2G స్పెక్ట్రం కుంభకోణంతొ పోలిస్తే ఇతర అవినీతి భాగోతాలన్నీ, లక్షకోట్ల అవినీతి అని చెప్పబడుతున్న జగన్ రాజశెఖర రెడ్డిలది మినహాయిస్తే, చిన్నవిగా కనిపిస్తయి. అయితే కామన్ వెల్తు గేమ్స్ బాగోతంలో కల్మాడీని, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ విషయంలో అశోక్ చవాన్ నీ తన్ని తగలేసిన కాంగ్రెస్ అధిష్టానం తన పార్టీ వాడు కాని అవినీతి రాజాగారిమీద అదే దూకుడు చూపించడం లేదు.
ఇందుకు కారణాలు చాలా ఉంటాయి. డీఎంకేతో వారికున్న అవసరాలు ఇత్యాదులు కారణాలయినా ఈ విషయంలొ ఒక సంగతి చెప్పాలనిపిస్తుంది.
ఒకరినో,ఇద్దరు ముగ్గురినో మోసం చేస్తే దాన్ని చీటింగ్ అంటారు. వెయ్యో, పది వేల మందినో మోసం చేస్తే బిజినెస్ అంటారు. కోట్ల మందిని మోసం చేస్తే ముద్దుగా ఎకనామిక్స్ అంటారు.
అదే విధంగా లక్ష కోట్లలో స్కాములు చేసిన వాళ్ళని పార్టీకి అత్యంత ఆప్తులుగ భావించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెద్ద పీట వేయాలని భావిస్తున్నట్టుంది.
No comments:
Post a Comment