నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, November 18, 2010

హీరో గారూ, ఎవరిని మోసం చేస్తారండీ ఈ ట్వీట్లతో?

ఒక వైపు సినిమా సంకనాకి పోతూ ఉందని ఆ సినిమా చూసిన వాళ్ళు,తీసిన వాళ్ళు, దాన్ని కొన్న వాళ్ళు అనుకొంటూ ఉంటే అందులో భాగం ఉన్నవాళ్ళు కొందరు టీవీలలో టాక్ షోలు,లైవ్ ఫోన్ ఇన్ లు గట్రాలలో సినిమా సూపర్, ఇంతవరకూ తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదు. మా సినిమా వసూలు చేయబోయే డబ్బులు దాచుకోవడానికి ఈ దేశంలో ఉన్న బ్యాంకులు చాలవేమో అని ఊదరకొడుతూ ఉంటారు. ఎందుకిదంతా? ఎవడైనా అమాయకుడు అది నమ్మి ఫ్యామిలీని వెంటేసుకొని సినిమా చూడకపోతాడా, ఓ అయిదో ఆరో వందలు రాకపోతాయా అన్న ఆశా? లెక తమని తాము వంచించుకొని ఒక అందమైన అబద్ధంలో జీవించే మానసిక రుగ్మతా?


ఇదంతా ఎందుకంటే ఖలేజా సినిమా గురించి. ఆ సినిమా నాకు ఓకే అనిపించింది. ఆ విషయాన్నే ఒక పోస్టు కూడా పెట్టాను.
http://hittingontheface.blogspot.com/2010/10/blog-post_4337.html

Mahesh Babu

కానీ జనానికి నచ్చలేదు. నెల తిరక్క ముందే విసిరి కొట్టారు. కోట్లు పెట్టి, నెలల తరబడి తీశారని కానీ, అంతకుముందే పులి దెబ్బకి కన్ను లొట్టబోయి ఆ సినిమా నిర్మాత విలవిల లాడుతున్నాడని ఏ మాత్రం జాలి చూపలేదు ఆడియెన్స్.


ఈ సినిమా గురించి తన ట్విట్టర్ పేజీలో సినిమా హీరో చేసిన ట్వీట్స్ చూడండి ఒకసారి. అవి చదివి నాకు నవ్వొచ్చింది. మీలో ఎవరికైనా నవ్వొస్తుందేమోనని ఇక్కడ పెడుతున్నాను. A BIG thanks2 my dear friend trivikram,my amazing producer C kalyan,n d entire unit of khaaleja:)
 Khaaleja is poised2 becum a very big hit at d box office:):)its been 1 of my most satisfying films as an actor..ever!!


A big thankyou to all my fans in usa,as per reports khaaleja will be d biggest grosser for a telugu film ever:)thanku all:)

5 comments:

Anonymous said...

I dont think anything wrong with mahesh comments. it is the anticipation and he didnt present as facts.he said "its been 1 of my most satisfying films as an actor..ever!!"
he has every reason to be because the role is different to his earlier roles.
The consequence or outcome of movie is not expected. That is something different.

Raju P said...

Movie is not that bad, we can enjoy watching it, comedy track is really superb , even better among all current movies

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I agree wirth you that the movie is not that bad. It deserves a better box office show.

కొత్త పాళీ said...

I agree with first Anon. At least he is just tweeting about it - not going out on TV shows and stuff.
Also, I always have this doubt - how much does a hero really know how the overall movie is, and how it is going to fare. I don't think they know much about it.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

May be some one who gets involved with the movie right from beginning to the end of script preparation could have an inkling how the end product is going to turn out.