాలా సినిమా అనుకుని చూడకపోవచ్చు. ఇద్దరు వ్యక్తులు కొట్టుకునేటప్పుడు నీకు ఖలేజా (కాలేయం) ఉందా అని ఒకరినొకరు చాలెంజ్ చేసుకుంటారు. అందుకే ఖలేజా అనే టైటిల్ చూసి అది రొటీన్ సినిమా అని కొందరు అనుకుని ఉండొచ్చు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

May be it is the failure of the director that he could not present it in a better manner to the liking of masses.

Praveen Mandangi said...

డైలాగులు కూడా మొదట్లో అర్థం కాలేదు. నిన్న మధ్యాహ్నం నా ఫ్రెండ్ చెపితే రాత్రి సెకండ్ షోకి వెళ్లి చూసాను. అతను ఇలా చెప్పాడు "ఒక కార్పరేట్ కంపెనీవాడు ఇరిడియం ఖనిజం కోసం గ్రామస్తులని ఖాళీ చెయ్యించడానికి ప్లాన్ వేస్తాడు. హీరోకి, కార్పరేట్ కంపెనీవాడికి మధ్య గొడవ జరుగుతుంది" అని. ఒరిస్సా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో జరిగిన ఘటనలు గుర్తొచ్చాయి. అందుకే రాత్రి నా బిజినెస్ పని అయిపోయిన వెంటనే సెకండ్ షో సినిమాకి వెళ్లాను. కథ యొక్క కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ డైలాగులు సులభంగా అర్థం కావు. డైరెక్షన్ బాగాలేకపోవడం వల్ల కూడా ఫ్లాప్ అయ్యింది.

Apparao said...

కెమెరా కూడా సరిగ్గా లేదు

Praveen Mandangi said...

కేవలం రివ్యూలు చదివినంతమాత్రాన సినిమా అర్థం కాదు. కాన్సెప్ట్ బాగున్నా సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో సినిమా చూస్తే తెలుస్తుంది.

వేణూశ్రీకాంత్ said...

బాగా రాశారు. నిజమే అంచనాలు లేకుండా చూస్తే ఈ సినిమా నచ్చుతుంది.

geethoo said...

hello all, My 2 cents on Khaleja
http://tumbu-vk.blogspot.com/2010/10/mahesh-khaleja-my-2-cents.html