నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, November 11, 2010

సూపర్ డూపర్ స్పెక్ట్రం రాజాధిరాజా!!!

ఏ రంగంలోనైనా కొందరు బెంచ్ మార్క్ సృష్టిస్తారు. ఉదాహరణకి టెస్టు క్రికెట్ లో చాన్నాళ్ళు బ్రాడ్ మన్ చేసిన 29 సెంచరీలు రికార్డుగా ఉండేవి. దానిని గవాస్కర్, ఇప్పుడు టెండూల్కర్ చెరిపివేసి కొత్త రికార్డు స్థాపించారు. మన దేశంలో ఎప్పటికీ వెనుక బడని, మరుగున పడనివీ రెండు: ఒకటి క్రికెట్. అప్పుడప్పుడు మనవాళ్ళ చెత్త ఆటతో వెనుకపడ్డా క్రికెట్ కి క్రేజు తగ్గదు, క్రికెట్ ఆడే వాళ్ళ సంఖ్యా తగ్గదు. ఎన్ని ఫుట్ బాల్ వరల్డ్ కప్పులు, ఒలింపిక్సూ, కామన్ వెల్త్ గేమ్సు వచ్చినా  మన నంబర్ వన్ ఫేవరైట్ క్రికెట్టే. రెండవది రాజకీయుల అవినీతి. ఎన్నికలలో, అసెంబ్లీ, పార్లమెంట్లలో ఎన్ని శ్రీరంగనీతులు వల్లించినా అవినీతికీ నాయకులకీ ఉన్న అవినాభావ సంబంధం నానాటికీ హెచ్చుతుంది గానీ తగ్గడం లేదు.

రాజకీయనాయకుల అవినీతిలో ఒకప్పుడు బొఫోర్సు గురించి ప్రజలు, గిట్టని వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టుకొని చెప్పుకొనేవారు. ఆ తరువాత పీవీ నరసింహారావు గారి హయాంలో యూరియా కుంభకోణం గురించీ అలాగే చెప్పుకొనే వాళ్ళు. తరువాత లలూ యాదవ్ గారు పశువుల దాణా స్కాములో నూతన శిఖరాలని అధిరోహించారు. ఈ చిన్నాచితకా స్కాములని తలదన్నేలా మధు కోడా గారు తన అవినీతి విశ్వరూపాన్ని చూపించి ఔరా అనిపించి అవినీతికి నూతన నిర్వచనం చెప్పారు. ఇప్పట్లో ఆ రికార్డు బద్ధలయ్యేలా కనిపించక పోవడంతో అవినీతి నాయకులని మధు కోడా అని పిలవడం మొదలయ్యింది.మొన్నకు మొన్న మన రాష్ట్రంలో కన్నా లక్ష్మీ నారాయణని ముద్దుగా "మధు కోడా" అని రాయపాటి సాంబశివరావు తిట్టడం గుర్తే కదా.  
  
Records are meant to be broken అని ఊరికే అనలేదు. మన డీఎంకే మంత్రి, కేంద్రంలో టిలికాం శాఖామాత్యులు రాజా గారు తన పేరుని సార్ధకం చేసుకొంటూ  Raja of all scams అని పిలవదగ్గ స్కాముని మన కళ్లముందు ఆవిష్కరింపజేశారు. ఇలా ఈ స్కాముల రంగాన్ని తన అవిరళ కృషితో రాజాగారు అభివృద్ధి చేస్తూ నానా కష్టాలు పడుతూ ఉంటే కుళ్ళుమోతు కాగ్ వాళ్ళు, పనిలేని,పనికి మాలిన ప్రతి పక్షాలు, ఈ బ్లాగోడు ఆడిపోసుకోవడం ఏమైనా బావుందా?
  
నాన్నా రాజాబాబూ, నువ్వు నీ పని కానివ్వు స్వామీ! ఈ లక్షా డెబ్బయి కోట్ల రూపాయలు 2G స్పెక్ట్రం కేటాయింపులో జరిగిన స్కాము. 3G లో ఎంత జరిగిందో ఆ లెక్కలు కూడా బయట పెట్టి నీ ఘనతని అందరికీ చాటి నోళ్ళు వెళ్ళబెట్టేలా చేయి. అలాగే 4G,5G లాంటివి కూడా ఏమైనా వస్తే అప్పుడు కూడా నువ్వే ఆ శాఖకి మంత్రిగా ఉండి ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా, చివరికి నిలువెత్తు అవినీతికి చిహ్నాలని అందరూ ఈసడించుకొనే ఆఫ్రికా దేశాలని కూడా మించిపోయి లోకమంతా ఖాండ్రించి ఉమ్మేసే ఘనకీర్తి మూటగట్టుకొంటావని ఆశిస్తూ ఈ బ్లాగు చదివే వాళ్ళందరి తరఫునా ఆశీర్వదిస్తున్నాను.

3 comments:

astrojoyd said...

raja is one of the dice in this huge briby scandal.the original players were behind the board,if raja opens his mouth means,the govt collopse.

dhruva tara said...

ఈ రాజా గారి గొడవలో పడి మన రాజా ఆఫ్ కరప్షన్ గురించి మరచి పోవడం నాకసలేమీ నచ్చలేదండీ.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

This guy is latest raja.