తెలుగులో శ,స,ష అని మూడురకాల శబ్ధాలు ఉన్నాయి. తెలుగు పాటలు ఇంగ్లీషులో రాసుకుని పాడేవాళ్ళకీ, ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్న వాళ్ళకీ ఈ మూడు శబ్ధాలకి మధ్య ఉన్న తేడా తెలియక పోవడం వల్ల శాంతి షాంతి అయిపోయి బాషకి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళకి కొంచెం కర్ణ కఠోరం అనిపిస్తుంది.
ఈ మధ్య వచ్చిన కొమరం పులి సినిమాలో మహమ్మహ మాయే అని ఒక పాట ఉంది. అందులో "షషి ముఖే, షషి ముఖే" అని పాడుతాడు గాయకుడు ఒక చోట. శశి ముఖి కి వచ్చిన తిప్పలు అవి. ఆ పాట పాడిన జావేద్ ఆలీకి కానీ కంపోజ్ చేసిన రెహ్మాన్ కి కానీ తెలుగు రాకపోవడం వలన వచ్చిన తిప్పలవి. కానీ పాట రాసిన చంద్రబోస్ అయినా రికార్డింగ్ సమయంలో ఉండి ఉంటే ఆ శబ్ధాన్ని మార్చి ఉండే వాడు.
వర్ధమాన గాయకులతో టీవీలో వచ్చే ఒక కార్యక్రమంలో ఇప్పుడు చాలామందికి తెలుగులో శ అని ఒక శబ్ధం ఉన్నదని తెలీదని ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు వాపోయారు. కాబట్టి దర్శకులు కానీ సంగీత దర్శకులు కానీ, వీళ్ళిద్దరూ తెలుగు తెలియని వారైతే పాటలు రాసిన రచయితలు కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని శ శబ్ధాన్ని గాయకుల చేత పాడించకపోతే చిరకాలంలోనే శ శబ్ధం మాయమయిపోయే ప్రమాదం ఉంది.
31 comments:
శబ్ధం - బూతు
శబ్దం - రైటు
షబ్దం - నాటు
అంతా బాగానే ఉంది కానీ ముందు శబ్ధాన్ని షరిషెయ్యండే!
నిజమే.. ఛీ....
షివా.. షంకరా..(శివా..శంకరా.. అని అర్థం చేసుకోండి )
ముందు వాళ్ళకి తెలిస్తేగా!
నువ్వే నా ష్వాస
.... చెప్పాలని చిన్ని ఆష
పాట మొత్తం శ ని ష చేసి అంత మంచి సాహిత్యంలో అందాన్ని పాడు చేసింది.
దిగుమతి చేసుకున్న నటీమణులు,విలన్లు, గాయకులు, గాయకీమణులు, స్టోరీలు, డైరెక్టర్లు, చెత్త, చెదారం ...గొంగట్లో తింటూ వెంట్రుకలేరుకోవడం అంటే..ఇదే.
వాళ్ళు సరిగ్గా పలికితే ఆశ్చర్య పడాలి కానీ, పలక్కపోతే కాదు.
~ శశిధర్ సంగరాజు.
www.sasidharsangaraju.blogspot.com
పైన అజ్ఞాతగారన్నట్లుగా ముందు వాళ్ళకి తెలిస్తేగా!
గాయకులంతా శ,ష,స ఎలా పలుకాలో మన మాజీగృహమంత్రి శ్రీమాన్ జానారెడ్డిగారి దగ్గర నేర్చుకోవచ్చు.
బాలు కూడా శ ని ష గానే పలుకుతారు. ఆయన 'శంకరా నాద శరీరా' పాటను శ్రద్ధగా ఆలకిస్తే గమనించగలరు. ఆ మహాగాయకుడు ఇప్పటికైనా ఇది గుర్తించారు, సంతోషించదగ్గ విషయం.
భలే వారండీ మీరు! శ కీ ష కీ తేడా, ళ కీ ల కీ తేడాలు చాలా మంది సంగీత దర్శకులకే తెలీవు. ఇంక వాళ్ళేం చెప్తారు వీళ్లకి. పిల్లి, వాల్లు, కల్లు (కళ్ళు), అని గాయకులు పలుకుతుంటే మనకు వాంతొస్తుంది కానీ సంగీత దర్శకులు ఇవన్నీ పట్టించుకోరు. కొత్త గాయకులైతే తక్కువకొస్తారు, లేదా బయటి గాయకులైతే పాటకు క్రేజు ఉంటుంది. ఇదే క్రైటీరియా అక్కడ!
