నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, November 30, 2010

ఆరెంజ్ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారంటే......?

ఈ శీర్షిక చూడగానే నేను ఆరెంజ్ సినిమా చూశానని మీకు అర్ధమైపోయిఉండాలి. నా పట్ల మీ మనసుల్లో పెల్లుబికిన సానుభూతికి ధన్యవాదాలు. విషయమేమిటంటే ఈ సినిమాకి ఆరెంజ్ అన్న టైటిలే ఎందుకు పెట్టారు? ఏ గుమ్మడికాయో,చింతకాయొ అని పెట్టలేదెందుకని అని ఈ బ్లాగుల్లో కొందరు లేవనెత్తిన ప్రశ్నకి నాకు తోచిన సమాధానం ఈ పోస్టు. 
 
దీనికి ఒక చిన్న ప్రయోగం చేయలి. అందుకు కావలసినవి ఒక ఆరెంజ్, ఒక పాత్రలొ నీళ్ళు. ఏదో పోస్టు చదువుదామని కూర్చుంటే ప్రయొగం చేయమంటాడేమిట్రా నీ ఎంకమ్మా అనుకోవద్దు. ప్రయోగం కూడా ఇక్కడే చేద్దాం. ఒక పాత్రలో నీళ్ళు నింపి అందులో ఆరెంజ్ వేయండి. అది మునగదు. ఇప్పుడు ఆరెంజ్ కి తొక్క తీసి వేయండి. నీటిలో మునిగిపోతుంది. సారాంశమేమిటంటే ప్రేమ కూడా ఆరెంజ్ లాంటిదే. దానికి అందమైన అబద్ధాల తొక్క కప్పినంతకాలం మునిగిపోకుండా ఉంటుంది. దాన్ని తొలగించిన మరుక్షణం మునిగిపోతుంది. 
  
భాస్కర్ ఈ విషయాన్నే సినిమాలో చెప్పాడు. అయితే ఈ ఆరెంజ్ ఎక్సపెరిమెంట్ సంగతి అతడి మనసులో ఉందని నేననుకోను కానీ తొక్క తీస్తె ఆరెంజ్ మునిగిపోతుందని చెప్పడానికి రెండున్నర గంటలు తను కష్టపడి, ఆడియెన్స్ ని కష్టపెట్టి నాగబాబు చేత ముప్పయి అయిదు కోట్లు ఖర్చు పెట్టించాడు. 

14 comments:

వేణూ శ్రీకాంత్ said...

లాస్ట్ లైన్ బాగుంది :)

ప్రసీద said...

:).. baavundi..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you, Venu and Praseeda.

ఆ.సౌమ్య said...

ఏమిటో ఆరెంజ్ గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతున్నారు...చూడాలో, వద్దో తెలియట్లేదు :(
మీరేంటి బ్లాగు పేరు మార్చారు?

నేస్తం said...

భలే రాసారండి..హహ ..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సౌమ్య గారూ,బ్లాగు పేరు మార్చలేదు. అప్పారావు శాస్త్రి గారి సూచన మేరకు పేరు ముందు ఒక పదం తగిలించాను. చెప్పుదెబ్బలు గారూ అని పిలవడానికి ఇబ్బందిగా ఉంది అని అన్నారాయన.అందుకోసం ఈ మార్పు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మొదటి అర్ధ భాగం ఓకే. ఎలాగో ఒకలాగా భరించవచ్చు. చివరి అరగంట మెదడుని మిక్సీలో వేసి జ్యూస్ పిండినట్లు అనిపిస్తుంది.జాగ్రత్త.

ఆ.సౌమ్య said...

ఓహ్ అలాగా, కానీ బ్లాగుల్లో చాలామంది కృష్ణలున్నారు. మరి మిమ్మల్ని గుర్తించాలంటే చెప్పుదెబ్బల కృష్ణ అని పిలిస్తే బాగుందదేమో...హిహి just kidding. :D
actually its better to have a name before your blogger. :)

Anonymous said...

baga chepparu, mee vishleshana bane undi, nenu cinma choodledu.

kani maa tv lo program ochindi orange promotion edo. Orange ante pandu kaadu, orange color swachamaina prema ki chihnam ( !!!???) ani aa peru pettam ani aa cinma director, nirmatha vinnavinchu kunnaru. ( orange color prema ki chihnam ani nenu ekkada inledappa).

so ayya, mee vishleshana aa angle lo try cheyandi.

కొత్త పాళీ said...

This is possibly the most intelligent write up on the movie Orange!!
Brilliant and absolutely hilarious.

సుజాత said...

ప్రేమ కూడా ఆరెంజ్ లాంటిదే. దానికి అందమైన బద్ధాల తొక్క కప్పినంతకాలం మునిగిపోకుండా ఉంటుంది. దాన్ని తొలగించిన మరుక్షణం మునిగిపోతుంది. ....wow!

అందమైన "బంధాల" ? లేక అందమైన "అబద్ధాల"? సరిగ్గా చెప్పండి! ..clarity missed!

రవి said...

బావుందండి. భాస్కర్ గారి ’తొక్క’ ఫిలాసఫీ! :))

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

కొత్తపాళీ, thanks very much. I think you are lavish in your praise. సుజాత అది "అబద్ధాల". అ మిస్సయింది. ఇప్పుడు కరెక్ట్ చేశాను.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సౌమ్య, చెప్పుదెబ్బలు కొట్టే కృష్ణ అంటే అది నేనన్నమాట.