నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, March 17, 2010

పంచాంగం చదివే పంతుళ్ళూ ఏది నిజం చెప్పండి.

ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల ఆఫీసులలో ముగ్గురు పంతుళ్ళు పంచాంగ పఠనం చేశారు.అయితే ఎక్కడ పంతులు అక్కడి పార్టీని ఆకాశానికెత్తేసి ఆ పార్టీకి, దాని నాయకుడుకీ బంగారు భవిష్యత్తు ఉందని చెప్పాడు.చివరికి చిరంజీవిని కూడా రాబోయే కాలానికి కాబోయే మహా నాయకుడు అని ఒక పంతులు పొగిడేశాడు. అయితే చిరంజీవి లోలోపల నవ్వుకొని ఉంటాడనుకోండి.
దీన్ని బట్టి చూస్తే నాకు తెలిసిందేమిటంటే ఎవరు డబ్బులు ఇస్తే వారికి మహా భవిష్యత్తు ఉన్నట్టు వీరి చేతిలోని పంచాంగం వీరికి చెబుతుందన్నమాట.

3 comments:

శరత్ కాలమ్ said...

మీ పంచాగం చెబుతున్నాను. మీరే కాబోయే బ్లాగ్ నాయకులు :)

Anonymous said...

nijaanni bharinchE dammu, samskaaram raajakeeyanaayakulaku vunTundaa? okavELa nijam cheppinaa nammarEmO.. idi egas paarTee vaaDi kuTra ani A pantulunu tanni tagalEstaaru.

Anonymous said...

మీరన్నది నిజమే కాని పాపం వాళ్ళు మాత్రం ఏమిచేస్తారు. నిజం చెబితే నిష్టూరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కావల్సింది పొగడ్తలు. రోగి కోరింది డాక్టర్ ఇచ్చింది ఒక్కటేనన్న విధంగా వార్కి కావల్సిన ప్రియమైన మాటలే చెబుతారు.