ఉర్దూ బాషలో 'శ' అనే శబ్దం ఉండదు. వాళ్లు 'ష' శబ్దం వాడుతారు. టిప్పూ సుల్తాన్ దగ్గర పని చేసిన శ్యామయ్య అయ్యంగార్ ని షామయ్య అయ్యంగార్ అనేవాళ్లు. అప్పుడెప్పుడో ముఘల్ చక్రవర్తులు కొత్త బాష కనిపెట్టి ఆ బాషని తమ ఆస్థానం(court)లో మాట్లాడేవాళ్లు. ఆ బాషలో పెర్శియన్, అరబ్ బాషల పదాలు ఎక్కువగా, సంస్కృత పదాలు తక్కువగా ఉండేవి. దానికి జబాన్-ఎ-ఉర్దూ మౌలా (language of the court) అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ బాషకి చెందిన చాలా పదాలు హిందీ, తెలుగులలో కలిసిపోయాయి. చివరికి స్టైల్ కూడా కలిసిపోయింది.
మా సేహితుడ్ని పేరు అడిగితె " ప్రషాంత్ " అని చెపుతాడు , బాబు అలాకాదు , ప్రశాంత్ అని కాస్త ప్రశాంతం గా చెప్పవయ్యా అని అంటా
మీరు పాటల దాకా వెళ్లి పోయారు , మనోళ్ళు వాళ్ళ పేరు వాళ్ళు సరిగ్గా చెప్పుకోలేరు.
ex - షేఖర్ = షేక్ చేసేవాడు :-))
దీన్నే ఉర్దీకృత తెలుగు బాష అంటారు.
http://manishi-manasulomaata.blogspot.com/2009/10/blog-post_19.html
ఈ జబ్బు మన తెలంగాణ సోదరులలో ఎక్కువ (దాదాపు 99%) కనిపిస్తుంది. బహుశా వాళ్ళకు ' శ ' అనే అక్షరం ఉన్నట్టు తెలియకపోవచ్చు లేదా ప్రవీణ్ చెప్పినట్టు అక్కడి తెలుగు భాష పై ఉర్దూ ప్రభావమైనా కావచ్చు. ఏదేమైనా ఈ తేడాను హైదరాబాద్ వాసులు బాగానే గుర్తుపట్టగలరు.
కోస్తా జిల్లాలలో తప్ప దాదాపు అన్ని చోట్లా అలానే పలుకుతారు నార్త్ లో కూడా అంతే
ప్రవీణ్ చెప్పింది నిజమేకావచ్చు
దోష అంటారు దోశ అనడానికి
దీనినే ఇస్టైల్ అంటారు :)
ఇంగ్లీషులో 'శ'కి ఎస్-ఎచ్ రాసుకోవడంవలనవుతున్న అలవాటు. తేడాలేంటో, ఎలా పలకాలో మీరు చెప్పచ్చుగదా మాలాగా తికమకపడుతున్నవారికి.
పైన అజ్ఞాత బాలుగారిమీద వ్యాఖ్యతో ఏకీభవిస్తా - ఆయన ఒక్కొక్కసారి ఒక్కోలా పలుకుతారు. మీరు ఉదహరించిన కార్యక్రమంలో దర్శకుడు క్రిష్ అడిగినప్పుడు బాలుగారు వివరించినా సరిగ్గా చెప్పలేదు.
ష కి శ కి పలకడం లొ పేద్ద తేడా లేదు. కోస్తాలో కూడా శ ని స మాదిరిగా పలుకుతారు. తెలుగు భాష అభివృద్ధిని నిజంగా కోరుకునే వారిమి అయితే, పలకడంలొ కొద్ది తేడాలు కలిగిన అక్షరాలలో ఏదో ఒక దానిని తొలగించుకోవడం మంచిది.
ఉదా: ర, ఱ; రు, ఋ; క్ష; ళ, ణ, ఙ, ఞ మొదలైనవి.
మన తెలుగు భాషకి యాభై ఆరు అక్షరాలు నిజంగా అవసరమా అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
కరీంనగర్ జిల్లాలో 'శ' అక్షరాన్ని బాగానే పలుకుతారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్లకే 'శ' పలకడం రాదు. అది ఉర్దూ ప్రభావమే. కరీంనగర్ జిల్లాలో 7% మంది ముస్లింలు. హైదరాబాద్ లో 40% మంది ముస్లింలు.
