నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, November 14, 2010

ఇరాన్ మహిళ కోసం ఉక్రేనియన్ మహిళల టాప్ లెస్ నిరసన

ఇరాన్ లో సకినే  మహమ్మది అష్టియాని అన్న మహిళకి వివాహేతర సంబంధం ఉందని, ఆమెని రాళ్ళతో కొట్టి చంపమని ఒక మతపరమైన న్యాయస్థానం శ్డిక్ష విధించింది. ఆ శిక్ష అమలు కాకుండా చూడాలని మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు, ఈ బ్లాగర్ తో సహా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఇక్కడ లోగడ పెట్టిన పోస్టు ఇక్కడ చూడవచ్చు.  
http://hittingontheface.blogspot.com/2010/07/blog-post.html
మానవహక్కులో అని, మహిళా హక్కులని అనునిత్యం గోల పెట్టే అమెరికన్లు ఈ విషయమై పెద్దగా చేసిందేమీ లేకపోయినా ఫెమెన్ (femen) అనే ఒక ఉక్రేనియన్ మహిళ సంఘానికి చెందిన కొందరు యాక్టివిస్టులు రాజధాని కీవ్ లో జరిగిన ఒక ఇరాన్ సాంస్కృతిక ప్రదర్సనలో తమ పై దుస్తులు విప్పడం ద్వార తమ నిరసన వ్యక్తం చేసి సకినేకి మద్ధతు కూడకట్టడానికి ప్రయత్నించారు.
 

ఇరాన్, ఉక్రేనియాలకి చెందిన అనేకమంది దౌత్యవేత్తలు హాజరైన ఈ ప్రదర్శనలో వాళ్ళు ఈ పని చేశారు. "ఇరాన్ రాయబారి మా దగ్గరకు రాడు కాబట్టి మేమే అతని దగ్గరకొచ్చి మా నిరసన ఈ విధంగా వ్యక్తం చేశాము" అన్నారు ఆ మహిళా సంఘం వాళ్ళు.

No comments: