నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, November 9, 2010

ఇలాంటి బెండు అప్పారావులతో జాగ్రత్తగా ఉండండి

మన దేశంలో డాక్టరవడమంటే చాలా కష్టమైన విషయం. ఎల్కేజీ నుంచే చదువులో రాణించి, కాలేజీకొచ్చాక పుస్తకాలు తప్ప మరొక విషయం పట్టకుండా ఎంట్రన్సులో మంచి రాంకు తెచ్చుకొంటే తప్ప అది అయ్యే పని కాదు. లేదంటే అమ్మా అబ్బా బాగా డబ్బున్నవాళ్ళయి లక్షలు డొనేషన్ కట్టి చదివించాలి. ఇవి రెండూ లేకుండా డాక్టరయ్యే మార్గం ఇంకొకటుంది మన దేశంలో. అది ఆర్ ఎం పీ అవడం. వీళ్ళు చాలా మట్టుకు ఎవరో డాక్టర్ దగ్గర కాంపౌండర్ గానో వార్డుబాయ్ గానో కొన్నాళ్ళు పని చేసి బయటకొచ్చి డాక్టర్ అని పేరు ముందు RMP,PMP అని పేరు వెనక తగిలించుకొని ప్రాక్టీసు చేస్తే అడిగే  
వాళ్ళెవరూ లేరు మన దేశంలో. 
       .



జ్వరానికీ,తలనొప్పి,వళ్ళునొప్పులకీ వీళ్ళ దగ్గర వైద్యం చేయించుకోవడం మేలు కదా అనిపించవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో లక్షలూ ఖర్చుచేసి పేరువెనక MBBS,MD,MS,FRCS,FACS అని తోకలు తగిలించుకొన్న వైద్యుల దగ్గరికి వెళ్తే చిన్న దానికీ టెస్టులు మందుల పేరుతో బాదేస్తారు కదా అనిపించవచ్చు. ఇక్కడివరకూ అయితే ఓకే.


నిజానికి చిన్న చిన్న జబ్బులకి వీళ్ళయితేనే బెటర్. అనవసర టెస్టులూ,మందులూ ఉండవు. ఇక స్కానింగులలాంటిపైన వీళ్ళలో చాలామందికి అసలు అవగాహనే ఉండదు కాబట్టి గొడవే లేదు.

నిజానికి చాలామంది ఆరెంపీలు పేషంట్లకి సోకాల్డ్ క్వాలిఫైడ్ డాక్టర్లతో సమంగానో కొండొకచో మరింత మెరుగ్గానో వైద్యం అందించగల కెపాసిటీ ఉన్నవాళ్ళున్నారు. కోళ్ళఫారాలలాగా ఏ సౌకర్యాలు,పేషంట్లూ లేని ప్రైవేటు మెడికల్ కాలేజీలలో తయారయ్యే వైద్యులకన్నా వీళ్ళు మెరుగే, ఈ పోస్టు అలాంటి వాళ్ళ గురించి కాదు.


చాలామంది ఆరెంపీలకు స్పెషలిస్టులతో, హాస్పిటల్సుతో పరిచయం ఉంటుంది. కొంతమంది దాన్ని తమదగ్గరకు వచ్చే పేషంట్లని అక్కడికి రెఫర్ చేసినప్పుడు వాళ్ళకి మెరుగైన వైద్యం అందడానికి వాడుకొంటే మరికొందరు కమీషన్లు దండుకోవడానికి ఉపయోగించుకొంటారు. మన స్పెషలిస్టులు అవసరం లేకుండా టెస్టులు చేసినట్లే వీళ్ళు అవసరం లేకపోయినా పేషంట్లని పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరకో, ఆసుపత్రులకో తీసుకెళ్ళి రకరకాల స్కాన్లు తీయించి ఆ ఫీజులో తమ వాటా కొట్టేస్తారు. అలాగే ఆపరేషన్లలో కూడా వీళ్ళకి వాటా వస్తుంది కాబట్టి ఎక్కడ మెరుగైన వైద్యం లభిస్తుంది అని కాకుండా ఎక్కడ ఎక్కువ కమీషన్ వస్తుంది అని చూస్తారు.

ఏ స్టార్ హాస్పిటల్లోనైనా ఈ అప్పారావులు పేషంటుని తీసుకెళ్తే అక్కడ పీఆర్వో అని ఒకడు వీళ్ళకి సకల మర్యాదలు చేసి పేషంటు కౌంటర్లో డబ్బులు కట్టగానే అందులోంచి వీళ్ళ వాటా చేతికిచ్చి పంపుతాడు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడ్డ పేషంటుకి డబుల్ వాయింపుడు ఉంటుంది. కానీ వాడికి అది తెలియదు. అబ్బా,మన డాక్టరు మన కోసం హాస్పిటల్ దాకావచ్చి వైద్యం చేయిస్తున్నాడే అని పొంగిపోతాడు. పాపం, పిచ్చి పేషంటు.

6 comments:

astrojoyd said...

కోళ్ళఫారాలలాగా ఏ సౌకర్యాలు,పేషంట్లూ లేని ప్రైవేటు మెడికల్ కాలేజీలలో తయారయ్యే వైద్యులకన్నా /on the name of reservations,govt only encouraging this medical college business..any how..కళ్ళు తెరిపించే పోస్ట్ సోదరా..

కెక్యూబ్ వర్మ said...

good critic.. corporate hospitals kante veelle nayam. leniponi test lato jebulu khaalee chesi raktam pinde pinjaareelu neti so called qualified doctors and corp.hospitals..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you astro.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Agree with you Kcube.

ప్రభు said...

ఇంకో కోణం కూడా ఉంది గురువు గారూ !
మందుల షాపుల వాళ్ళూ, మందుల కంపెనీ వాళ్ళూ, టెస్ట్ సెంటర్ల వాళ్ళూ ఇచ్చే కమీషన్ల కోసం అవసరం లేని టెస్ట్ లూ చేయించి, పనికి రాని మందులూ వాడించి మనను ముహూర్తం కన్నా ముందే చిత్రగుప్తుడి ముందు నిలబెట్టేస్తుంటారు ! బెండు అప్పారావులే కాదు, సగం కన్నా ఎక్కువ డాక్టర్లు కూడా ఇలా మన ధనం, బలం లాగేసే కార్యక్రమంలో బిజీగానే ఉంటున్నారు ఈ మధ్య !

Anonymous said...

e rmplu operations koodaa chesi,praanaalu kooda thakkuvakE theestaaru ,mari evaranna munduku vastaaraa ?lopaanni etthi coopi saricheyyaali kaani ,inko lopaanni (thappunu)netthina pettuko koodadhu.