నాకొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు అని రోశయ్య గారు బాధ పడకూడదు అని ఈ పోస్టు.
రోశయ్యగారు మీరు ఏ పరిస్థితుల్లో పీఠం ఎక్కినా దిగిపోయేనాటికి మీదైన ముద్ర(పాజిటివ్ గా)వేసి దిగుతారని అశించాను. నా ఆశ అడియాసే అయింది. ఎన్నో యుద్ధముల ఆరితేరిన మీరు చివరికి చడీ చప్పుడూ లేకుండా దిగిపోతారని అనుకోలేదు. ఆఫ్ కోర్స్ దాని వెనుక ఇటాలియన్ హస్తం ఉందనుకోండి. ఇన్ని సంవత్సరాలు నంబర్ టూగా ఉన్నా మీకంటూ ఒక ముఠా ఏర్పాటు చేసుకోకపోవడం మీకు ఎంత ప్లస్ అయిందో అది అంతే మైనస్ అయింది. కులంవెనుక దండిగా డబ్బున్నా బలమైన కులం కాకపోవడం మరొక మైనస్.
మీరు మరీ మెతక వైఖరిలో పోతున్నారని కొంచెం ధైర్యం చేయండి సార్ అని నేను కొన్నాళ్ళ క్రితం ఒక పోస్టు కూడా పెట్టాను. మీరు దానిని అప్పుడు చూడలెదనుకుంటా. ఇప్పుడెలాగూ ఖాళీయే కాబట్టి ఇక్కడ చూడండి. http://hittingontheface.blogspot.com/2010/01/blog-post_29.html
అలాగే మీరు మహా నేతగా తయారవ్వాలంటే ఏం చేయాలో కూడా మరొక పోస్టు పెట్టాను. ఇక్కడ చూడండి.
http://hittingontheface.blogspot.com/2010/08/blog-post_22.html
http://hittingontheface.blogspot.com/2010/08/blog-post_19.html
ఇన్ని సార్లు ఆర్ధిక మంత్రిగా పనిచేసి డబ్బు ఎలా దోచేయాలో కూడా తెలియక పోతే ఎలా సార్. దోచుకోవడం అంటూ మొదలు పెడితే వందలు,వేల కోట్లలోనే ఉండాలి అని రాజశేఖరుడి దగ్గర చూసి అయినా నేర్చుకొని ఉండాలి కదా? అది తెలీదనే కదా దోపిడీవిద్యలో ఆరితేరిన మరొక దిగ్గజం మిమ్మల్ని గళ్ళాపెట్టె అని పరోక్షంగా ఎత్తి పొడిచాడు.
పీఠమెక్కించి అధికారమివ్వని అధినేత్రి, మా నాన్న ఖాళీ చేసిన కుర్చీ నాదే కావాలి అని పిచ్చెక్కినట్టు ఏడ్చి చచ్చిన పిల్ల నేత, మాట వినని మంత్రులూ, లెఖ్ఖ చేయని అధికారులు. చేతిలో బెత్తం పట్టుకొని రాముడు భీముడు సినిమాలో భీముడిలాగా అందర్నీ ముడ్డి మీద తన్ని పని చేయించగలిగే నైపుణ్యం లేకపోవడం వల్ల చేతకాని సీఎం అనిపించుకున్నా మీ కోసం చెమ్మగిల్లు నయనమ్ములతో ఈ పోస్టు.
11 comments:
I agree with you.
మీతో ఏకీభవిస్తున్నాను. చేతులు కట్టేసి యుద్ధం చెయ్యమని ఆదేశించి సోనియా రోశయ్య గారికి ఎంత అన్యాయం చేసారో నేనూ ఓ టపా వ్రాస్తాను.
ఏందన్నా, ఈ మధ్య ప్రతీ బలాగుకీ వెళ్ళి ఏకీభవించొత్తన్నావు? నిన్న పెమాదవనంలో కూడ ఏకీభవించావ్....ఏమైనా కొత్త స్ట్రాటజీ నా?
http://vivaadavanam.blogspot.com/
అందరి తోనూ ఎకీభావించేది శరత్ ఒక్కడే
ఎవరన్న పనికోత్తారు కట్టాల్లో అని
@ Anonymassoo, appi
అందరిదగ్గరా తోకాడించడం కంటే ఏకీభవించడం బెటరనే వుద్దేశ్యానికి వచ్చాన్లెండి. చెప్పిన విషయం మంచిదయినప్పుడో, నచ్చినప్పుడో మెచ్చడంలో తప్పేముంది. మనది చాలావరకు ఆంశాలవారీ మద్ధతు.
కాకపోతే కామెంటేసిన ప్రతి కూటమికీ నేను కమిటయ్యిపోయేనట్టేనని కావుకావుమంటారు కొందరు బ్లాగార్భకులు.
నిజమే
మా నారద బ్లాగ్ లో కామెంట్ పెట్టినందుకు మీరు మేం ఒక్కటి అని అన్నారు పెజలు
@@@ మా నారద బ్లాగ్ లో కామెంట్ పెట్టినందుకు మీరు మేం ఒక్కటి అని అన్నారు పెజలు
బాబూ కబుర్లు సెప్పమాకండి. ఆ వివాదవనం పుట్టిందే శరత్ బ్లాగులో. మీరంతా ఒకటే. మద్యలో జనాల్ని ఎర్రి పప్పల్ని చేస్తారు
రోశయ్యను రాహుల్ ద్రావిడ్ తో పోల్చవచ్చు. ఎన్నిసార్లు ఎంతగా ఆదుకున్నా గుర్తింపు వుండదు. ఎప్పటికీ ఎవరి నీడలోనో వుండిపోవాల్సివస్తుంది. అతని మంచిపనులు గుర్తుండవు. బాగా ఆడనిదే గుర్తుంటుంది. ఎన్ని నాయకత్వ లక్షణాలున్నప్పటికీ వ్యర్ధమవుతాయి. ఒకరోజు ఎవ్వరి నయనాలూ చెమ్మగిల్లకుండా నిష్క్రమించాల్సివస్తుంది.
శరత్ చెతులు కట్టేసి యుద్ధం చేయమనడమే కాదు, ఓటమికి బాధ్యుడిని చెయడం కూడా! అన్యాయమ్ కదూ, అందుకే నా నయనములు చెమ్మగిల్లుట. muralikrishna ద్రావిడ్ తో పోలిక సరిగ్గా సరిపోయింది. వీళ్ళ వైఫల్యాలె కానీ విజయాలు ఎవరికీ గుర్తుండవు.
రోశయ్య గారికి నోరు పారేసుకోవడం వచ్చు కాని, చేయి చేసుకోవడం రాదు.
ద్రవిడ్ లాగో లక్ష్మణ్ లాగో మెతకగా ఉంటే కూరలో కరివేపాకులా తీసిపారేస్తారు మరి.
అయ్యా రోశయ్యగారు ,వాలంతరి retirement తీసుకున్నానని ప్రకటించారు మీరు కుడా హయిగా ఇంటర్నెట్ లో తెలుగు బ్లాగులు రాసుకోండి .మీకు చాలా following వుంటుంది .మీ అనుభవసారం జనానికి ఉపయోగపడుతుంది .seriously telling
Post a Comment