జగన్ కాలికి బలపం కట్టుకొని ఓదార్పు ఇస్తాను తీసుకోండి అని రేయింబవళ్ళూ తిరిగి విగ్రహాలు ఆవిష్కరించి చేతులూ కాళ్ళూ నొప్పులు తెచ్చుకొన్నాడు కానీ, సోనియా గాంధి కూల్ గా హస్తిన నుంచి వ్యవహారం నడిపి సీఎంని మార్చేసి సోనియా-జగన్ ల చదరంగపు ఆటలో ఈ రౌండ్ లో తనె విజేతనని నిరూపించుకొంది.
తండ్రి ఆవేశమె తప్ప ఎత్తులు,జిత్తులూ జగన్ కి వంటబట్టలేదన్న విమర్శ ఎదుర్కోకూడదంటే తన తరువాతి ఎత్తు జగన్ చాలా జాగ్రత్తగా వేయాలి. ఆలోచన లేని ఆవేశంతోనో, జగనన్న మడమ తిప్పడు అని ఉబ్బెసే చెంచాగాళ్ళ మాటలు వినో,మీడియా చేతిలో ఉందన్న గుడ్డి నమ్మకంతోనో, నేల మాళిగల్లో మూలుగుతూ వేలాది కోట్ల రూపాయలున్నాయన్న అహంతోనో గుడ్డిగా మూందుకు దూసుకుపోతే బొక్క బోర్లా పడి మూతి పళ్ళు రాలిపోయే ప్రమాదం ఉందన్న విషయం మనసులో ఉంచుకొని జగన్ తన తదుపరి ఎత్తు వేస్తే అది అతనికీ, అతన్ని నమ్ముకొని ఊగులాడుతున్న సురేఖ, అంబటి రాంబాబు లాంటి వారికీ మంచిది.
3 comments:
చెంచాగాళ్ళ .../చ్చుట్టు ఉన్నదే వాళ్ళు..
సోనియమ్మా మొండి 'చెయ్యి' చూపించాక కూడా ఇంకా 'చెయ్యి' పట్టుకుని వదలడం లేదు
సొంత కుంపటి పెట్టుకుంటే అంత కన్నా పిచ్చితనం ఉండదు
ఇలాంటప్పుడే నాలాంటి రాజకీయ గురువుని సంప్రదించాలి
ఈసారి ఓదార్పు యాత్రలకి మీ ఊరు వస్తే నన్ను కలవమని చెప్పండి
Post a Comment