నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, November 7, 2010

నెల్లూరు ఓదార్పు యాత్రలో కొన్ని దృశ్యాలు

జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రకి జనం తండోపతండాలుగా వస్తున్నారు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహానేత తనయుడు యువనేతని చూడాలని, తండ్రిని కోల్పోయిన అతన్ని ఓదార్చాలని పనులన్నీ మానుకొని జగన్ యాత్రని విజయవంతం చేస్తున్నారని సాక్షి చానల్లో,పేపర్లో ఊదరగొట్టేస్తుంటే ఎందరు అనుమానాలు వ్యక్తం చేసినా నేను పెద్దగా
నమ్మలేదు

    .

ఈ రోజు నెల్లూరు ఓదార్పు యాత్రలో అసలు మీటింగ్ కి కొన్ని గంటల ముందు నెల్లూరు రోడ్లపైన కనిపించిన కొన్ని దృశ్యాలను నా సెల్ ఫోన్ లో బంధించి అందిస్తున్నాను. ఇది కేవలం ఒక ఫ్రాక్షన్ మాత్రమే.
జగన్ ని డీఫేమ్ చేయడానికో, అతడి యాత్రను తక్కువ చేయడానికో ఈ పోస్టు కాదు. ఒకే అబద్ధం పదే పదే చెపుతూ ఉంటే అది ఎలా నిజమై పోతుందో చూపడమే నా ఉద్ధేశ్యం.

17 comments:

Praveen Sarma said...

వంద రూపాయల నోటు లేదా సారా ప్యాకెట్ ఇస్తే వచ్చే పేదవాళ్లు చాలా మంది ఉన్నారు. కూలీ పనికి వెళ్తే డబ్బై రూపాయలు వస్తాయి. రాజకీయ నాయకుని రోడ్ షోకి వెళ్తే వంద రూపాయలు వస్తాయి.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

కూలీనాలీ చేసుకొనే వారి పట్ల జగన్ ని ఆపద్భాందవుడిగా భావించవచ్చేమో శర్మగారూ!

Praveen Sarma said...

మా పట్టణంలో కార్పెంటర్ కి రోజుకి వచ్చేది వంద రూపాయలు. కార్పెంటర్ ని ఈ మీటింగ్ కి పిలిస్తే రాడు. రోజుకి డబ్బై రూపాయలు సంపాదించే కూలీవాళ్లు, ముప్పై రూపాయలు సంపాదించే పారిశుధ్య కార్మికులకి వంద రూపాయల నోటు శ్రీలక్ష్మే.

Anonymous said...

Praveen Sarma

కార్పెంటర్ మీటింగ్ కి ఎందుకు రాడని అనుకుంటున్నారు.
పని నుండి వాళ్ళకు ఇలాంటివి ఆటవిడుపులు బోనస్ గా బిర్యానీ మందూ లాంటివి. మీరు గమనించలేదేమో రోజూ కూలి చేసుకునే వాళ్ళు డబ్బు కోసం అంతగా కష్టపడరు. నాల్గురోజులు పనిచేస్తే వచ్చే బ్ుతో మరో నాలుగురోజులు కులాసాగా గడపాలని అనుకునే వాళ్ళే ఎక్కువ.

ప్రవీన్ మీరు 2oo7 లో తెలుగు బ్లాగుల సంకలిని చేశారని .. నిజమేనా?

rakthacharithra said...

సినిమా :- జగన్ ఓదార్పు యాత్ర
డైరెక్టర్ :-కోడి రామకృష్ణ .
వేదిక :-జగన్ నెల్లూరు ఓదార్పు యాత్ర ముగింపు సభ
సందర్బం :- వైయస్ జగన్ నెల్లూరు ఓదార్పు యాత్ర ముగింపు సభకు రోజా కు ఆహ్వానం అందిన సందర్బంగా

రోజా: జగన్ న్ న్ ... నా గనిని ఇష్టం వచ్చినట్లు తవ్వుకో. నీ శక్తి కొద్ది తవ్వుకో. నీకు అడ్డేమి లేదు.

జగన్: నీ గని గలీజు. కాబట్టి లీజుకు తీసుకునే ప్రసక్తే లేదు.

