తన పదవిని కాపాడుకోవడానికి యెడ్యూరప్ప నానా తంటాలు పడుతుంటే ఆయనకి నేనున్నానంటూ విశ్వేశ్వరతీర్థ స్వామి ముందుకొచ్చాడు. ఈయన ఉడుపిలోని పెజావర్ మఠాధిపతి. తప్పు నిరూపితమయ్యేవరకూ యెడ్యూరప్పమీద ఎలాంటి చర్యా తీసుకోకూడదు అని హుకుం జారీ చేశారు స్వామిగారు.
"స్వామిగారూ రాజకీయాలంటే రొచ్చు. పైపెచ్చు ఇప్పుడు మీ అనుంగు శిష్య పరమాణువు ఇరుక్కున్నది మరింత కంపుకొట్టే రొచ్చు. ఆయన మానాన ఆయన్ని వదిలేసి మీ మానాన మీరు కృష్ణా రామా అనుకోకుండా ఆ కంపులో వేలు పెట్టడం ఎందుకు చెప్పండి?"
19 comments:
వాళ్ళని అని ప్రయోజనమేముంది? రాజకీయ పార్టీలు తమ పని తాము చేయకుండా మఠాధిపతులతో, పీఠాధిపతులతో ఎప్పుడు బంధాలు పెంచుకుని ప్రతి దానికీ వాళ్ల దగ్గరికి పరిగెడతాయో అప్పుడు వాళ్ళు ఈ లీనియన్స్ ని అందిపుచ్చుకుని హుకుం లు జారీ చేస్తారు.
Could you please delete duplicate comments.
SRI
సుజాతా గారు,
స్వామి వారి మీద మీ వ్యాఖ్య/ అనాలిసిస్ చూసి నవ్వు వస్తున్నాది. ఈ ముక్క మా ఇంట్లొ ఉన్న పని మనిషి కూడా చెప్పగలదు. ఒక చిన్న ప్రశ్న అసలికి ఈ/ఏ స్వాముల వ్యాఖ్యని దేవాలయాలో పూజారుల దుస్థి మీద ప్రభుత్వాన్ని కలిసినపుడు ఎవ్వరు వారికి పెద్ద ప్రాముఖ్యత నిచ్చి పూజారుల/దేవాలయాల సమస్యలను పరిష్కరించరు. కాని ఈ రోజు ఇక్కడ స్వామి గురించి రాయటానికి కారణం ఎమై ఉంట్టుంది ఆలోచించండి? అసలికి ఆయన గురించి ఎంత మందికి తెలుసు, కర్ణాటక స్వామి వ్యాఖ్యను ప్రచూరించక పోతే అడిగే వారేవరు? మరి అటువంటి ఆయన వ్యాఖ్యను ఎందుకు మీడీయాలో ఇప్పుడు ప్రచూరించారో చెప్ప గలరా? కొంచెం రాజకీయాల మీద వ్యాఖ్య చేసేటప్పుడు మెదడు ఉపయోగించి రాయండి. మీడీయా ఆడే ఆట.
SRI
SRI గారూ ఇప్పటికి మీ ఆవేశం తగ్గి ఉంటే ఈ పోస్టు మరోసారి చదవండి. ఇందులో స్వామిగారిని తక్కువ చెసి రాసిందేమీలేదు.అనవసరంగా రొచ్చులోకి రావడమెందుకు అన్న ఫీలింగ్ తప్ప.మరొకటేమిటంటే ఆ పీఠం లింగాయత్ లకి చెందినది. ఆ పీఠమే కాకుండా మరొక రెండు లింగాయత్ మఠాలు యెడ్యూరప్పకి మద్ధతు ప్రకటించాయి. అన్నట్లు యెడ్డీ బాబు లింగాయత్.
శ్రీ గారూ,
నేను మీడియా మెయిన్ స్ట్రీమ్ లో లేను. అందువల్ల ప్రస్తుత రాజకీయాల మీద వ్యాఖ్య రాయాలంటే నా పేపరు వాడేమంటాడో అని భయపడుతూ వ్యాఖ్య రాయాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. మీ ఇంట్లో పని మనిషి కూడా మీలాగే బాగా చదువుకున్నదై ఉంటుందని భావిస్తూ అందుకు సంతోషిస్తున్నాను.నా వ్యాఖ్యలో పెద్ద అనాలిసిస్ ఉందని నేనే అనుకోవడం లేదు, అందులే మీకు అనాలిసి కనిపించడం చూసి అయ్యో అనిపిస్తోంది.
