నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, November 24, 2010

అమ్మాయిలు లేచిపోకుండా సెల్ ఫోన్లు నిషేధించిన గ్రామం

ముజఫర్ పుర్ లోని లాంక్ అనే గ్రామంలో అన్ని మతాలకూ,కులాలకూ చెందిన పెద్దలందరూ కలిసి పెళ్ళికాని అమ్మాయిలు అబ్బాయిలతో లేచిపోవడం ఈ మధ్య ఎక్కువైపోతున్నందుకు కడు చింతించి అందుకు కారణం కూడా కనుక్కొని దానికి పరిష్కారం కూడా కనిపెట్టి అమలు పరిచిపారేశారు.
 
కుల మత తారతమ్యాలు మరిచి అందరూ ఒక్కతాటిపై నిలిచి కనుక్కొన్న పరిష్కారం ఏమిటంటే పెళ్ళికాని అమ్మాయిలు అబ్బాయిలతో లేచిపోవడానికి అసలు కారణం సెల్ ఫోన్ అని తీర్మానించి, పెళ్ళి కాని అమ్మాయిలు సెల్ ఫోన్ వాడ్డానికి వీల్లేదని ఒక తీర్మానం చేశారు. 

కుల మత వైషమ్యాలు మరిచి అందరు పెద్దలూ ఒక తాటిపై నిలవడం ఆనందదాయకమే కానీ కేవలం సెల్ ఫోన్ వాదకం నిషేధించినంత మాత్రాన ప్రేమలు,లేచిపోవడాలు ఆగుతాయా అన్నది సందేహమే కదా? ఎందుకంటే సెల్ ఫోన్ రాకముందు కూడా ప్రేమలూ,లేచి పోవడాలు ఉన్నాయి కదా?


పనిలో పనిగా టీవీని కూడా నిషేధించి పారేయాలి కదా? పొద్దున లేస్తే టీవీ సీరియల్స్ నిండా అవే ముచ్చట్లు కదా? అలాగే అసలైన లేచిపోవడాలు, లేపుకు పోవడాలు పుష్కలంగా ఉండే సినిమాలని కూడా నిషేధించేస్తే ఇంకా మంచిది కదా! ఇంక మనో ఉల్లాసానికి మార్గమేమిటా అనుకొంటే నవలలు, కథలు కాకరకాయలు చదువుకొంటే అందులో కూడా అవే ముచ్చట్లుంటాయి కదా?
 
ప్రేమ కథలు,నవలలు మానేసి హాయిగా రామాయణం, భారతం, భాగవతాలు చరిత్ర చదువుకోవచ్చు కదా అనుకొంటే అందులో ఈ విషయాలుండవని గ్యారంటీ ఏముంది? రుక్మిణిని ఆమె స్వయంవరం నుంచి కృష్ణుడు లేవదీసుకుపోవడం, సంయుక్తని పృధ్వీరాజు లేవదీసుకు పోవడం లాంటి విషయాలు ఆ అమ్మాయిల మనసుల్ని పాడు చేయవా?
 
అయినా ఆ పెద్దలందరూ కలిసి మరికొంచెం మనసు పెట్టాలే కానీ ఈ సమస్యకు ఫూల్ ప్రూఫ్ సొల్యూషన్ కనుక్కోవడం ఎంతసేపు! అసలు పెళ్ళికాని అమ్మాయిలని అబ్బాయిలని వేర్వేరుగా పెళ్ళయ్యేవరకూ బందిఖానాలో పెట్టేస్తే ఓ పనయిపోదూ?


అయినా వాళ్ళెంతసేపూ పెళ్ళికాని అమ్మాయిల గురించే ఆలోచిస్తే ఎలా? పెళ్ళయిన అమ్మాయిలు తాము అంతకు ముందు ప్రేమించిన అబ్బాయిలతో పెళ్ళయ్యాక లేచి పోకూడదని ఏమైనా గ్యారంటీ ఉందా?

3 comments:

శరత్ 'కాలమ్' said...

మంచిపని చేసారు ఆ గ్రామస్తులు. కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంకా బావుంటుంది. పెళ్ళయిన తరువాత కూడా పారిపోరు. గ్యారెంటీ.

Apparao Sastri said...

శరత్ అన్నా
కాళ్ళు విరగ్గొట్టడం కాదు
ఇంకొంచెం లోతుగా ఆలోచించు .....
అప్పుడు సెల్ ఫోన్స్ ఉన్న పర్లేదు, ఎందుకంటే పారిపొయినా ఉపయోగం ఉండదు

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

What an idea, sirjee!