నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, November 20, 2010

జగన్ సోనియా ఇద్దరూ(తోడు) దొంగలేనా?

ఇంతకాలం ముసుగులో గుద్దులాటలాగా సాగుతున్న జగన్ సోనియాల పోరాటంలో ఈ రోజు జగన్ ఒక కొత్త రౌండ్ మొదలు పెట్టాడు తన చానల్లో సోనియా మీద డైరెక్ట్ అటాక్ చేయడం ద్వారా?
 

జగన్ మీద వేల కోట్ల అవినీతి ఆరోపణలున్నాయి. జగన్ బావ ఇతర కుటుంబ సభ్యులది కానీ, జగన్ వెన్నంటి ఉండే యూత్ బ్రిగేడ్ నాయకులది కానీ అవినీతి మచ్చ లేని చరిత్రేమీ కాదు. ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో హైదరాబాద్, బెంగళూరులో జగన్ కట్టిన కోటల్ని చూసి అదంతా నీతి నిజాయితీలతో సంపాదించిన సొమ్ము కాదని చెప్పడానికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అఖ్ఖర్లేదు.
 
కేంద్ర నిఘా సంస్థలూ, సీబీఐ,ఏసీబీ, ఈడీ గట్రా అన్నీ సోనియాజీ గుప్పిట్లో ఉన్నాయి. అయినా జగన్ బాబు ఏమీ జంకడం లేదు అంటే ఆవిడ లోగుట్టు కూడా ఈయనకు ఎరికే అన్న నిర్ధారణకు రావాల్నా?


మహానేత గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పటికప్పుడు అమ్మగారి వాటా ఆమెకు ఠంచనుగా అందేదని గుసుగుసలున్నాయి. ఆ విషయాలన్నీ యువనేతకు తెలియకుండా ఉంటాయా? అవెక్కడ బయటకొస్తాయో అని పిల్లవాడి పిర్ర మీద నాలుగు అంటించి దారిలో పెట్టడానికి మేడమ్ జంకుతున్నారా?


ఈ ఇద్దరి లోగుట్టు బయటపెట్టే పెరుమాళ్ళు ఎవరైనా వస్తే బావుణ్ణు. మరి లోగుట్టు పెరుమాళ్ళుకే కదా ఎరిక?

9 comments:

Anonymous said...

Really don't understand what you are trying to say. Sakshi clearly writing about ( what ever may be the reason) delhi politics.you don't want to know the truth about center or you are a supporter of madam?

astrojoyd said...

భారత రాజకీయాల్లో దొంగలు కాని వారి పేరు ఒక్కటి చెప్పండి?[ఇందిర అడుగుపెట్టిన దగ్గర్నుంచి]

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I wish somebody reveal the unholy nexus between Soniya and YSR with details.Not heresay.

మాధవ్ said...

Baboy naakem sambandham ledhu...jus kidding may name is madhav perumal

Anonymous said...

జగన్ ఎడమ చేతి వెంట్రుక కూడా పీకలేదు ఈ ఇటాలియన్ సోనియా.మొండివాడు రాజుకన్నా బలవంతుడు. పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ తనను బహిరంగంగా విమర్శించిన ఒక MP పై చర్య తీసుకోలేకపోవడము ఏమిటి?
ఈ దమ్ము లేని మన్మోహన్,సోనియా ఇంకా దేశాన్ని ఏమి పైకి తెస్తారు? వీళ్ళకి కెసిఆర్ నిరాహార దీక్ష చూసి కూడా వెన్నులో వణుకు వచ్చింది.ఇంకా వీళ్ళు జగన్ ను ఏమి చెయ్యగలరు.వీళ్ళ ప్రతిభ ఇంకో రెండు రోజుల్లో బీహార్ elections రిజల్ట్ లో తెలుస్తుంది. ఆ రాహుల్ గాడు ఒక చేత కాని సన్నాసి.పోయిన 2009 elections లో ఆరుగురికి టిక్కెట్స్ ఇప్పించాడు మన రాష్ట్రములో. ఆ ఆరుగురు ఓడిపోయారు. వీళ్ళని సూసుకొని ఈ రాష్ట్ర కాంగ్రెస్స్ నాయకులు ముందుకుపోతే, తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు పళ్ళెము లో పెట్టి కెసిఆర్ కు ,ఆంధ్రలో చంద్రబాబుకు వెండి పళ్ళెము లో అధికారం అప్పగించడం ఖాయము.
ఒక్క జగన్ ని తొక్కడానికి ఇంతమంది ఏకం కావాల్సిన అవసరము ఉందా? మనోళ్ళు ఒట్టి సవటలోయ్ అని చెప్పిన సామెత కర్రెక్టుగా సరిపోతుంది తెలుగు ప్రజలకి. జగన్ మీద వ్యతిరేకతతో రోశయ్య గారిని సప్పోర్ట్ చేసారు.ఆయనేమో కాళ్ళు బార జాపి కూర్చుకున్నాడు. ఆ అవకాశాన్ని కెసిఆర్ చక్కగా ఉపయోగించుకొని మన వేళ్ళతో మన కళ్ళలోనే పొడుస్తున్నాడు. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహదేవ. ఈ రాష్ట్రాన్ని ఎవడయినా బలవంతుడు,మొండివాడు పరిపాలించకపోతే రాష్ట్ర పరిస్థతి కుక్కలు చింపిన విస్తరే. తస్మాత్ జాగ్రత్త తెలుగోడా!!! తాత్కాలిక ప్రయోజనాలకోసం ఆశించావో నీ ఘోరీ నీవు కట్టుకున్నట్లే. ఇంకా రాజకీయాల్లో సెయింట్ లను ఎక్స్పెక్ట్ చెయ్యడం అత్యాశేనేమో? చూద్దాము,ఈ గొడవల్లో రాష్ట్రము విడిపోయింది అంటే,మన ముందు తరాలవారికి మాకు చేతకాక ఆపలేక పోయాము అని చెప్పుకోవాలి.

Anonymous said...

సోనియా వీర భక్తురాలు నీహారిక చూశారంటే అప్పి-బొప్పికి రొట్లకర్రతో బొప్పి ఖాయం.

Anonymous said...

చెప్పుదెబ్బలబాబూ,
జనాలకి ఉపయోగపడే పని చేయమ్మా, ఎందుకమ్మా ఇలా దొబ్బుతున్నావు.
ఎవడి బ్లాగులూ దొరకనట్టు ఇన్నాళ్ళు నీ బ్లాగు ఫాలో అయ్యి చేసినతప్పుకి లెంపలు లెంపలు.
Good bye

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Anon you are entitled to your opinion. I don't deny that. What's that is different you found in this post from my other posts, My sincere apologies if you are a Jagan fan or loyalist and if I offended you.

Sree said...

రాజకీయాలు ప్రతి చోటా ఉండేవే గురువుగారూ, మహా భారతం లో లేవా రాజకీయాలు? ప్రస్తుతం మనం దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియని అయోమయ స్థితి లో ఉన్నాం. అయినా సరే "ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు.." అని ఏదో పాటలో చెప్పినట్లు మన పని మనం చేసుకుపోవటమే.