హరి గారు. హిందీలో చూసినా రెండు అక్షరాలకి మధ్య లిటరల్ గా స్పష్టమైన తేడా వస్తుంది. 'श'కీ, 'ष'కీ మధ్య లిటరల్ గా తేడా కనిపించడం లేదా? 'सुशीला' అని వ్రాయడానికి, 'सुषीला' అని వ్రాయడానికి మధ్య తేడా లేదా?
జేబి గారన్నట్టు ఇంగ్లిష్ లో 'sh' అని రాయడం వల్ల కంఫ్యూజన్ వస్తుంది. ఇండియాలోనే అలా రాస్తారు కానీ ఇంగ్లిష్ మాట్లాడే దేశాలలో ఎక్కడా అలా రాయరు.
అలాగైతే Andhra Pradesh, Madhya Pradesh, Uttar Pradesh, Himachal Pradesh, Arunachal Pradesh స్పెల్లింగ్ లు కూడా మార్చాలి. బ్రిటిష్ వాళ్ల టైమ్ లో ఈ స్పెల్లింగ్ లు లేవు. మధ్య ప్రదేశ్ ని Central Provinces అనేవాళ్లు, ఉత్తర్ ప్రదేశ్ ని United Provinces of Agra and Oudh అనేవాళ్లు. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ రాష్ట్రంలో భాగంగా, హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రంలో భాగంగా, అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేవి. పేర్లని ఇండియన్ శైలిలోకి మార్చిన తరువాతే 'శ'కీ, 'ష'కీ తేడా తెలియకుండా పోయింది.
ప్రవీణ్ శర్మ గారు,
హిందీలొ కూడా వేర్వేరు అక్షరాలున్నాయి. నా ఉద్దేశ్యం హిందీలొ కూదా అనవసరమైన అక్షరాలు ఒద్దనే. ఎలా రాసుకున్నా కూడా వారు పలకడంలొ పెద్ద తేడా ఉండదు. అది కూడా ప్రాంతానికీ, ప్రాంతానికీ మారుతుంది. బీహారీలు పలికే హిందీకి, రాజస్థానీలు పలికే హిందీకి ఉఛ్ఛారణలొ చాలా తేడాలుంటాయి.
చెప్పుదండలు గారూ
చెప్పుల్లోంచి ముందు కాళ్ళు తీసి ఈ పైనున్న టపాలో మేకుని (శబ్ధం) ముందు తియ్యండి....ఎక్కడా? ఉదాహరణకి - ఇక్కడ:
"కాబట్టి దర్శకులు కానీ సంగీత దర్శకులు కానీ, వీళ్ళిద్దరూ తెలుగు తెలియని వారైతే పాటలు రాసిన రచయితలు కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని శ శబ్ధాన్ని గాయకుల చేత పాడించకపోతే చిరకాలంలోనే శ శబ్ధం మాయమయిపోయే ప్రమాదం ఉంది."
ఇహ పైనున్న శర్మ గారి జ్ఞానానికి, కామెంట్ల ధాటికి ఎంతో మంది ఆయనకు ఋణపడి ఉంటారు...
హరి గారు. సుజాత గారి బ్లాగ్ లో పాత పోస్ట్ చదవండి. తెలుస్తుంది. పైన లింక్ ఇచ్చాను.
"కుల్లు మోతు వాల్లు"
"కల్లెం లేని గుర్రం"
"యాపిల్ పల్లు"
"పల్లు రాలగొట్టిన యువతి"(ఈ పళ్ళు వేరు)
"మల్లీ మల్లీ చెప్పినా లాభం లేదు"
"గులాబి ముల్లు"(సింగిల్ ముల్లు కాదు, ముళ్ళు)
"మురలీ రవలి"
"జీవన సరలి"
"చోల రాజుల నాటి శాసనం"
"వీధికెక్కిన ఇల్లాల్లు(ఇల్లాళ్ళు)
"లలిత కలలు" (లలిత కన్న కలలు అని అర్థం చేసుకోవాలా?)
కొన్ని శబ్దాలు పలికేటప్పుడు తేడా తెలుస్తుంది కాని కొన్నిటి దగ్గర శ,స కి కూడా తేడా తెలీదు. మాట్లాడే వేగంలో అవి కలిసిపోతాయి. ఉదా: శంకర, సంకర, తేడా తెలియని పదాలు శైలి, సైకత.