రోజా (కోపంతో): నా గని గలీజు అంటావా. బృహన్నల వెధవా....

rakthacharithra said...

ఈ జగన్ గాడికే దిక్కు లేక ఏడుస్తున్నాడు ... ఇంకా ఆ రోజా కి ఏమి ఇస్తాడు లైఫ్ .. వాడి దగ్గర వున్నా నాయకుల్లో ఒక్కడు గెలిచే వాడు వున్నాడ?


http://paanakaalu.blogspot.com/2010/11/blog-post_8348.html

Sree said...

జపాన్ లాంటి అభివృధ్ధి చెందిన దేశాల్లో ఏ campaign చేసినా అసలు ఎవరూ రారు. campaign చేసేవాల్లు తమ మట్టుకు తాము మాట్లాడేసి వెళ్ళిపోతారు. పని తాము చేసుకుపోతుంటారు అలా. ఎందుకంటే ఇక్కడ జనాలకి తమ పనులు బోలెడు ఉన్నాయి. మన దేశం లో ఇలా మీటింగులకి వెళ్ళిపోయే జనాలు ఉన్నంత కాలం ఈ బాధ తప్పదు. అందుకే చదువుకున్న యువతగా మనం చెయ్యాల్సిన పనులు.
1) వీలైనంత మంది విద్యార్థులకి సాయపడి knowledge ని పెంచటం.
2) మనకు చేతనైతే ఉపాధి అవకాశాలు పెంచటం. అలా చేయటం ద్వారా నిరుద్యోగం కొంతైనా తగ్గించటం.
3) ప్రతి దానికీ తమ ఖర్మనో ప్రభుత్వాన్నో దైవాన్నో బాధ్యులని చేసే మూర్ఖులకి అసలు వారేమి చేస్తున్నారో వివరించి, వారి సమస్యలని వారే ఎలా పరిష్కరించుకోవచ్చో చెప్పటం.

మన వంతు ప్రయత్నం మనం చేద్దాం ఏమంటారు?

Harish said...

నాకు ఎప్పటినుంచో ఈ అనుమానం ఉండేది.... ఈ కార్యకర్తలెవరు...వీళ్లకు పనులుండవా అని...

now i got it

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నిజమే.రోజూ పని చేసుకొనేవాడు ఒక రోజు వందో,రెండొందలకో ఆశ పడి పని వదులుకోడు. పనీ పాట లేని వాళ్ళో, చేయని వాళ్ళో ఇలాంటి మీటింగులకొస్తారు.

Anonymous said...

@చెప్పు దెబ్బలు-పూలదండలు gaaru
మీరు ఏ వ్యాపారినైనా (రైతునైనా )అడిగి చూడండి వర్కర్క్స్ గుంరించి ఏం చెపుతాడో :)

కూలి చేసుకునే వాళ్ళంతా పుస్తకాలలో రాసినట్టో , మధ్యతరగతి ఉధ్యోగస్తులు ఊహించి రాసినట్టో ఉంటారనుకుంటే పొరపాటు.
ఒక్క రోజు పనిచేసి నాల్గు రోజులు పిలిచినా రాకుండా జల్సాగా బతికేవాళ్ళ గురించి వినుండరు.
నా దగ్గర 18 మంది పనిచేస్తారు. నాలుగు రోజులు పనికి వస్తే మళ్ళీ నాలుగు రోజులు చెప్పకుండా సెలవు తీసుకుంటారు. వాళ్ళకిచ్చేవి నెలకు నాలుగు సెలవులే కానీ వాళ్ళు తోసుకునేవి నెలకు పది. జీతం కట్ అవుతుంది ఐనా పరవాలేదు వాళ్ళకి. భాద్యత అనే పదానికి అర్ధం తెలియదు. మనల్ని పోషించే వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారనే సృహ ఉండదు. ఇంట్లో సమస్య వస్తే అప్పులూ, అడ్వాన్సులూ అంటారు అవి తీర్చకుండా చెప్ప పెట్టకుండా ఎగ్గొట్టి వెడతారు.
అరే రోజూ ఏం కష్టపడతాం భయ్యా ఈ రోజు రెస్టు తీసుంటున్నా అంటాడట లీవు వున్న వర్కర్ కి అవసరమై రమ్మని కబురుపెడితే. వేరే మార్గం లేక అవసరమైన దానికంటే ఎక్కువ పనివాళ్ళని పెట్టుకుంటారు అందరూ.

