నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, November 28, 2010

అమ్మయ్య! జగన్ ఓదార్పు యాత్ర కొనసాగిస్తాడట!

రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా జరిగిన పరిణామాలు గమనిస్తే జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర ఎక్కడ ఆగిపోతుందో అని భయమేసింది. రెండు నెలలుగా రాత్రనకా పగలనకా తిరిగి, తిరిగి కనిపించిన వాళ్ళందరికీ చేతులు ఊపి,ఊపి చివరికి నెల్లూరులో "నాకు సహనం నశిస్తే ఉప్పెన, సునామీ, భూకంపం, అగ్ని పర్వతం పేలుడు" అని భీకరమైన హెచ్చరికలు చేసినా అమ్మగారు ఏమీ పట్టించుకోకుండా ముసలి తాతని పీకేసి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది అంటే జగన్ కి ఓదార్పు మీద నమ్మకం చచ్చి పోయి ఉంటుందేమో అనుకొన్నాను. ఓదార్పు చేయడం వల్ల కంఠ శోష, కాళ్ళ నొప్పులు, చేతుల పీకుడు తప్ప మరేమీ మిగలదని నిజం తెలుసుకొని జగన్ ఓదార్పుకి మంగళం పాడేస్తాడేమో అనుకొన్నాను కానీ నిన్నో, ఇవాళో జగన్ స్పీకర్ అంబటి రాంబాబు ఏదో చానల్లో మాట్లాడుతూ "ఓదార్పు ఆగదు" అని చెప్పాక అమ్మయ్య అనుకొన్నాను.
 
ముందుగా ఓదార్పు ఎందుకు ఆగకూడదో నన్ను చెప్పనివ్వండి. ఓదార్పు అంటే అదొక నవరసభరిత నాటకం. అన్నిటికన్నా ముఖ్యమైనది కామెడీ. ప్రతి రోజు జగన్ తన తండ్రి కోసం ఎప్పుడో చనిపోయిన?వాళ్ల కుటుంబాల దగ్గరకెళ్ళి వాళ్ళని ఓదార్చి, తను ఓదార్పు పొందడం, వాళ్ళ చేత అదో ఇదో తిని ఆకలి తీర్చుకోవడం, సాక్షి పేపర్ లో, చానల్ లో పక్క రోజు ఆ ఫోటోలు పేజీల కొద్దీ, గంటల కొద్దీ రావడం....ఇదంతా ఒక పెద్ద సంబరం.
 
మరొకటేమిటంటే ఎంతో మంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు తయారు చెసే వాళ్ళకి ఓదార్పు ఉన్నంతకాలం డబ్బుకి ఢోకా ఉండదు. ఇప్పుడు ఓదార్పు ఆగిపోతే వాళ్ళు ఆల్రెడీ తయారు చేసిన విగ్రహాలు ఏం కావాలి? ప్రతిరోజూ ఓదార్పు మీటింగులకి హజరయ్యె వాళ్ళకి, వాళ్ళని హాజరు పరిచే వాళ్ళకీ ఓదార్పు యాత్ర  ఆగిపోతే నోటి కాడి కూడు పోయినట్టే.


ఇంతమందిని ఇన్నిరకాలుగా అలరిస్తున్న ఓదార్పు ఇప్పట్లో ఆగిపోకూడదని కోరుకుంటూ జగన్ కి విషెస్ ఈ పోస్టు ద్వారా తెలియజేస్తున్నాను.

2 comments:

Apparao said...

2014 వరకే ఓదార్పు జరగవచ్చు
ఆతర్వాత కాంగీ ఓడిపోతే(?) ఇంకెందుకు ఓదార్పులు


కాంగ్రెస్ ని అందరూ తిడతారు కానీ ఓటు మాత్రం వేస్తారు అజ్ఞాత కామెంట్ లాగా

Sree said...

veedi odarpu santakella !!