సంకర అంటే mixed అని అర్థం. జీవజాతుల విషయంలో mixed breedని సంకర జాతి అనే అంటారు. వృక్ష శాస్త్ర విద్యార్థులకో, జంతు శాస్త్ర విద్యార్థులకో శంకర జాతి అని చెపితే కంఫ్యూజ్ అయిపోతారు. శబ్దంలో తేడా లేకుండా చూసుకోవడం ముఖ్యమే.
Anti-telangana comment:
seenu said...
ఈ జబ్బు మన తెలంగాణ సోదరులలో ఎక్కువ (దాదాపు 99%) కనిపిస్తుంది. బహుశా వాళ్ళకు ' శ ' అనే అక్షరం ఉన్నట్టు తెలియకపోవచ్చు లేదా ప్రవీణ్ చెప్పినట్టు అక్కడి తెలుగు భాష పై ఉర్దూ ప్రభావమైనా కావచ్చు. ఏదేమైనా ఈ తేడాను హైదరాబాద్ వాసులు బాగానే గుర్తుపట్టగలరు.
October 18, 2010 9:03 PM
"శ" ఎలా పలకాలన్న విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
1. 90% మంది రాజశేఖర పదాన్ని RAJASHEKHAR అనే అంటారు,RAJA SEKHAR అనరు... జాగ్రత్తగా వినండి.
2. ఇక, మహేష్ అని "ష" అక్షరంతో రాసే పండితులు, మహేశ్వర పదాన్ని రాసేటప్పుడు మాత్రం "శ" అక్షరాన్ని ఎందుకు వాడుతున్నారో ఆలోచించారా??
పైగా .....ఈ జబ్బు తెలంగాణ లో.... అని కించపరచడం ఎందుకు బాబూ?
Same logic you can apply to RAME"SH", RAME"S"VARAM, SOMESH... SOME"S"VARAM.... ఈ స్వరాలెక్కడివి నాయనా.....
పైగా .....ఈ జబ్బు తెలంగాణ లో.... అని కించపరచడం ఎందుకు బాబూ?
అసలు - ఈ సమస్య తెలంగాణ భాషలో లేనేలేదు.
మరో మాట!
ఎస్పీ బాలు గారు, "స" "శ" "ష" ల మధ్య తేడాలను చా'ల చ'క్కగా పలుకుతారు. కావాలంటే ఒకసారి, ఆయన పాడిన పాటలను శ్రద్ధగా వినేప్రయత్నం చేయండి - మరి!!
ఇలాంటి తేడాలు నేను కూడా చూశాను. ఇంగ్లిష్ లో Shamirpet అని వ్రాసి తెలుగులో శామీర్ పేట్ అని వ్రాయడం. ఒరిజినల్ గా ఉర్దూలో షాహ్ అమీర్ పేట్. 'శ' అని ఇంగ్లిష్ లో వ్రాయడానికి 'ఎస్-హెచ్' వాడడం వల్ల కూడా తేడా వస్తుంది. 'షాహ్ అలీ బండ' పేరు శాలీబండ అని వ్రాయడం ఇంకో ఉదాహరణ.
ప్రబీన్ షర్మ, ఇక ఆపుతావా? డిక్స్ నరీ మొత్తం వేసేట్టున్నావ్.
షరత్ బావ
బాలు చెన్నైలో ఉన్నా తెలుగు బాగానే మాట్లాడుతాడు. మనకే తెలుగు మాట్లాడడం రాదు.
బాబులు...మీ వాఖ్యలవల్ల వాటిని ఎలా పలకాలో తెలియడంలేదు..’ష’,’ళ’ ను పలకాలంటే నాలుకను మడతపెట్టి పలుకుతాను ఇది సరైందేనా? ఎవరైనా దయచేసి స-శ-సె-ష లను ఎలా పలకాలో ఆడియో రూపంలో చెప్పండి....నాలాంటి ఉర్దు బాధిత తెలుగు వాళ్లకు పనికొస్తుంది...
Sandalwoodలో 'sa' ఎలా పలుకుతారో 'శా' అలా పలుకుతారు. 'ష' అనే శబ్దం లేని బాషలు ఉన్నాయి. పంజాబీ బాషలోని తూర్పు మాండలికంలో 'ష' అనే శబ్దం ఉండదు. సంస్కృతం నుంచి వచ్చిన పదాలని పలికేటప్పుడు వాళ్లు 'మనుష్య'ని 'మనుఖ్' అని, 'పురుష'ని 'పురుఖ్' అని అంటారు. పెర్శియన్ పదం 'షేర్'ని 'సేర్' అని అంటారు.
Post a Comment