నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, November 9, 2010

ఈ మాల,మాదిగ నాయకులు ఒక వర్గానికే కొమ్ము కాస్తారా?

ఒక కులానికో,వర్గానికో నాయకత్వం వహించే నాయకులు తమ కులంలో లేదా వర్గంలో ఉన్న వాళ్ళందరినీ రెప్రజెంట్ చేస్తారు. తాము తీసుకొనే నిర్ణయాలు అందులోని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇప్పుడు రాష్ట్రంలోని రెండు బలమైన దళిత వర్గాలు మాల,మాదిగ వర్గాలు. ఒక దానికి నాయకుడు మంద కృష్ణ మాదిగ. మరొక దానికి నాయకుడు జూపూడి. ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్ ఇవ్వలని మిస్టర్ మాదిగ ఇవకూడదని మిస్టర్ జూపూడి కొంతకాలంగా సిగపట్లు పట్టుకొంటున్నారు. అది వేరే విషయం.అయితే రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వీళ్ళిద్దరూ ఇటీవల కొంతకాలంగా ఒక వైపుకి చేరిపోయి ఉండడం కనిపిస్తోంది.
  
కేసీఆర్ దీక్షలోనూ, ఆయనకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించేటప్పుడూ, ఆ తరువాత కూడా ఆయన పక్కనే ఉండి తెలంగాణా కోసం గొంతెత్తుతున్నాడు కృష్ణ మాదిగ. అలాగే జగన్ ఓదార్పులో బిజీగా ఉంటున్నాడు జూపూడి. వీళ్ళకి తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడంలో తప్పు లేదు. అయితే మాదిగలందరికీ నాయకుడిని అని చెప్పుకొనే వ్యక్తి ఒక ప్రాంతానికి కొమ్ము కాస్తె ఎలా? రాయలసీమలో. కోస్తాలో ఉన్న మాదిగలు దీన్ని ఎలా ఒప్పుకొంటారు? అలాగే మాలల నాయకుడు ఒక కాంగ్రెస్ నేత వెనక తిరగొచ్చా?వీళ్ళు తమ వ్యక్తిగత అజెండా ఫాలో అవ్వాలనుకొంటే తమ పదవులకి రాజీనామా చేయాలి కదా?


ఆయా సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు కాని ఇతర సభ్యులు కాని ఈ విషయమ్మీద ఎలాంటి గొడవా చేయకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

12 comments:

Anonymous said...

మీదంతా అగ్రకుల అభిజాత్యం, అగ్రకులాల వాళ్ల బ్రాహ్మినికల్, భావజాలం.

మీ ఆలోచనలు అన్నీ "బ్రాహ్మణీయ ఫ్యూడల్ పితృస్వామ్యం" ఆలోచనల్లో ఉంది.

దాన్ని కూకటివేళ్ళతో పెకలించాలంటే మీమీద ఓ కేసు మా బ్లాగు లోకంలో మా కుల నాయకుడు తో పెట్టించాల్సిందే, పైన కామెంట్లు ఇంతకమందు ఎక్కడయినా కనిపిస్తే అందులో నా తప్పేమి లేదు, మీ ఫ్యూడల్ భావజాలం వలనే కనిపించాయి అని అర్ధం :)

Anonymous said...

కోస్తాలో ఉన్న మాదిగలు కూడా ప్రత్యేక తెలంగాణా కోరుకుంటున్నారు. ఒక వేల SC లో ABCD గ్రూపులు ఏర్పడకుంటే రాష్ట్రం విదిపోయినప్పుదే వారికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది.

Anonymous said...

మాదిగ, మాల కులాలు ఒకటి కావా? తేడా ఏమిటి?

Apparao Sastri said...

భలే పెట్టారు పుల్ల
తెలంగాణా వస్తే దళితుడ్ని సీఎం ని చేస్తా అన్నాడుగా కెసిఆర్ , అందుకే కృష్ణ ముందు చూపుతో ఉన్నాడు

Apparao Sastri said...

అయినా ఈ ఇరు వర్గాలకి మద్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది.
అందుకే ఒకరు కాంగ్రెస్ , మరొకరు TDP లేక తెరాస

Anonymous said...

+++++++++++++++
మాదిగ, మాల కులాలు ఒకటి కావా? తేడా ఏమిటి?
++++++++++

అగ్రకుల అభిజాత్యం అంటే ఇది.
వెనుకబడిన కులాలంటే ఎంత అవగాహనా రాహిత్యమో ఇక్కడ తెలిసిపోతోంది.

వాల్లలో ఒకల్లు యెనకబడ్డోల్లు, ఇంకోల్లు ఇంకా యెనకబడ్డోల్లు.

ఎవరెక్కువెనకబడ్డారో తేల్చాలని కొట్టుకుంటా వుంటారు

Kathi Mahesh Kumar said...

ఈ పరిణామాన్ని మీరు ఇంకొంచెం విశాలగా చూస్తే వేరేగా అర్థమయ్యే అవకాశం ఉంది. Let me try and explain.

తెలంగాణా వాదులు ఏమంటున్నారూ!?
"కలిసి ఉండటం వల్ల వంచనకు గురౌతూ నష్టపోతున్నాం కాబట్టి వేరే రాష్ట్రం కావాలి" అంటున్నారు.

సీమధ్రవాదులు ఏమంటున్నారు!?
"మనమంతా ఒకే భాష మాట్లాడేవాళ్ళం కాబట్టి అన్నదమ్ముల్లాగా కలిసుందాం. విడిపోతే ఐక్యత పోతుంది" అంటున్నారు.

ఇదే పంథా మాల మాదిగల్లో కూడా ఉంది.
మాదిగలు "అన్యాయమై పోతున్నాం. కాబట్టి విడివిడి కేటగరీలు రిజర్వేషన్లో నిర్ణయించండి" అని పట్టుబడుతుంటే, ఇప్పటివరకూ రిజర్వేషన్ లాభాలు ఎక్కువ స్థాయిలో అనుభవించిన మాలలు "వద్దు. కలిసుందాం. అప్పుడే ఐకమత్యంగా పోరాడొచ్చు" అని చెబుతున్నారు.ఇదే వైరుధ్యం వాళ్ళ political affiliations లో ఉన్నాయి.

అదే కాకుండా తెలంగాణాలో మాదిగల సంఖ్య మరియు distribution తీసుకుంటే మంద కృష్టమాదిగ ఎందుకు TRS కు దగ్గరయ్యాడనేది బాగా అర్థమౌతుంది. గద్దర్ పార్టీ పెట్టిన తరువాత ఇప్పుడు TRS తో ఎందుకు విబేధిస్తున్నాడు అనేది కూడా అర్థమౌతుంది. ;)

Praveen Sarma said...

Even people from mala caste like Kathi Padmarao are pro-Telangana. People who invested their money in Hyderabad are mostly forward caste people. Dalits gain nothing in United Andhra. So, dalits of coastal Andhra are supporting separate Telangana.

Anonymous said...

>>So, dalits of coastal Andhra are supporting separate Telangana.

t why are you supporting seperation? which is your group mala or madiga?

Praveen Sarma said...

I belong to kondh, a tribal community seen in Orissa and some parts of Andhra Pradesh and Jharkhand.

tarakam said...

వాళ్ళ నాయకులను విమర్శిస్తున్నారు,మీమీద ఎట్రాసిటీ కేసు పెడతారు జాగ్రత్త

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Yes,yes.Thanks for warning me,sir.