వార్త అంటూ పేపర్లో వస్తే దాని గురించి అంతో ఇంతో అందరు బ్లాగర్లూ స్పందిస్తూనే ఉంటారు. అలాగే పూజారుల దుస్థితుల మీద వచ్చినపుడు విజయ శర్మ గారి బ్లాగులో అనుకుంటాను, ఇంతకు ముందు చర్చ జరిగినపుడు అందరూ వారి పరిస్థితులు బాగుపడాల్సిందేనని సంఘీభావం వెలిబుచ్చారు. మీరు అప్పుడో ఇప్పుడో కాకుండా రెగ్యులర్ గా బ్లాగులు ఫాలో ఐతే తెలుస్తుంది.
ఎలాగూ అసలు పేరుతో వ్యాఖ్యలు రాసే అలవాటు లేదు. కానీ రాసేటపుడు ఎవరి అభిప్రాయమైనా నచ్చకపోతే కేవలం అభిప్రాయాన్ని మాత్రమే ఖండిస్తే అందంగా ఉంటుంది. సభ్యత అనే మాటను గుర్తుంచుకుని రాయండి. నోరు జారడానికి నిమిషం పట్టదు..పైగా నేను సొంత పేరుతో ఐడీతోనే రాస్తాను.
బలాగు రాసేటోల్లకి దురద, కామెంటేటోల్లకి దురద.
ఇద్దరికి వాస్తవ పరిస్థితుల మీద అవగాహన సున్నా!
అదేటంటే, నేను మెయిన్ స్ట్రీట్ కాదు, దొడ్డిదారి అని కవరింగు.
అల్లాగైతే మరి కామెంటిందెందుకు?
కన్నడ రాజకీయాలకి, వ్యాపారాలకి, కులసంఘాలకి, కులసంఘాల వారీగా వున్న స్వాములోర్లకి, వాల్ల మధ్య వున్న లోపాయికారీ అవగాహనలకి సంబందం తెలీకుండా సుమ్మునే బలాగు రాయటం దాని మీదా కామెంట్లేయటం ఒక పనికిమాలిన వెకిలి విషయం. (ఇయ్యాల్ల నన్ను KCR పూనాడు) ;)
స్వాములైనంత మాత్రాన దేశపౌరుడిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు పోతుందా?! అతన్ని ముక్కు మూసుకుని తపస్సుచేయమంటున్నారు. మీరూ నోరు మూసుకుని మీ వ్యాపారం చేసుకోవచ్చుగా అని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా?
ఆవేశపరులందరూ ఒక విషయం గమనించాలి. కంపుగొట్టే రొచ్చులో వేలు పెట్టడానికి సదరు స్వామిగారికి గల హక్కుని ఇక్కడ ప్రశ్నించడం లేదు. కంపులో కలిబెట్టడం ఎందుకు స్వాములూ అని ఒక చిన్న ఆవేదనాపూరిత ప్రశ్న.అంతే! కంపు మీద స్వామిగారి ప్రేమకి కులం కార్డు కూడా పని చేస్తుందని ఒక చిన్న ఇన్ఫో.
@సెప్పుదెబ్బలు గారు : కంపులో కలిబెట్టడం ఎందుకు స్వాములూ అని ఒక చిన్న ఆవేదనాపూరిత ప్రశ్న
నాది కూడా అదే భావన. కానీ మీ టపా టైటిల్ "స్వాములూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకోకుండా ఈ రొచ్చులో వేలెట్టడమెందుకు?" కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంది.. ముక్కు మూసుకొని ఉండాలని ఎవరైనా చెప్పారా లేక రాసారా? ఇప్పుడు మీరిచ్చిన స.ధా కొద్దిగా ఉపశమనం.
Lingayat's dominate in karnataka, even congress, JDS parties look for support of matadhipati's in karnataka, its quite normal here
*మీ ఇంట్లో పని మనిషి కూడా మీలాగే బాగా చదువుకున్నదై ఉంటుందని భావిస్తూ అందుకు సంతోషిస్తున్నాను.*
లేదు ఆమే చదువుకోలేదు. కాని చదువు చెప్పించాను. కాని చదువు లేక పోతేనె చాలా తెలివి గలది. స్రీ స్వేచ్చా, స్రీ పురుష సమానత్వం, కేరీర్ లో విజయం సాదించటం, స్రీ తన కాళ్ళ మీద తాను నిలబడి ఆమే సోసైటిలొ ఆమే ఒక బర్ఖాదత్ అయ్యేటంతటి సామర్థ్యం ఉందని గ్రహించాను. ఈ దేశాం ఎక్కువమంది బర్ఖా దత్ లను తట్టుకోలెదని గ్రహించి, ఆమేకు అవసరమైన మేరకు చదువు చెప్పించి యం.యెస్. సుబ్బలక్ష్మి ని రోల్ మోడల్ గా ట్రైనింగ్ ఇప్పించాను. మొగుడు మాట విని తెచ్చిన డబ్బుతో ఇద్దరు కలసి సంతోషం గా జీవించే విధంగా చర్యలు తీసుకొన్నాను. అంతే కాని కేరీర్ విజయాల మత్తులో పడి బర్ఖాదత్ లా మొగుడు , మొద్దులు ,అచ్చటా ముచ్చటా లేకుండా పొద్దుగూకులు టి.వి. స్టేషన్ లో గడుపుతూ, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏ పని చేస్తున్నామో వొళ్ళు తెలియని స్థితి లోనికి ఆమేని పోనియ లేదు.
