సాక్షాత్తు ముఖ్యమంత్రి రోడ్డెక్కి ధర్నా చేయడమేమిటి? ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా ప్రజా సంఘాలో,ప్రతిపక్షాలో ధర్నాలు గట్రా చేస్తాయి. ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పడమో, ధర్నా చేసే వాళ్ళని అరెస్టు చేయడమో, లాఠీలతో కుమ్మించడమో, అదీ కాదంటే తుపాకులతో కాల్చి పారేయడమో
చేస్తుంటాయి. ఇప్పుడు స్వయంగా ముఖ్య
మంత్రి, ఇతర మంత్రులూ ధర్నాలో పాల్గొంటే పోలీసులేం చేయాలి పాపం?
ఎవరైనా దొంగని పోలీసులు పట్టుకొంటే వాడు తప్పించుకొని పారిపోవాలని చూడ్డమో, పోలీసుల కాళ్ళా వేళ్ళా పడడమో చేస్తారు. అంతేకానీ తనని పట్టుకోవడం వళ్ళ తప్పు అని పోలీసుల మీద ఎదురుదాడికి దిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు పార్లమెంటులో మన అవినీతి స్పెక్ట్రం డిఎంకే రాజా గారు అదే చేశారు. తన లక్షా చిల్లర కోట్ల అవినీతిని బయటపెట్టినందుకు కాగ్ నే తప్పు పట్టారు.
పాలకులు ధర్నా చేయడం, దొంగ దర్జాగా దొంగతనం బయట పెట్టిన వారిని తప్పు పట్టడం... ఇవన్నీ పోగాలం దాపురించింది అనడానికి నిదర్శనాలు కాక మరేమిటి?
6 comments:
baagaa cheppaaru
సుదర్సన్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రుల స్థాయి వారు ఉల్లికి పడి ధర్నాలకు దిగుతున్నారు. మొన్న హర్యానా ముఖ్యమంత్రి నిన్న రోశయ్య అంతా ఇలా ముఖ్యమంత్రులు బహిరంగ మద్దతు తెలపటం దేనిని సూచిస్తుంది. సుదర్సన్ వ్యాఖ్యలు అబద్దమైతే వాటిని వీరు ఎందుకు ధర్నాలు చేసి ఇంత విలువ నిస్తున్నారు ?
avunu nijangaa poyEkaalamE
subramanyaswamy made this allegation long time back but nobody has taken note of it.only difference is he called sonia KGB agent.he made the allegation that italian mafia is responsible for the deaths of sanjaygandi,indira,rajiv,rajeshpilot,madhavaraoscindia,&jitendraprasada at the behest of sonia.please read the article @http://newsgroups.derkieler.com/archive/soc.culture.indian with the title Italian Mafia in India.
Very startling indeed,sir.
రోశయ్య మరీ రోశి పోయేలా చేస్తున్నాడు. వీడికి ఏళ్ళోచ్చాయి గాని బుర్ర పెరిగినట్టు లేదు. ఏదో అమ్మగారుకి మద్దతుగా ధర్నా అని అంటే, పాల్గోకుంటే ఎక్కడ పీకేస్తారో అనే భయం.
Post a Comment