ఇదంతా ఇక్కడ అనవసర కామెంటే. ఐనా ఎందుకు రాస్తున్నానంటే. మీ బ్లాగు బావుంటుంది చాలా చక్కటి విషయాలు అందిస్తున్నారు.
లేబర్ పైన చాలా మంది చదువుకుని ఉధ్యోగాలు చేస్తున్న వారికి ఉన్న అపోహలే మీకూ ఉన్నట్టు అనిపించింది.
అనవసరమైన కామెంటు అనుకుంటే తొలగించండి. ఇంకా వివరంగా చెప్పమంటే చర్చ కొనసాగిద్దాం

Praveen Sarma said...

కట్టు కథలు చెప్పకు. వ్యాపారం కొత్తగా పెట్టిన రోజుల్లో నా షాప్ వెనుక టాయ్లెట్ శుభ్రం చేసే పాకీవాడు ముప్పై రూపాయల కోసం ఎంత కంపులో చెయ్యి పెట్టాడో నాకు తెలుసు. అలా చెయ్యి పెట్టొద్దని చెప్పి క్లీనింగ్ బ్రష్ నేనే కొనిచ్చాను. మనలాగ డబ్బున్నవాడు ముప్పై రూపాయలు ఏమిటి? నాలుగైదు వేలు రూపాయలు ఇచ్చినా ఆ నరకంలో చెయ్యి పెట్టడు.

rakthacharithra said...

జగన్ కు రోజా పువ్వు దొరికింది.
5 years తరువాత. జగన్ ముఖ్య మంత్రి. రోజా పి ఎ టు జగన్. ఒకరోజు జగన్ గూడాచారులు సేల్వమనికి ఎయిడ్స్ ఉందనే కటోర వార్తను మోసుకుని వచ్చారు. జగన్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఆ వార్త విని ఎందఱో జగన్ శిబిరం లోని వాళ్ళు చచ్చి పోయారు. తమ నాయకుడు చచ్చాడని కాదు. అందరూ రోజా పువ్వుతో ఆడుకున్నవాల్లే కాబట్టి.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎనోనిమస్ గారూ చెప్పండి. మీ అనుభవం కాబట్టి నిజమని అంగీకరించక తప్పదు. నా కంక్లూడింగ్ ఏమిటంటే కూలీ పనులు చేసేవాళ్ళు అందరిలాగే నానా రకాలుగా ఉంటారు. ఎక్కువ భాగం మీరు రాసిన కోవకి చెందిన వాళ్ళు అయి ఉంటారేమో. మీ అనుభవాలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి.

ప్రవీణ్, కట్టుకథలు అన్నది నన్ను ఉద్ధేశించా లేక పైనున్న అనోనిమస్ ని ఉద్ధేశించా?

Praveen Sarma said...

అజ్ఞాతని ఉద్దేశించే. రోజుకి డబ్బై రూపాయలు సంపాదించే కూలీవాడు కావాలని సెలవు పెట్టి జగన్ లాంటోళ్ల మీటింగ్ కి ఎందుకు వెళ్తాడు?

dhruva tara said...

సహనం కోల్పోతే,జనం గుండె చప్పుళ్ళు కలిస్తే ఉప్పెన వస్తుందన్నాడట జగన్ . నా కేమీ అర్ధం కాలా ,కానీ సోనియా సహనం కోల్పోతే,CBI,enforement directorate,I.T,ACB, లాంటి ఏజెన్సీ లన్నీ కలిస్తే ఏమౌతుందో మాత్రం నాకు స్పష్టం గా తెలుసు. మరి ఈ పిల్లకాకికి ఉండేలు దెబ్బంటే తెలుసా?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

డబ్బులు,మందు,బిరియాని ఇస్తారటగా?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

తెలుసు కాబట్టే సోనియమ్మ ఏదొ ఒక మంచి పదవి ఇచ్చి ఒక face saving route ఏర్పరచక పోతుందా అని సహనం కోల్పోకుండా ఉంటున్నాడు బాసు.