ఈ మధ్య అస్సలు వార్తల్లోకి ఎక్కక పోవడంతో ఈ సేనానికి ఏమీ తోచలేదేమో పాపం. ఈ సారి సెన్సారు వాళ్ళ మీద పడ్డాడు. బొంబాయి ముంబాయిగా మార్చిపారేసి, ఎక్కడైనా బొంబాయి అని రాసి ఉన్న బోర్డులన్నీ పగలగొట్టినా ఇంకా కొంతమందికి బుద్ధి రాకపోవడంతో సారుకి చిర్రెత్తుకొచ్చింది. ముందుగా సినిమాల సంగతి చూద్దామని నిర్ణయించుకొని సెన్సారు బోర్డు చైర్ పర్సన్ షర్మిలా ఠాగూర్
కి ఒక నోటీసు పంపాడు.
ఏ సినిమాలో అయినా పొరబాటుగానైనా బొంబాయి అన్న శబ్దం వినిపిస్తే ఆ తరువాత జరగబోయే పరిణామాలకి సెనారు బోర్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఒక కటువైన హెచ్చరిక జరీ చేశాడు.
"ఓయ్ సన్నాసీ!What's in a name? అని షేక్స్ పియర్ అనే ఒకాయన ఎప్పుడో చెప్పాడు. బొంబయి అని పిలిస్తే తగ్గేది, ముంబాయి అని పిలిస్తే ఎక్కువయ్యేది ఏమైనా ఉందా? నీకు చేతనయితే బొంబాయి లేదా ముంబాయిలో ఎంతోమంది తిండి అల్లాడేవాళ్ళున్నారు, వాళ్ళకోసం ఏదైనా చెయ్యి.
మురికి వాడల్ని అభివృద్ధి చేసి నీకు ఇష్టమైన బొంబాయి/ముంబాయిని కొంచెం అందంగా తీర్చిదిద్దు. అంతే కానీ, కూటికీ గుడ్డకీ పనికి పనికి రాని విషయాల మీద రాద్ధాంతమెందుకు?" అని ఈ బ్లాగు రాజ్ థాకరే మహాశయుడిని ప్రశ్నిస్తూంది.
1 comment:
మీరు అన్నట్లు, ఇలాంటి వాళ్ళ వల్లనే, most corrupt Congress & Sonia ఈ దేశాన్ని rule చెయగలుగుతున్నారు.
Post a Comment