అందువలన ఆమే ఇప్పటికి మా ఇంట్లో పని చేస్తున్నాది. నేను నా ఇంట్లో పని మనుషులను తక్కువ భావం తో ట్రీట్మెంట్ ఉండదు. I respect them.
SRI
Kudos to you SRI for making your maid an almost Barkha and MS.
రాజేష్ G, ముక్కు మూసుకోవడమా లేదా అనేది వాళ్ళ ఇష్టం లెండి.
చెప్పుదండ,
స్వామి అనగానే " ముక్కుమూసుకుని తపస్సు చేసుకోకుండా .." అనే విశేషణం చేర్చడం సరికాదు. మతగురువులు సంస్కృతిని రక్షించడానికి పూనుకున్న సంధర్భాలు చరిత్రలో కోకొల్లలు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిది ఓ మతగురువు. మొఘలులకు వ్యతిరేకంగా పోరాడిన సిక్కులు, శివాజీ లను వెనుకవుండి నడిపించింది మతగురువులు, సన్యాసులే. త్రిదండి చిన్న జీయర్ స్వామి సమైక్యాంద్రకు మద్దతు తెలిపి కెసిఆర్ లాంటి ఎదవలతో మాట పడ్డారు. సర్వసంగపరిత్యాగులకైనా దేశభక్తి వుండచ్చు అనుకుంటా.
పై స్థాయి స్వాములు రాజకీయాల్లో ఆసక్తి కలిగివుండటం విమర్శించ తగ్గ విషయం, కాని పౌరులుగా వారి ఆ హక్కు ప్రపంచంలో ఎక్కడవున్నా వుంటుంది దాన్ని ప్రశ్నించడం సరికాదేమో.
రాజకీయాలు ఉన్నవి మన జీవన స్థితిని మెరుగు పరచడానికి. అయితే చదువుకున్న వాళ్లకి, మంచి వాళ్లకి రాజకీయాల మీద ఒకవిధమైన ఏహ్య భావం కలగటం వలన, ఎందోమంది దుర్మార్గులు రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని ఏలటం మొదలుపెట్టారు. దానివాళ్ళ మన లాంటి వాళ్లకి రాజకీయాలంటే మరింత రోచ్చులాగా కనిపిస్తున్నది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఈ కంపు నుండి దూరంగా వెళ్ళటం కాదు, వీలైతే రాజకీయాలను కాస్త మెరుగు పరచడానికి ప్రయత్నించటం (అది మన హక్కు , భాద్యత మరియు అవసరం). అదే ఇప్పుడు మఠాధిపతులు చేస్తున్నది.
మీరు అనొచ్చు, స్కాంలో ఇరుక్కున్న యద్యురప్పని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని? ఎందుకంటే, అతనికి మించి సరైన వాడు లేడు కాబట్టి (నేను కూడా వాళ్ళతో ఏకీభవిస్తాను), అంతే తప్ప యద్యురప్ప Mr. Perfect అని కాదు. ఉన్నవాళ్ళలో సరైన వ్యక్తి ఎన్నుకుంటే పోతే, ఒక ఇరవై సంవత్సరాల తరువాత Mr. Perfect దొరకొచ్చు. కాని సరైన వాడు లేదని చెప్పి పక్కకు వెళిపోతే, 20 సంవత్సరాలు కాదు కదా, 200 సంవత్సరాలు అయినా ఈ దేశం బాగుపడదు.
I second SNKR and Rajesh T.
No one had privilege to control how swamijis to be. It is really a sick-phenomena being used from era of decades by english new channels that swamijis should not enter/involve politics and then that subsequently taken by common people who then use it whenever required at convenience.
We all read about fifth estate(church) that ruled and controlled england reign and which is still continuing here. No one bothered. And mullas ruled(fatwas) in other religion.
Then why not here?
Here swamiji just given support, neither trying to contol nor ruling. But still cry wolf even for that, so pity.
Post a Comment