నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, October 6, 2010

రోబో సినిమాలో చెప్పిన అసిమవ్ రోబోటిక్ ప్రిన్సిపుల్స్

రోబో సినిమాలో మొదటిసారి వశీకర్ తన చిట్టిని మిలిటరీ అధికారుల దగ్గరికి ఎవాల్యుయేషన్ కోసం తీసికెళ్ళినప్పుడు అందులో ఒకాయన అడుగుతాడు "ఈ రోబో అసిమవ్ ప్రిన్సిపుల్స్ కి తగ్గట్టుగా పని చేస్తుందా?" అని. దానికి వశీకర్ అవును అని జవాబు చెప్తాడు కానీ చిట్టి అసిమవ్ ప్రిన్సిపుల్స్ ని తరువాత కొన్ని సీన్లలో ఉల్లంఘిస్తుంది.

అసిమవ్ రష్యాలో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ సైన్స్ ఫిక్షన్ రచయిత. కంప్యూటర్లు లేని కాలంలోనే అంతరిక్ష యాత్రల గురించి, రోబోల గురించి పుంఖాను పుంఖాలుగా నవలలు, కథలు రాశాడు. కొన్నేళ్ళ క్రితం విల్ స్మిత్ హీరోగా వచ్చి విజయవంతమైన ఐ రోబో సినిమా కథ ఈయన నవలే. ఈ సినిమాలోని కొన్ని సీన్లు రోబో సినిమాలో కూడా ఉన్నాయి.
ఈ ప్రిన్సిపుల్స్ లో మొదటిది ఒక రోబో ఎట్టి పరిస్థితిలోనూ మానవులకి హాని తలపెట్టకూడదు. రెండవది మొదటి నియమాన్ని భంగం చేయనంతవరకూ తన యజమాని ఏం చెప్పినా చేయాలి. మూడవది పై రెండు సూత్రాలకి భంగం కలగనంతవరకూ తనని తాను కాపాడుకోవాలి.

అసిమవ్ తన కథల్లో రాసిన ఈ ప్రిన్సిపుల్స్ ఎన్నో యేళ్ళ తరువాత రూపు దిద్దుకున్న రోబోటిక్స్ శాస్త్రంలో యధాతధంగా స్వీకరించారు.
రోబో సినిమాలో ఎలక్ట్రిక్ ట్రైన్ లో చిట్టి దుండగులని కొట్టడం ఇందులో మొదటి సూత్రానికి విరుద్ధం. అలాగే భోరా చెప్పగానే కత్తితో వశీకర్ మీద దాడికి పూనుకోవడం కూడా ఈ సిద్ధాంతాన్ని ఉల్లంఘించడమే.

రోబో సినిమాలో తప్పులకోసం రంధ్రాన్వేషణ చేయడం కోసం ఈ పోస్టు రాయడం లేదు. అసిమవ్ ప్రిన్సిపుల్స్ గురించి, అసలు రోబోటిక్ కాన్సెప్టు లేని కాలం లోనే రోబోటిక్ ప్రిన్సిపుల్స్ ని ఆవిష్కరించిన అసిమవ్ దార్శనికత గురించి చెప్పడమే నా ఉద్ధేశ్యం.

6 comments:

వేణూశ్రీకాంత్ said...

Hmm Interesting, అసలు చిట్టిని తయారు చేసినదే ఆర్మీలో ఒక సైనికుడిగా యుద్దంలో మనుషులను చంపేందుకు ఉపయోగించడానికి. వశీ తన గోల్ అదేనని చెప్తాడు. మరి అలాంటపుడు చిట్టి అసిమోవ్ ప్రిన్సిపుల్స్ కి అనుగుణంగా పని చేస్తుందని ఎలా చెప్పగలడు. బహుశా ఆ ప్రిన్సిపుల్స్ వేరేనేమో లేదా డైరెక్టర్ కు అవగాహన లేదనుకోవాలా అలాంటపుడు అసలు ప్రస్థావించడం ఎందుకు.

ANALYSIS//అనాలిసిస్ said...

అసిమోవ్ ప్రిన్సిపుల్ కరక్టే, శంకర్ ప్రిన్సిపుల్ కూడా కరెక్టే. సాధారణంగా రోబోలన్నీ Human- friendlyగా డిజైన్ చేయబడతాయి. శంకర్ రోబో కూడా Human -friendlyనే కాకపోతే దానికి అదనంగా అప్పుడప్పుడు మనుష్యులను చంపే విధంగా డిజైన్ చేయబడింది. అది కూడా మనిషి ఇచ్చ ప్రకారమే( రోబో కి ఆజ్ఞలను ఇచ్చే వ్యక్తి కోరిక మేరకు ). So ఇక్కడ అసిమోవ్ సూత్రాలు ఉల్లంగించబడలేదు At the same time శంకర్ కూడా తప్పు చేయలేదు అని నా భావన . Basical గా రొబోలు తమ కిచ్చిన ప్రోగ్రాం ప్రకారమే నడుచుకుంటాయ్ ... అది మనుష్యులను రక్షించడమైనా లేదా చంపడమైనా. ఒకవేళ రోబో తప్పు చెసిందంటే అది రొబో తప్పు కాదు ప్రోగ్రాం( ప్రొగ్రామర్ ) తప్పు అంతే

Bhaskar said...

I saw this movie in its Tamil version, in that Rajini clearly says that it doesn't obey Asimov's Laws of robotics because he made it for the Army specifically to defend our country. I am not sure how it was dubbed into Telugu. Not only that, Asimov created these laws as a literary device to weave his mysteries around it, its not being used in real life robots. There are many futurists who propose the same or modified version of these laws but there's no robot which passes the the Turing Test that requires incorporation of these laws yet.

వేణూశ్రీకాంత్ said...

Yes Bhaskar is correct. మొదటి సారి మిలటరీ ముందు అప్రూవల్ కి వెళ్ళినపుడు "ఈ రోబో అసిమోవ్ రూల్ ఫాలో అయ్యేలా తయారు చేయబడిందా?" అని అడిగిన ఆఫీసర్ కు జవాబుగా "ఈ రోబో అలా తయారు చేయబడలేదు ఎందుకంటే యుద్దంలో మనుష్యులను చంపాల్సిన అవసరం వస్తుంది కనుక" అని స్పష్టంగా చెప్తాడు.

sree said...

నేను I, Robot సినిమా చూసాను గాని అందులో 3 laws అంటే ఏమిటో అర్థం కాలేదు. మీరు బ్లాగులో రాసినవేనా ఆ "3 laws" ?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Yes,Sree.